సెమీస్‌లో నిండా మునిగిన ధోనీ సేన

వరల్డ్‌ కప్‌ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో ధోనీ సేన నిండా మునిగిపోయినట్టే. 100 పరుగుల్లోపే మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా, 38 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసి,…

వరల్డ్‌ కప్‌ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో ధోనీ సేన నిండా మునిగిపోయినట్టే. 100 పరుగుల్లోపే మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా, 38 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసి, పీకల్లోతు కష్టాల్లో వుంది. 

కష్ట కాలంలో టీమిండియాని రహానే, ధోనీ జోడీ కాస్సేపు ఆదుకున్నా, 44 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద రహానే ఔటయ్యేసరికి, టీమిండియా పరాజయం దాదాపు ఖాయమైపోయింది. అద్భుతం జరిగితే తప్ప టీమిండియా సెమీస్‌లో గట్టెక్కే అవకాశాలే కన్పించడంలేదు. ఆసీస్‌ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో, టీమిండియాని కట్టడి చేస్తోంటే, టీమిండియా ఏ దశలోనూ ఆసీస్‌పై ఒత్తిడి తీసుకురాలేని పరిస్థితుల్లో వుంది.

రవీంద్రజడేజా, ధోనీ నిలబడితే మ్యాచ్‌పై కాస్తయినా ఆశలు పెట్టుకోవచ్చు. కానీ, సొంత గడ్డపై ఆసీస్‌, దొరికిన అవకాశాన్ని చేజార్చుకుంటుందని అనుకోలేం. ఆశ్చర్యకరమైన విషయమేంటటే ఇప్పటిదాకా టీమిండియా బ్యాట్స్‌మెన్‌ ఎవరూ అర్థ సెంచరీ సైతం చేయలేకపోవడం.