కీలక మ్యాచ్‌లో విండీస్ సత్తా చాటింది. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ విజయం సాధించడంతో నాకౌట్ రేసులో ఆశల్ని సజీవం చేసుకుంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్, తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈని 175 పరుగులకే ఆలౌట్ చేసింది. లక్ష్యం చిన్నదే కావడంతో 30.3 ఓవర్లలోనే వెస్టిండీస్ విజయం సాధించింది. దాంతో పాయింట్ల పట్టికలో రన్‌రేట్‌ని కూడా వెస్టిండీస్ మెరుగుపర్చుకుంది. ఇప్పుడిక విండీస్ భవితవ్యం ఐర్లాండ్ ` పాకిస్తాన్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడి వుంది.
ఐర్లాండ్, పాకిస్తాన్ చెరో ఆరు పాయింట్లతో వున్నాయిప్పుడు. యూఏఈతో మ్యాచ్‌లో గెలవడం ద్వారా వెస్టిండీస్ కూడా ఆరు పాయింట్లు సంపాదించింది. ఐర్లాండ్ ` పాకిస్తాన్ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారు.? అన్నది తేలాల్సి వుంది. పూల్`బిలో వెస్టిండీస్ నాకౌట్‌కి చేరడం దాదాపు ఖాయమైపోయినట్టే. పాకిస్తాన్ ` ఐర్లాండ్ మ్యాచ్ టై అయితే తప్ప, వెస్టిండీస్‌కి ఎలాంటి ఇబ్బందులూ లేనట్టే.
ఇదిలా వుంటే, ఐర్లాండ్ ` పాకిస్తాన్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. రెండు వికెట్లు కోల్పోయినా పాక్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటోంది ఐర్లాండ్. టాస్ గెలిచిన ఐర్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ టోర్నమెంట్‌లో నిలకడగా ఆడుతున్న ఐర్లాండ్, పాకిస్తాన్‌ని మట్టికరిపిస్తుందా.? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే.