కలైపులికి ఏడాదిలో 70 కోట్లు

ఏడాదికి ఓ సినిమా చేస్తే సూపర్ స్టార్ కు పది కోట్లో, పాతిక కోట్లో రావచ్చు కానీ, యాభై అరవై కోట్లు అయితే రావు. అలాగే సరైన సినిమా పడితే పది కోట్లో రావచ్చు..కానీ…

ఏడాదికి ఓ సినిమా చేస్తే సూపర్ స్టార్ కు పది కోట్లో, పాతిక కోట్లో రావచ్చు కానీ, యాభై అరవై కోట్లు అయితే రావు. అలాగే సరైన సినిమా పడితే పది కోట్లో రావచ్చు..కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో యాభై కోట్లకు పైగా ఓ నిర్మాతకు ఏడాదిలో వచ్చాయంటే అది కాస్త ఆశ్చర్యమే. అలాంటి ఫీట్ తమిళ నిర్మాత కలైపులి థాను సాధించారని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. 

ఆయన ఈ ఏడాది రెండు భారీ సినిమాలను అందించారు ఒకటి విజయ్ హీరోగా తెరి. రెండవది రజనీ హీరోగా కబాలి. ఈ రెండు సినిమాలకు కలిసి 70 కోట్ల వరకు లాభం వచ్చిందని టాక్ వినిపిస్తోంది. తెరి సినిమాలో ఇరవై కోట్ల వరకు లాభం వచ్చిందట. ఇక కబాలి సినిమా అయితే రజనీ రెమ్యూనిరేషన్ పక్కన పెడితే చాలా కాస్ట్ కటింగ్ తో సినిమా చేసారని అంటున్నారు. 

సినిమా దాదాపు పూర్తిగా అవుట్ డోర్ లో, వీలయినంత నాచురల్ లొకేషన్లలో చేసారు. సరైన కాస్టింగ్ కూడా లేదు. కానీ బిజినెస్ మాత్రం భారీగా చేసారట. దాంతో ఈ సినిమాలో కలైపులి థానుకు 50 కోట్ల వరకు మిగిలిందని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. సినిమా ఫలితం ఎలా వున్నా, కలైపులి థాను మాత్రం మాంచి లాభాలు ఆర్జించి పులి అనిపించుకున్నారన్నమాట.