ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాత యూనివర్సిటీల్లో ఎంబీఏ పూర్తి చేసిన వారిలో దాదాపు పాతిక శాతం మంది నిరుద్యోగులుగా కాలం గడుతున్నారంటున్నాయి అధ్యయనాలు. ప్రఖ్యాత యూనివర్సిటీలు హార్వర్డ్, స్టాన్ ఫోర్డ్, వార్టన్ వంటి వర్సిటీల్లో ఎంబీఏ డిగ్రీలు తీసుకుని బయటపడిన వారిలో కూడా ఉద్యోగాలు లభిస్తున్నది నూటికి 75 శాతం మందికేనట. మిగతా వారు నెలలు గడుస్తున్నా నిరుద్యోగులుగా కాలం వెల్లదీస్తున్నారని ఒక అధ్యయనం చెబుతూ ఉంది.
మరి ఆ వర్సిటీల్లో చదివితే చాలు జన్మధన్యం అయిపోయినట్టే, అక్కడ ఎంబీఏ చేసుకురావడం అంటే ప్రపంచాన్ని జయించడమే నయా జనరేషన్ లో అన్నట్టుగా ఉన్న అంచనాలు ఏమి కావాలనేది ఇప్పుడు వేసుకోవాల్సిన ప్రశ్న!
మరి ఇంతకీ ప్రఖ్యాత వర్సిటీల్లో విద్యను పూర్తి చేసి వచ్చినా, ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక డిగ్రీని చేతబట్టినా ఉద్యోగం ఎందుకు లభించడం లేదు? అనే ప్రశ్నకు పలు రకాల సమాధానాలు వినిపిస్తూ ఉన్నాయి.
అందులో ముఖ్యమైనవి.. ప్రస్తుతం టెక్ పరిశ్రమలు ఎంబీఏ గ్రాడ్యుయేట్ల నియామకం పట్ల ఉత్సాహాన్ని చూపించడం లేదు అనేది ఒకటి. రెండోది.. ఆ ప్రఖ్యాత వర్సిటీల్లో చదివిన వారు తొలి ఉద్యోగం కోసమే భారీ ప్యాకేజ్ ను డిమాండ్ చేస్తున్నారు, దీంతో ఇండస్ట్రీస్ వారిని అంత జీతాలు ఇచ్చి తీసుకోవడానికి ఉత్సాహం చూపడం లేదు. వారిలో కూడా తక్కువ జీతానికి ఓకే అంటే వారికి ఉద్యోగాలు కాస్త సులభంగా దొరుకుతున్నాయి.
తాము హార్వర్డ్ కాబట్టి, స్టాన్ ఫోర్డ్ కాబట్టి.. ఇంతే కావాలని గీతలు గీసి కూర్చున్న వారే నిరుద్యోగుల్లో ప్రముఖంగా ఉంటున్నారని మరో అంచనా. ఇంకో వైపు ఏఐ విజృంభణ కూడా ఈ పరిస్థితి ఒక కారణం అనే విశ్లేషణ వినిపిస్తూ ఉంది.
వీటితో పాటు వినిపిస్తున్న విశ్లేషణల్లో మరోటి.. విశ్వ విఖ్యాత వర్సిటీల్లో ఎంబీఏలను పూర్తి చేసి వచ్చినా వారికి తగిన స్కిల్స్ ఉండటం లేదనేది! ఇండియాలో ఆ మధ్య ఐఐటీల విషయంలో ఇలాంటి వార్తలే వచ్చాయి. ఐఐటీల్లో చదివినా ఉద్యోగాలు దొరకడం లేదు, ఇక ఇతర వర్సిటీల సంగతికి వస్తే పేరుకే డిగ్రీలు, బీటెక్ , ఎంబీఏలు, ఎంసీఏలు పూర్తి చేసినా అందుకు తగ్గ స్కిల్స్ భారతీయ విద్యార్థుల్లో ఉండటం లేదని, స్కిల్ ఉన్న వారికి డిమాండ్ ఉన్నా ఆ స్కిల్స్ ను మనోళ్లు అందిపుచ్చుకోలేకపోవడం వల్ల ఉద్యోగాలు పొందలేకపోతున్నారనే మాట వినిపించింది.
ఇప్పుడు విశ్వవిఖ్యాత వర్సిటీల విషయంలో కూడా అదే మాటే వినిపిస్తూ ఉంది. అక్కడ ఎంబీఏలు పూర్తి చేస్తున్న వారికి కూడా పరిశ్రమకు అవసరమైన స్కిల్స్ లేవని విశ్లేషిస్తున్నారు. దీనికి తోడు కంపెనీలు కూడా కేవలం డిగ్రీలు చూసి ఉద్యోగాలు ఇచ్చే రోజులు పోయాయని, డిగ్రీల కన్నా స్కిల్ కే కంపెనీలు ప్రాధాన్యతను ఇస్తున్నాయనే విశ్లేషణ కూడా ఈ విషయంలో వినిపిస్తూ ఉంది.
Last 3 years nunchi market is slow le ra lafut. Andulo H, S etc. annitlonu there is a bunch of people who are taken for diversity like music, arts etc. vallaki main market lo ventane jobs emuntayi? prime example mana rahul baba gaadu. vaadu H. vaadini burra vunna evadanna hire chesukuntada? India sangathi vere. Asalu mana ghodi gaadu last 10 years lo jobs creation adi kooda high end jobs meeda focus emi pettadu.
Well , modi gaaru failed in job creation. That’s one thing he is lacking
Jobs eyi ra ghodi ante tea kaasuko adi kooda manchi pane ani cheppina goppodu mana ghodi. jai ghodi baba.
stanmford graduates wants DCM post in governament.
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
STANFORD అయినా లాభసాటి బేరం అని రాజకీయంలోకి వచ్చింది. లేకపోతే సేవ కోసం అనుకున్నావా దావోస్ లో దాపెట్టిన దానవ.
అవును మరి ..గగన్ అన్న కూడా సేవ చేయడానికి ఇటలీ మాతను ఎదిరించి సొంత పార్టీ పెట్టుకున్నది ..
అందుకే జగన్ తెలివిగా లండన్ లో ఎంబీఏ చేసిన కూతురుకి జోగి రమేష్ కొడుకుతో , ఇంకో దానికి చెవిరెడ్డి కొడుకుతో …భలే లాభసాటి బేరాలు
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