ఆగడు దారుణంగా డిస్సపాయింట్ చేసింది. అందరూ శ్రీనువైట్లు పనైపోయింది అనుకున్నారు. ఆయన కూడా చరణ్ సినిమా దొరకబుచ్చుకోవడానికి చాలా ఇబ్బందులే పడ్డారు. తనకు నచ్చని వారితో రాజీకి దిగారు. ప్రకాష్ రాజ్, కోనవెంకట్ తదితరులతో చేతులు కలపక తప్పలేదు.
అయితేనేం, చరణ్-శ్రీనువైట్ల కాంబినేషన్ మాత్రం మాంచి క్రేజ్ నే సంతరించుకుంటోంది. ఓవర్ సీస్ లో మంచి ప్రైయిస్ పలికిన ఈ సినిమా ఇప్పుడు శాటిలైట్ మార్కెట్ లో చరణ్ కు మంచి రేటు వుందని ప్రూవ్ చేసింది.
సుమారు 13 కోట్లకు పైగా చెల్లించి, జీ నెట్ వర్క్, తెలుగు, హిందీ డబ్బింగ్ వెర్షన్ శాటిలైట్ హక్కులు తీసుకుంది. ఇదంతా చూస్తుంటే నిర్మాత దానయ్య పంట పండినట్లే వుంది. ఈ సినిమా హిట్ కావాలే కానీ, మళ్లీ శ్రీను వైట్ల పులైపోతాడు. ఇప్పటికే అఖిల్ తో ఓ సినిమాకు సన్నాహాలు చేస్తున్నాడు.