శతాబ్ది గాయకుడు ఘంటసాలకు ఘననీయంగా నివాళి

డిండి చింతపల్లి గ్రామం, వంగూరు మండలం, నాగర్ కర్నూల్ జిల్లాలో శతాబ్ధి గాయకుడు ఘంటసాలకు ఆరడుగుల  కాంస్య విగ్రహ ప్రతిష్ట ఘనంగా జరిగింది. Advertisement ఈ కార్యక్రమాన్ని శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో అదే గ్రామంలో…

డిండి చింతపల్లి గ్రామం, వంగూరు మండలం, నాగర్ కర్నూల్ జిల్లాలో శతాబ్ధి గాయకుడు ఘంటసాలకు ఆరడుగుల  కాంస్య విగ్రహ ప్రతిష్ట ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమాన్ని శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో అదే గ్రామంలో చేపట్టిన ఉచిత కంటి చికిత్స ముగింపు కార్యక్రమంతో అనుసంధానం చేశారు. ఇందుర్తి కుటుంబ సభ్యులైన ఇందుర్తి హనుమంతు రెడ్డి మరియు వారి సోదరి కాయితి మాలతిలు గత సంవత్సరం అకాల మరణం చెందారు, వారి జ్ఞాపకార్థం ఇందుర్తి బాలకిష్టా రెడ్డి ఈ శిబిరాన్ని తమ స్వగ్రామమైన డిండి చింతపల్లిలో చేపట్టారు.

ఈ కంటి చికిత్స శిబిరాన్ని ఈ నెల 20వ తేదిన పద్మభూషణ్ అవార్డు గ్రహీత మరియు శాంతా బయోటెక్నిక్స్ అధినేత కే.ఐ. వరప్రసాద్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభింపబడిన, ఈ కార్యక్రమంలో ఇందుర్తి కుటుంబ సభ్యులు రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి, శంకర నేత్రాలయ యు. ఎస్. ఎ. అద్యక్షులు ఇందుర్తి బాలకిష్టా రెడ్డి, శంకర నేత్రాలయ యు. ఎస్. ఎ. ధర్మకర్త ఇందుర్తి నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ పది రోజుల శంకర నేత్రాలయ ఉచిత కంటి వైద్య శిబిరంలో 225 కాటరాక్ట్ చికిత్సలు మరియు 1,325 మందికి స్క్రీనింగ్ నిర్వహించారని అధికారింగా మీడియాకు వివరించారు.

శంకర నేత్రాలయ ముగింపు వేడుకల్లో మాజీ డి.ఆర్.డి.ఓ. చైర్మన్ సతీష్ రెడ్డి గారు పాల్గొని తనకు ఘంటసాల గారి పైన ఉన్న అనుబంధాన్ని గౌరవాన్ని చాటుకున్నారు. ఇంత గొప్ప కార్యక్రమానికి తనను ముఖ్య అతిథిగా పిలిచినందుకు ఇందుర్తి గణపతి రెడ్డి మరియు ఇందుర్తి బాలకిష్టా రెడ్డి కి తన కృతజ్ఞతలు తెలియచేసారు.

ఘంటసాల కోడలు శ్రీమతి కృష్ణ కుమారి గారు మాట్లాడుతూ, తనను ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఆహ్వానించినందుకు ఇందుర్తి కుటుంబ సభ్యులకు తన ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నో ఘంటసాల విగ్రహ ప్రతిష్ట వేడుకలలో పాల్గొన్నాను కానీ ఇంత గొప్పగా విందు భోజనాలు మరియు గాన విభావరి ముందెన్నడూ చూడలేదని తెలియచేసారు.

ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయాన్ని అందించిన ఇందుర్తి గణపతి రెడ్డి మాట్లాడుతూ, ఘంటసాల గారంటే తనకు ఎంతో అభిమానమనీ, అందుకే ఈ కార్యక్రమంలో ఎలాంటి లోటు రాకుండా బాధ్యతలు నిర్వహించానని తెలియ చేసారు. తనకు ఘంటసాల రత్నకుమార్ తో ఉన్న సంబంధాన్ని గుర్తు చేశారు.

ఇందుర్తి బాలకిష్ట రెడ్డి మాట్లాడుతూ, ఘంటసాల విగ్రహ ప్రతిష్ట గురించి తన అన్న గణపతి రెడ్డి తో మాట్లాడినప్పుడు తను ఎంతో ఆసక్తి చూపడమే కాకుండా 6 అడుగుల కాంస్య విగ్రహానికి సంబంధించిన పూర్తి బాధ్యతలు తీసుకున్నరనీ, అందుకు తన సోదరుడు గణపతి రెడ్డి గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేశారు. గతంలో ఘంటసాల శతజయంతి వేడుకలలో భాగంగా ఘంటసాలకు భారత రత్న రావాలని 33 దేశాల తెలుగు సంఘాల నేతలతో కలిసి 200 టి.వి. కార్యక్రామాలు జూం ద్వారా నిర్వహించామనీ, ఆ ప్రయత్నం భారతరత్న వచ్చేంత వరకూ కొనసాగుతుందని తెలియ చేసారు.

