పండగ అనే పదం టైటిల్లో వస్తే హిట్ అయ్యిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా హీరో రామ్ నటిస్తున్న చిత్రం 'పండగ చేస్కో' ఎప్పుడో 'రెడీ' తో హిట్ ఇచ్చిన రామ్ మధ్యలో ఎన్నో ప్లాఫ్‌లు ఇచ్చాడు.అందులో 'ఒంగోలు గిత్త' డిజాష్టర్. ఆ సినిమాతో రామ్ ఫాం కోల్పోయి రేస్‌లో వెనుకబడిపోయాడు.
ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో పండగ చేస్కోవడానికి రెడీ అయ్యాడు. కామెడీ చిత్రాలను మలచడంలో గోపీచంద్ మలినేని ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు. వెలిగొండ శ్రీనివాస్ కూడా అలాంటి కథలు అందించడంలో దిట్ట. కాబట్టి ఈసారి ఖచ్చితంగా హిట్ ఇచ్చి పండుగ వాతావరణం కల్పించే ఆశతో ఉన్నాడట. హిట్ అయితే అందరికీ పండుగే. ఫ్లాప్ అయితే పండుగ ఎవరూ చేసుకోరు.
పన్లోపనిగా రామ్ హరికథ అనే ఇంకో సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకటి లేదా రెండు చిత్రాలూ తనని మళ్లీ ఫాంలోకి తెస్తాయని ఆశిస్తున్నాడట. త్వరలో మన ముందుకు రాబోయే చిత్రం మాత్రం పండుగ చేస్కో కాబట్టి ఇల్లు అలికి ముగ్గులు పెట్టుకుందాం.