కోన బ్యాడ్ టైమ్ కంటిన్యూ?

సృజనకారుడిగా గడచిన నాలుగైదు సినిమాల కాలంగా కోన వెంకట్ గట్టి దెబ్బలే తిన్నారు. వెళ్లి అమెరికాలో సైలెంట్ గా కూర్చున్నారు. పోనీ నిర్మాతగా అయినా విజయం సాధిస్తారమో అనుకుంటే, ఆయన తెలుగులో అందించాల్సిన నాగచైతన్య…

సృజనకారుడిగా గడచిన నాలుగైదు సినిమాల కాలంగా కోన వెంకట్ గట్టి దెబ్బలే తిన్నారు. వెళ్లి అమెరికాలో సైలెంట్ గా కూర్చున్నారు. పోనీ నిర్మాతగా అయినా విజయం సాధిస్తారమో అనుకుంటే, ఆయన తెలుగులో అందించాల్సిన నాగచైతన్య సినిమా 'సాహసం..శ్వాసగా..సాగిపో' అలా సాగిపోకుండా పడుకుండిపోయింది. 

కొంత కాలం క్రితం దీనికి హడావుడి చేసారు. ఇప్పుడు చడీ చప్పుడు లేదు. దర్శకుడు గౌతమ్ మీనన్ తో సమస్య ఏమిటంటే ఆయన అన్నీ రెండు భాషల్లో ఇద్దరు హీరోలతో తీయాలనుకుంటారు. ఈ పద్దతి వల్ల చాలా టైమ్ కిల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ సినిమా పరిస్థితి కూడా అదే అని వినికిడి. 

నాగచైతన్య తన మానాన తను ప్రేమమ్ సినిమాలో బిజీ అయిపోయాడు. అక్కడ శింబు ఇబ్బందుల్లో వున్నాడు. దాంతో సినిమా కొద్దిగా వర్క్ వుందనగా పక్కన పడిపోయినట్లుంది. పాపం, దీనిపై పెట్టిన పెట్టుబడి కూడా బ్లాక్ అయిపోయినట్లే కోనకు.