శంకర నేత్రాలయ ధర్మకర్త ఇందుర్తి నారాయణ రెడ్డి వ్యాఖ్యాతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు, అనుషా మేనేజ్మెంట్ ఏం.డి. జలంధర్ రెడ్డి గారు ఈ కార్యక్రమం సజావుగా జరగడానికి కీలక పాత్ర పోషించారని బాలకిష్టా రెడ్డి తెలియ చేశారు. అలాగే బత్తిని రాజేందర్ రెడ్డి, కాయతి వివేక్ రెడ్డి, ఇందుర్తి వెంకట్ రెడ్డి, పల్ల కిష్టా రెడ్డి, ఇందుర్తి కర్ణాకర్ రెడ్డి, ఇందుర్తి జైపాల్ రెడ్డి ఈ కార్యక్రమ నిర్వహణలో పాల్గొన్నారని తెలియచేశారు.

ప్రముఖ గాయకుడు ఘంటసాల వీరాభిమాని శరత్ చంద్ర ఈ కార్యక్రమంలో తన బృందంతో గాన విభావరి నిర్వహించారు. శరత్ చంద్రతో పాటు ఈ గాన విభావరిలో ఇందుర్తి గణపతి రెడ్డి, చిరంజీవి ఆది నారాయణ, ఏ.పి. మైథిలి, శ్వేత గోపు, సురేష్ ప్రసాద్ (తబలా),  శివరాం రెడ్డి (రిథమ్ ప్యాడ్) పాల్గొన్నారు. ఈ సంగీత విభావరిలో గాయనీ గాయకులు ఎన్నో ఘంటసాల మాస్టారు ఆలపించిన యుగళ గీతాలు, పుష్పవిలాపం, పద్యాలు ఆలపించారు.  సుమారు 6 గంటల పాటు కొనసాగిన ఈ కార్యక్రమానికి గ్రామస్థులు తమ సంతోషాన్ని తెలియ చేసారు.  ఈ కార్యక్రమంలో ఆలపించి అలరించిన కొన్ని ముఖ్య గీతాలు.

– నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని

– నా కంటి పాపలో నిలిచిపోరా. నీ వెంట లోకాల గెలువనీరా

– నేను పుట్టాను లోకం మెచ్చింది

– జయ కృష్ణా ముకుందా మురారి

– కలవరమాయే మదిలో నా మదిలో

– సన్నగ వీచే చల్ల గాలికి కనులు మూసిన కలలాయే

– బహు దూరపు బాటసారి ఇటు రావో ఒక్కసారి

– మావ మావ మావా. ఏమే ఏమే భామా

– ఎవ్వరికోసం ఈ మందహాసం ఒకపరి వివరించవే

– చాంగురే…  బంగారు రాజా చాంగు చాంగురే బంగారు రాజా

– నన్ను ఎవరో తాకిరి .. కన్ను ఎవరో కలిపిరి

– నీలో నేనై నాలో నీవై, తీయని కలలే కందాము

– ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపు సొలుపేమున్నది

– నెలవంక తొంగి చూసింది · చలి గాలి మేని సోకింది

– నీలిమేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించునేవేళా

– ఊహలు గుస గుస లాడే .. నా హృదయం ఊగిస లాడే

– నిన్న కనిపించింది నన్ను మురిపించింది

– రావే రాధా రాణీ రావే రాధ నీవే కృష్ణుడు నేనే

– ఆకాశ వీధిలో అందాల జాబిలీ

– శ్రీ కృష్ణార్జున యుద్ధం (పద్యాలు)

– పుష్పవిలాపం (కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి – పద్యాలు)

ఈ కార్యక్రమ సన్మాన వేడుకలలో భాగంగా ఇందుర్తి కుటుంబ సభ్యులు విచ్చేసిన అతిథులను (డి.ఆర్.డి.ఓ. చైర్మెన్ సతీష్ రెడ్డి, ఘంటసాల కృష్ణకుమారి, ప్రముఖ గాయకులు శరత్ చంద్ర, సూరం వెంకట్ రెడ్డి, ఎం. సత్యనారాయణ రెడ్డి, కాయతి సాయి రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ఏ. జలంధర్ రెడ్డి, సి.హెచ్. రామా రావు, శివరామిరెడ్డి వంగ, లక్ష్మయ్య మంత్రి, చల్ల సుబ్బారాయుడు, ఆదిశేషు కోట, ప్రమీల వెన్నెలకంటి) దుశ్శాలువ, జ్ఞాపికలతో సన్మానించారు. ఈ కార్యక్రమం సజావుగా జరగడానికి సహకరించిన పోలీస్ వారికి కార్యవర్గం తమ సంతోషాన్ని తెలియజేశారు.

ఘంటసాల మాస్టారు విగ్రహ ప్రతిష్టతో పాటు, గాన విభావరి, మరియు విందు భోజనం అత్యద్భుతమని ప్రేక్షకులు  తమ సంతోషాన్ని కరతాళ ధ్వనులతో  తెలియ చేసారు.

పూర్తి కార్యక్రమాన్ని ఈ లంకెలొ చూడవచ్చు: https://www.youtube.com/live/GtKWf0i7FCw

ఫోటో గ్యాలరీ కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి