బాబు గారు మందు కొడితే..

మందు మాలచ్చిమి మా చెడ్డది.. నాలుగు చుక్కలు లోపలికి వెళితే, లోపల వున్న అభిప్రాయాలు అన్నీ బయటకు కక్కించేస్తుంది. ఇటీవల అదే జరిగింది. మందు కొడితే తాండవం ఆడేసే టాప్ హీరో ఒకరున్నారు. ఇటీవల…

మందు మాలచ్చిమి మా చెడ్డది.. నాలుగు చుక్కలు లోపలికి వెళితే, లోపల వున్న అభిప్రాయాలు అన్నీ బయటకు కక్కించేస్తుంది. ఇటీవల అదే జరిగింది. మందు కొడితే తాండవం ఆడేసే టాప్ హీరో ఒకరున్నారు. ఇటీవల హైటెక్ సిటీ వెనకాల వున్న సైబర్ సిటీ ప్రాంతంలోని ఓ హోటల్ లో చిన్న పార్టీ జరిగింది. దానికి ఆ టాప్ హీరో హాజరయ్యారని వినికిడి. 

కాస్త మందేయగానే ఆయన ఒకటే డైలాగును పదే పదే రిపీట్ చేసారట. ఇంతకీ ఆ డైలాగ్ సారాశం ఏమిటంటే, సినిమా రంగంలో వున్న ఇద్దరు వారసులు అస్సలు సినిమాకు పనికి వచ్చే ఫేస్ లు కావన్నది. ఓ వారసుడు ఇప్పటికి చాలా సినిమాలే చేసాడు…ఇంకోవారసుడు ఇప్పుడిప్పుడే మొదలుపెట్టాడు. వీళద్దిరి ఫేస్ లపై, పదే పదే సెటైర్ డైలాగ్ వేయడంతో, బలవంతపు నవ్వులు నవ్వడం అక్కడున్నవారి వంతయింది. ఏమయినా..మందు మాలచ్చిమి..మా చెడ్డది..కాని పనులు చేయించేస్తది.