రోహిత్‌ డకౌట్‌.. స్వయంకృతాపరాధం.!

రోహిత్‌ శర్మ.. బోల్డంత ప్రతిభ వున్న క్రికెటర్‌. వన్డేల్లో డబుల్‌ సాధించిన రోహిత్‌ శర్మ, కళాత్మకమైన బ్యాటింగ్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. కానీ, నిర్లక్ష్యానికి కేరాఫ్‌ అడ్రస్‌ అనే అపప్రదనూ రోహిత్‌ శర్మ కూడగట్టుకున్నాడు.…

రోహిత్‌ శర్మ.. బోల్డంత ప్రతిభ వున్న క్రికెటర్‌. వన్డేల్లో డబుల్‌ సాధించిన రోహిత్‌ శర్మ, కళాత్మకమైన బ్యాటింగ్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. కానీ, నిర్లక్ష్యానికి కేరాఫ్‌ అడ్రస్‌ అనే అపప్రదనూ రోహిత్‌ శర్మ కూడగట్టుకున్నాడు. మైదానంలో బద్దకంగా కన్పించే రోహిత్‌ శర్మ విషయంలో విశ్లేషకులే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తారు.

ఇక, తాజాగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో లేని పరుగు కోసం ప్రయత్నించి రోహిత్‌ శర్మ రనౌట్‌ అయ్యాడు. అది కూడా డకౌట్‌ కావడం గమనార్హం. ఏ టీమ్‌తో ఎలా వున్నా ఫర్లేదు, సౌతాఫ్రికాతో ఆడేటప్పుడు మాత్రం ఛాన్స్‌ తీసుకోకూడదు. రోహిత్‌ శర్మ అక్కడే పెద్ద పొరపాటు చేశాడు. ఛాన్స్‌ తీసుకున్నాడు, డకౌట్‌ అయ్యాడు.

డివిలియర్స్‌ విసిరిన అద్భుతమైన త్రో.. నేరుగా వికెట్లను తాకింది. అప్పటికే క్రీజ్‌కి దూరంగా వున్న రోహిత్‌ శర్మ రనౌట్‌ అవ్వాల్సి వచ్చింది. వికెట్లను గురిచూసి కొట్టడం ఓ కళ. అందులో సౌతాఫ్రికా ఆటగాళ్ళకు ప్రపంచ క్రికెట్‌లో ఇంకెవరూ సాటి రారు. ఆ విషయం మరోమారు నిరూపితమయ్యింది రోహిత్‌శర్మ రనౌట్‌ రూపంలో. రోహిత్‌కి ఇది ఖచ్చితంగా స్వయంకృతాపరాధమే.