భారీ సిక్సర్‌ బాది.. వికెట్‌ పారేసుకుని..

ఆస్ట్రేలియాపై సెమీస్‌లో కదం తొక్కుతారనుకున్న భారత బ్యాట్స్‌మన్‌ అలవోకగా వికెట్లు పారేసుకుంటున్నారు. భారీ సిక్సర్‌ కోసం ప్రయత్నించి శిఖర్‌ ధావన్‌, కన్‌ఫ్యూజన్‌లో కోహ్లీ వికెట్‌ పారేసుకుంటే.. భారీ సిక్సర్‌ బాది, ఆ వెంటనే బంతిని…

ఆస్ట్రేలియాపై సెమీస్‌లో కదం తొక్కుతారనుకున్న భారత బ్యాట్స్‌మన్‌ అలవోకగా వికెట్లు పారేసుకుంటున్నారు. భారీ సిక్సర్‌ కోసం ప్రయత్నించి శిఖర్‌ ధావన్‌, కన్‌ఫ్యూజన్‌లో కోహ్లీ వికెట్‌ పారేసుకుంటే.. భారీ సిక్సర్‌ బాది, ఆ వెంటనే బంతిని వికెట్ల మీదకు ఆడుకుని ఔట్‌ అయ్యాడు ఓపెనర్‌ రోహిత్‌ శర్మ.

మిచెల్‌ జాన్సన్‌ రెండు వికెట్లు తీసి, టీమిండియాని ఇబ్బందుల్లోకి నెట్టేశాడు. హేజెల్‌వుడ్‌కి ఒక వికెట్‌ దక్కింది. ఓ వికెట్‌ పడగానే జాగ్రత్తపడాల్సింది పోయి, తదుపరి బ్యాట్స్‌మన్‌ మరింత నిర్లక్ష్యంగా ఆడుతుండడంతో టీమిండియా విజయంపై భారత క్రికెట్‌ అభిమానులకు ఆశలు సన్నగిల్లుతున్నాయి. సెకెండ్‌ బ్యాటింగ్‌ చేసిన జట్టుకి సిడ్నీ మైదానంలో విజయావకాశాలు ఎక్కువగా వున్నా, బాధ్యతా రహితమైన బ్యాటింగ్‌తో టీమిండియా విజయావకాశాల్ని దెబ్బ కొడ్తోంది.

స్కోర్‌ బోర్డ్‌ మూడంకెలకు చేరకుండానే మూడు వికెట్లు కోల్పోవడం ద్వారా, టీమిండియా తీవ్రమైన ఇబ్బందుల్లో పడిపోయింది. ఈ టైమ్‌లో జట్టును ఎవరు ఆదుకుంటారనేదానిపైనే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి వున్నాయి.