కొడుతూనే వున్నాడు.. ఒకదాని తర్వాత ఒకటి.. సెంచరీల మోత మోగించేస్తున్నాడు. వరల్డ్ కప్‌లో ఇప్పటికే హ్యాట్రిక్ సెంచరీలు నమోదు చేసిన క్రికెటర్‌గా రికార్డులకెక్కిన సంగక్కర, కొత్త రికార్డ్ సృష్టించాడు. తాజాగా స్కాట్లాండ్పై చేసిన సెంచరీతో వరుసగా నాలుగు సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్‌గా సరికొత్త రికార్డును నెలకొల్పాడు శ్రీలంక బ్యాట్స్‌మెన్ కుమార సంగక్కర.
ఈ వరల్డ్‌కప్ తర్వాత రిటైర్మెంట్ తీసుకోవాలనే ఆలోచనతో వున్న సంగక్కర, అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ వరల్డ్‌కప్‌ని భావిస్తున్నాడు. రిటైర్మెంట్ అత్యంత ఘనంగా వుండాలనుకున్నాడో ఏమో, ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశమివ్వకుండా, చిన్న పొరపాటు కూడా దొర్లకుండా మైదానంలో బ్యాట్‌తో చెలరేగిపోతున్నాడు.
పరుగుల పరంగా ఇప్పటికే ఈ వరల్డ్‌కప్‌లో మిగతా బ్యాట్స్మన్కన్నా టాప్ ప్లేస్‌లో వున్నాడు సంగక్కర. అతని తర్వాతి ప్లేస్‌లో శిఖర్‌ధావన్ వున్నా, సంగక్కర తాజా సెంచరీతో అతనికీ, శిఖర్ ధావన్‌కీ గ్యాప్ బాగా పెరిగిపోయిందనే చెప్పాలి. ఆల్రెడీ ఓ సారి వరల్డ్‌కప్‌ని దక్కించుకున్న లంకకు, మరోమారు వరల్డ్ కప్ అందించాలనే కసితో వున్న సంగక్కర, ఆ అద్భుతాన్ని తన స్వహస్తాలతో లంక జట్టుకు అందిస్తాడేమో వేచి చూడాలి.