అల్లరోడు ఇంత క్లాసా?

అల్లరి నరేష్ తాజా సినిమా బందిపోటు అడియో విడుదల నేడు జరగనుంది. ఈ సందర్భంగా కొన్ని వాల్ పేపర్లు విడుదల చేసారు. ఇవి చూస్తే అల్లరి నరేష్ ఇంత క్లాస్ నా అనేలా వున్నాయి.…

అల్లరి నరేష్ తాజా సినిమా బందిపోటు అడియో విడుదల నేడు జరగనుంది. ఈ సందర్భంగా కొన్ని వాల్ పేపర్లు విడుదల చేసారు. ఇవి చూస్తే అల్లరి నరేష్ ఇంత క్లాస్ నా అనేలా వున్నాయి. మాంచి ఫీల్ గుడ్ రొమాంటిక్ మూవీ స్టిల్స్ లా వున్నాయి. 

క్లాస్ ఎంటర్ టైన్ మెంట్ అందించే దర్శకుడు ఇంద్రగంటిమోహన కృష్ణ అందిచే ఈ సినిమా ఆయన అభిరుచికి అద్దంపట్టే వుందని ఈ స్టిల్స్ చెప్పకనే చెబుతున్నాయి. అంతకు ముందు ఆ తరువాత సినిమాలో కథానాయిక గా నటించిన ఈష ఈ సినిమలో నరేష్ సరసన నటించింది. 

దొంగలను దోచుకునే బందిపోటు సినిమాలో మాంచి రొమాన్స్ వ్యవహారాలున్నాయని స్టిల్స్ చెప్పకనే చెబుతున్నాయి.