నిర్మాతగా క్రిష్?

గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం వంటి వైవిధ్యమైన సినిమాలు తీసిన క్రిష్ త్వరలో మరో సినిమా చేయబోతున్నట్లు వార్తలు అందాయి. ముకుంద సినిమాతో తెరపైకి వచ్చిన వరుణ్ తేజ రెండో సినిమా క్రిష్…

గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం వంటి వైవిధ్యమైన సినిమాలు తీసిన క్రిష్ త్వరలో మరో సినిమా చేయబోతున్నట్లు వార్తలు అందాయి. ముకుంద సినిమాతో తెరపైకి వచ్చిన వరుణ్ తేజ రెండో సినిమా క్రిష్ దర్శకత్వంలో వుంటుందని వినికిడి.

అయితే ఇంకో విషయం ఏమిటంటే, ఈ సినిమాను క్రిష్ నే నిర్మిస్తాడని కూడా తెలుస్తోంది. బయట నిర్మాతల కోసం గాలిస్తున్నారని, సరైన నిర్మాత దొరికితే ఓకె. లేకుంటే క్రిష్ నిర్మాత కూడా వ్యవహరిస్తారని తెలుస్తోంది. 

సబ్జెక్ట్ మీద క్రిష్ కు అంత నమ్మకం వుందని, అందుకే నాగబాబు కూడా ఎలాగైనా ఓకె అని అన్నరని తెలుస్తోంది. నాగబాబు అయితే ప్రస్తుతం సినిమా నిర్మించే ఆలోచనలో లేరు. పైగా ఆరెంజ్ దెబ్బకు ఆయన తన నిర్మాణ సంస్థను దాదాపు మూత పెట్టేసారు.