సూపర్‌స్టార్‌ డాన్సులు అదుర్స్‌.?

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌ తన తాజా చిత్రం ‘ఆగడు’ కోసం డాన్సుల్లోనూ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. ‘1’ సినిమాకి ముందు వరకూ డాన్సుల్ని సీరియస్‌గా తీసుకోని మహేష్‌, ‘1’ సినిమాకి సంబంధించి డాన్సులపైనా…

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌ తన తాజా చిత్రం ‘ఆగడు’ కోసం డాన్సుల్లోనూ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. ‘1’ సినిమాకి ముందు వరకూ డాన్సుల్ని సీరియస్‌గా తీసుకోని మహేష్‌, ‘1’ సినిమాకి సంబంధించి డాన్సులపైనా ఫోకస్‌ పెట్టడం, ఆ సినిమాలో డాన్సులు మహేష్‌ అభిమానుల్ని అలరించడం తెల్సిన విషయాలే. దాన్ని కంటిన్యూ చేస్తూ, ‘ఆగడు’లోనూ మహేష్‌ డాన్సులు ఇరగదీశాడట.

ప్రస్తుతం ప్రచారం కోసం రూపొందించిన ట్రెయిలర్‌లో మహేష్‌ డాన్సులు అభిమానుల్ని ఉర్రూతలూగిస్తున్నాయి. ‘ఆగడు’ సినిమా కోసం మహేష్‌ కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్‌తో డాన్సులేయించుకున్నాడు. ‘1’ సినిమాకి కూడా ప్రేమ్‌ రక్షిత్‌ పనిచేసిన విషయం విదితమే. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కూడా ఇదివరకు ప్రేమ్‌ రక్షిత్‌తో సినిమాలు చేయించుకుని డాన్సుల్లో దుమ్మురేపారు.

ఇక, ప్రేమ్‌రక్షిత్‌ పనితనం గురించి ‘ఆగడు’ ఆడియో విడుదల వేడుకలో మహేష్‌ ప్రత్యేకంగా ప్రస్తావించాడు కూడా. అందుకే ప్రేమ్‌రక్షిత్‌, ‘ఆగడు’ సినిమాని డాన్సుల పరంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మొత్తమ్మీద, ‘ఆగడు’తో మహేష్‌ డాన్సుల పరంగా సత్తా చాటుకోనున్నాడన్నమాట. చూద్దాం.. మహేష్‌ ‘ఆగడు’ కోసం ఏ రేంజ్‌లో డాన్సులేశాడో.!