జ‌ట్టుకు భారంగా రోహిత్, విరాట్!

ఇక‌నైనా వీరిని ప‌క్క‌న పెట్టి.. యువ ఆట‌గాళ్ల‌కు అవ‌కాశాలు ఇస్తే వాళ్లైనా శ్ర‌ద్ధ చూపే అవ‌కాశం ఉంది.

వాళ్లిద్ద‌రూ నిస్సందేహంగా క్రికెట్ లెజెండ్ లే! త‌మ ఫామ్ అద్భుతంగా ఉన్న రోజుల్లో ఎన్నో అద్భుత రికార్డుల‌ను సృష్టించారు. వ‌న్డే క్రికెట్ లో, టీ20ల్లో వాళ్లిద్ద‌రూ త‌మ పేరిట అద్భుత‌మైన రికార్డుల‌ను క‌లిగి ఉన్నారు. టీనేజ్ నుంచినే ప్రపంచ క్రికెట్ లో ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటూ వ‌చ్చారు. భార‌త క్రికెట్ జ‌ట్టును అద్భుత‌మైన స్థాయిలో నిల‌ప‌డంలో వారి పాత్ర కూడా కాద‌న‌లేనిది.

గ‌త ద‌శాబ్దంన్న‌ర భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో ప్ర‌త్యేక‌మైన ఆట‌గాళ్లుగా, అద్భుత‌మైన ఆట‌గాళ్లుగా నిలిచిన వారిద్ద‌రే విరాట్ కొహ్లీ, రోహిత్ శ‌ర్మ‌. వీరిని పొగ‌డటం మొద‌లుపెడితే, వీరి ఆట‌లో సొగ‌సును వివ‌రించ‌డం మొద‌లుపెడితే ఎంత చెప్పినా త‌క్కువే! త‌మ కీర్తి కిరీటంలో ఎన్నో విజ‌యాల్లో కీల‌క పాత్ర‌ను పోషించిన చ‌రిత్ర‌ను క‌లిగి ఉన్నారు వీరిద్ద‌రూ! అయితే.. ప్ర‌స్తుతం జ‌ట్టు గురించి మాట్లాడ‌టం మొద‌లుపెడితే, రోహిత్- విరాట్ లు విమ‌ర్శ‌ల‌కు గుర‌వుతున్నారు!

బోర్డ‌ర్- గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాలో భార‌త బ్యాటింగ్ గురించి మాట్లాడితే.. రోహిత్ శ‌ర్మ ప్ర‌థ‌మ ముద్దాయిగా నిలుస్తుంటే, రెండో ముద్దాయిగా విరాట్ కొహ్లీ నిలుస్తున్నాడు. దాదాపు త‌మ కెరీర్ చ‌ర‌మాంకంలో ఉన్న ఈ ఇద్ద‌రు స్టార్ బ్యాటర్లు.. ఈ త‌ర‌హా సెండాఫ్ ను అందుకునేలా ఉండ‌టం కాస్తంత ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉంది.

స్వ‌దేశంలో టీమిండియా న్యూజిలాండ్ చేతిలో టెస్టు సీరిస్ ను కోల్పోవ‌డ‌మే రోహిత్ కు అత్యంత అవ‌మాన‌క‌రం. అది కూడా ఇండియాలో టెస్టు మ్యాచ్ గెలిచే ముప్పై యేళ్లు గ‌డిచిన న్యూజిలాండ్ జ‌ట్టు ఈ సారి ఏకంగా సీరిస్ ను గెల‌వ‌డ‌మే కాదు, క్లీన్ స్వీప్ చేసుకెళ్లింది. దీంతో వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ లో కూడా టీమిండియా ఫైన‌ల్ అవ‌కాశాల‌ను దెబ్బ‌తీసుకుంది. అయితే ఆస్ట్రేలియాలో బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్టులో టీమిండియా భారీ విజ‌యం సాధించే స‌రికి కాస్త ప‌రువు నిలిచే ప‌రిస్థితి ఏర్ప‌డింది. కానీ రోహిత్ అక్క‌డ‌కు వెళ్లి తిరిగి కెప్టెన్సీ తీసుకున్నాకా..మొత్తం ప‌రిస్థితి త‌ల‌కిందులైంది.

