అమ్మాయిలూ జాగ్రత్త

మళ్లీ టాలీవుడ్ లో కొత్త నెత్తరు పేరిట అమ్మాయిల వేట ప్రారంభమైందని వినికిడి. సినిమా రంగుల ప్రపంచంలో వెలిగిపోవాలని పాపం అమాయకంగా వచ్చే అమ్మాయిలను, తమ తమ అవసరాలకు వాడేసుకునే జనాలు కొంతమంది వున్నారని…

మళ్లీ టాలీవుడ్ లో కొత్త నెత్తరు పేరిట అమ్మాయిల వేట ప్రారంభమైందని వినికిడి. సినిమా రంగుల ప్రపంచంలో వెలిగిపోవాలని పాపం అమాయకంగా వచ్చే అమ్మాయిలను, తమ తమ అవసరాలకు వాడేసుకునే జనాలు కొంతమంది వున్నారని వార్తలు వినవస్తున్నాయి. 

సినిమా తీయడానికి పైసలు లేక, ఇలాంటి ఎత్తుగడ ఎత్తి, ఇలా దొరికిన అమాయకపు అమ్మాయిలను, ఫైనాన్సియర్లకు ఎరగా వేస్తున్నారట. కాస్త డబ్బుండి, అమ్మాయిల పిచ్చి వున్నవారిని పట్టుకుని, తమ సినిమాల్లో భాగస్వాముల్ని చేసుకుంటున్నారట. వాళ్లకు అమ్మాయిలు కావాలి. వీళ్లకు పెట్టుబడి కావాలి. పాపం, అమ్మాయిలకు సినిమా చాన్స్ కావాలి. 

ఓ నిర్మాత ఇలాంటి వ్యవహారాల్లో ఆరి తేరారని టాలీవుడ్ లో గుసగసులు వినిపిస్తున్నాయి. ఆయన ఓ డబ్బున్న బాబును పట్టుకుని, తన సినిమాలకు కాస్త కూస్తో పెట్టుబడులు పెట్టిస్తున్నారని, ఆయనకు ఈ విధమైన అవసరాలు తీరుస్తున్నారని టాక్. 

ఇవేవీ తెలియని అమాయకపు అమ్మాయిలు బ్యానర్ తెలిసున్నదే కదా అనో,లేదా ఫలానా ఆయన కదా అనో అటు వెళ్తున్నారట. తీరా చాన్స్ వెనుక వ్యవహారాలు తెలిసాక, కొందరు సరే అనక తప్పడం లేదని తెలుస్తోంది. 

ఎవరి అవసరాలు వారివి. ఎవరి ఎక్స్ పాయిటేషన్ల వారివి. ఏం చేస్తాం..'చిత్ర' పరిశ్రమ కదా.