1). కాంగ్రెస్ పార్టీ చాలా ఇచ్చింది -సోనియాగాంధీ -ముఖ్యంగా మీ కుటుంబానికి
2). యువత పోరాడాలి -చంద్రబాబు -యువత పోరాడి, ముసలివాళ్లకి అధికారం ఇవ్వాలి
3). హిందీ నేర్చుకుంటే పానీపూరీ అమ్ముకోవచ్చు -తమిళనాడు మంత్రి పొమ్మడి -దీన్నే అరవ అతి అంటారు
4). సిఎం అభ్యర్థిని ప్రకటించేది అధిష్టానమే -సోము వీర్రాజు -ఆలూ లేదు, చూలూ లేదు కొడుకు పేరు సోము వీర్రాజు
5). ప్రతిపక్ష పార్టీగా అవతరిస్తాం -కెఎ. పాల్ -మీ వల్లే అంతోఇంతో పొలిటికల్ కామెడీ
6).150 ఎంపి సీట్లలో పోటీ చేస్తాం -కెఎ.పాల్ -పోరాడితే పోయేదేమీ లేదు, డిపాజిట్లు తప్ప
7). మీడియా పోరాడాలి -చంద్రబాబు -ఎవరి మీడియా?
8). జపాన్లో ఎపి.రోడ్ షో -ముందు మన రోడ్ల గుంతలు పూడ్చండి
9). వ్యక్తుల కన్నా పార్టీ ముఖ్యం -ఇంకోసారి చెప్పండి మేడం
10). కాంగ్రెస్ నాయకుడి కామెంట్ -మట్టి గుర్రాలతో మా వాళ్లు యుద్ధానికి వెళ్లాలనుకుంటున్నారు.
జీఆర్ మహర్షి