తొలి టెస్టులో బుమ్రా కెప్టెన్సీలో టీమిండియా భారీ విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఆ మ్యాచ్ తీరు చూశాకా.. ఆస్ట్రేలియ‌న్ మాజీలు బెంబేలెత్తిపోయారు. ఇప్ప‌టికే వ‌ర‌స‌గా ఆస్ట్రేలియాలో రెండు ప‌ర్యాయాల పాటు టెస్టు సీరిస్ ను నెగ్గిన టీమిండియా ఈ సారి ఆసీస్ ను మ‌రింత చిత్తు చేస్తుందేమో అనే ఆందోళ‌న వారిలో క‌నిపించింది. అయితే రోహిత్ కెప్టెన్సీలో రెండో టెస్టు మొద‌ల‌య్యాకా సీన్ రివర్స్ అయ్యింది. డే అండ్ నైట్ టెస్టులో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది.

తొలి మ్యాచ్ విజ‌య స్ఫూర్తి ఏ ద‌శ‌లోనూ క‌నిపించ‌లేదంటే ప‌రిస్థితిని అర్థం చేసుకోవ‌చ్చు. ఒక మూడో టెస్టు మ్యాచ్ స‌రికి ప‌రిస్థితి మ‌రింత ద‌య‌నీయంగా మారింది. అయితే వ‌రుణుడి కరుణ‌తో దాదాపు రెండు రోజుల ఆట పూర్తిగా ర‌ద్ద‌వ్వ‌డంతో టీమిండియాకు అక్క‌డ ఓట‌మి త‌ప్పింది. ఫాలోఆన్ గండం నుంచి టెయిలెండ‌ర్లు కాపాడ‌టంతో కూడా ప‌రువు ద‌క్కింది. వ‌రుణుడి అడ్డంకి లేక‌పోవ‌డంతో.. మూడో టెస్టులో టీమిండియా ప‌రిస్థితి ఊహించుకోవ‌డానికి కూడా క‌ష్ట‌మ‌య్యేది. ఇక నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ ఫెయిల్యూర్ స్టోరీ కొన‌సాగింది. ప‌ట్టుమ‌ని ప‌ది బాల్స్ ఆడ‌టానికి కూడా చాలా ఇబ్బంది ప‌డుతూ ఉన్నాడు.

రోహిత్ కు స్థానం కోస‌మంటూ యువ ఆట‌గాళ్లు త్యాగం చేస్తూ ఉన్నారు. వారికే ఇంకాస్త అవ‌కాశాలు ఇచ్చి ఉంటే వారైనా భ‌విష్య‌త్తుకు త‌యార‌వుతారు. అయితే ప‌ది బాల్స్ ఆడ‌లేక‌పోయినా రోహిత్ నే కొన‌సాగించ‌క త‌ప్ప‌ని పరిస్థితి. అదేమంటే కెప్టెన్. అస‌లు మొద‌టి మ్యాచ్ కు బుమ్రా చ‌క్క‌గా కెప్టెన్సీ చేసి గెలిపించుకున్నాడు. రోహిత్ కెప్టెన్సీని కూడా భార‌త మాజీలే విమ‌ర్శిస్తూ ఉన్నారు. కేవ‌లం బ్యాట్స్ మ‌న్ గానే కాకుండా కెప్టెన్ గా కూడా రోహిత్ విఫ‌లం అవుతున్నాడ‌నే విమ‌ర్శ వ‌స్తోంది.

ఒక‌వేళ బ్యాటింగ్ ఆడుతూ ఉంటే.. రోహిత్ కెప్టెన్సీ గురించి కామెంట్ చేసే ధైర్యం ఎవ‌రికీ ఉండేది కాదు. తొలి మ్యాచ్ కు ముందు టీమిండియాపై ఎలాంటి అంచ‌నాలు లేవు. అయినా భారీ విజ‌యం ద‌క్కింది. రోహిత్ తిరిగి ప‌గ్గాలు అందుకోవ‌డం ద‌గ్గ‌ర నుంచి ప‌రిస్థితి రివ‌ర్స్ అయ్యింది. నాలుగో టెస్టు ఫలితంలో కూడా టీమిండియా వెనుక‌ప‌డితే మాత్రం.. రోహిత్ పై ముప్పేట దాడి త‌ప్ప‌దు!

స్వ‌దేశంలో న్యూజిలాండ్ చేతిలో చిత్త‌యిన‌ప్పుడే రోహిత్ ను పూర్తిగా ప‌క్క‌న పెట్టేసి ఉంటే స‌రిపోయేది. అప్పటికే బ్యాటింగ్ విష‌యంలోనూ, కెప్టెన్సీ విష‌యంలోనూ రోహిత్ తేలిపోయాడు. అయినా సెలెక్ట‌ర్లు రోహిత్ కే ప్రాధాన్య‌త‌ను ఇవ్వ‌డం విచార‌క‌ర‌మైన అంశం. ఇక కొహ్లీ బ్యాటింగ్ తీరు గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఒకే త‌ర‌హా బంతికి ప‌దే ప‌దే ఔట్ అవుతున్నాడు. అస‌లు అలా త‌న ప్రాథ‌మిక లోపాన్ని ఇన్నేళ్లుఅయినా అధిగ‌మించ‌లేని ఇత‌డు చాంఫియ‌న్ బ్యాట‌ర్ ఎలా అవుతాడ‌బ్బా అనే సందేహాన్ని జ‌నింప‌చేస్తూ ఉన్నాడు!

వాస్త‌వానికి కీర్తి, డ‌బ్బు విష‌యంలో తిరుగులేని స్థితిలో ఉన్న విరాట్, రోహిత్ ల‌కు ఇప్పుడు త‌మ బేసిక్స్ ను స‌రిచేసుకోవ‌డానికి కూడా తీరిక‌లేన‌ట్టుగా ఉంది. ఇక‌నైనా వీరిని ప‌క్క‌న పెట్టి.. యువ ఆట‌గాళ్ల‌కు అవ‌కాశాలు ఇస్తే వాళ్లైనా శ్ర‌ద్ధ చూపే అవ‌కాశం ఉంది. రోహిత్ ఆసీస్ వెళ్లాకా.. ఆఖ‌రికి గిల్ ను కూడా ప‌క్క‌న పెట్టి టీమిండియా బ‌రిలోకి దిగుతూ ఉంది. గ‌మ‌నిస్తే ఆస్ట్రేలియాలో టీమిండియా త‌ర‌ఫున స్టార్లులేన‌ప్పుడే మంచి ఫ‌లితాలు వ‌చ్చాయి. గ‌తంలో విరాట్, రోహిత్ లు లేని మ్యాచ్ ల‌లోనే టీమిండియా విజ‌యాలు సాధించింది. క్రితం సారి ఈ ట్రోఫీ నెగ్గినప్పుడు గెలిచిన మ్యాచ్ ల‌కు ర‌హ‌నే కెప్టెన్సీ వ‌హించాడ‌నే విష‌యాన్ని కూడా మరిచిపోలేం!

13 Replies to “జ‌ట్టుకు భారంగా రోహిత్, విరాట్!”

    1. Mee Amma akka ni kuda adugu, evaru bharamo telustundi….musuko raa anni kuda…

      samayam sandarbham leda ra puka niku…

      thu emi bathukulu raa meevi…

      I confirm real pigs are smarter than tdp pigs….

  1. Idhi raasina chetha Vasavi Anitam.. vallu single hand tho gelipinchinapdu emina vallaku Bharata ratna ichaara.. formlo lerane varaku ok kani baram bokka endira mental reddy.. nuvvu ee bhumiki baram.. Mari poyyi ekkadanna dhuki saavu baaram tagguddi.. vallu ankunapdu retirement teeskuntaarule ne noru raathalu mariachi mudlo pettu pichi nayaala

    1. Sorry bro… What he wrote is correct… T20 Cup win ayyaka veella lo fire thaggindhi.. idhi nijam.. game ni take it easy ga thiskuntunnaru… Better to retire Ani fans feeling… I am also big fan of Rohit but when it comes to nation…I can’t tolerate this… Youngesters are waiting for chance with abundance of talent…

Comments are closed.