ఆఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌.. శ్రీలంకకి ముచ్చెమటలు

ఈ వరల్డ్‌ కప్‌లో పసికూనలు చెలరేగిపోతున్నారు. ఐర్లాండ్‌ చేతిలో వెస్టిండీస్‌ చిత్తు కాగా, శ్రీలంకకి షాకిచ్చేలా వుంది ఆఫ్గనిస్తాన్‌. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్గనిస్తాన్‌ 49.4 ఓవర్లలో 232 పరుగలకు ఆలౌట్‌ అయ్యింది. Advertisement…

ఈ వరల్డ్‌ కప్‌లో పసికూనలు చెలరేగిపోతున్నారు. ఐర్లాండ్‌ చేతిలో వెస్టిండీస్‌ చిత్తు కాగా, శ్రీలంకకి షాకిచ్చేలా వుంది ఆఫ్గనిస్తాన్‌. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్గనిస్తాన్‌ 49.4 ఓవర్లలో 232 పరుగలకు ఆలౌట్‌ అయ్యింది.

మామూలుగా అయితే శ్రీలంక లాంటి జట్టుకి 233 పరుగుల టార్గెట్‌ నల్లేరు మీద నడకే. కానీ ఆఫ్గనిస్తాన్‌ బౌలర్లు, శ్రీలంకకి చుక్కలు చూపించేస్తున్నారు. 50 పరుగుల లోపే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది శ్రీలంక. ఆప్ఘాన్‌ బౌలర్ల ధాటికి లంక టాప్‌ ఆర్డర్‌ విలవిల్లాడిరది. ఓపెనర్లు ఇద్దరూ డకౌట్‌ కావడం గమనార్హం. ఆపద సమయంలో ఆదుకుంటాడనుకున్న సంగక్కర కూడా 7 పరుగులకే వికెట్‌ పారేసుకున్నాడు. కరుణ రత్నే కాస్సేపు ప్రతిఘటించేందుకు ప్రయత్నించి, అతనూ వికెట్‌ వదిలేసుకోక తప్పలేదు.

సీనియర్‌ క్రికెటర్‌ జయవర్దనే, కెప్టెన్‌ మాథ్యూస్‌పైనే ఇప్పుడు భారమంతా పడిరది. వారిద్దరూ నిలదొక్కుకుంటే తప్ప, శ్రీలంక శ్రీలంక గట్టెక్కడం కష్టమే. ఒకవేళ ఆప్ఘనిస్తాన్‌, శ్రీలంకపై విజయం సాధిస్తే, అది సంచలన విజయమే అవుతుంది.