ఘాటైన కౌగిలింత, ముద్దులతో తుళ్లింత, సున్నితంగా స్పర్శించుకోవడంతో మొదలుపెట్టి ఆనందపుటంచులు చూడటం… పడకను చేరి పరువాలను ఆస్వాదించుకోవడం.. చెప్పుకొంటూ పోతే ఎన్నో, చెప్పాలంటే ఇంకెన్నో… వ్యక్తిగత అభిరుచులు, సరికొత్త శృంగార మార్గాలను కనుగొనే సృజన ఉండాలి కానీ.. అదంతా శృంగారమే, ఇలాంటి కార్యంలో 'అదొక్కటే' ముఖ్యం కాదు.. అని అంటున్నారు సెక్స్ థెరఫిస్టులు. లైంగికావయవాల కలయికను వీళ్లు 'అదొక్కటే' అని ఒత్తి చెబుతున్నారు. అది శృంగారంలో భాగమే కానీ, అదే శృంగారం కాదని చెబుతున్నారు. అదొక్కటే ఉన్నా సరిపోదు, అదొక్కటీ లేకపోయినా సరిపోదని వివరిస్తున్నారు.
జనాల్లో సెక్స్ విషయంలో ఉన్న అపోహలు బోలెడన్ని అంటున్నారు సెక్స్ థెరపిస్టులు. తమ దగ్గరకు కౌన్సిలింగ్ కోసమనో, వైద్యం కోసమనో వచ్చే వారు వ్యక్త పరిచే సందేహాలు, వారి వారి వ్యక్తిగత శృంగార జీవితంలోని లోటుపాట్ల గురించి చెప్పే మాటలను బట్టి ఈ భావాలు వ్యక్తం అవుతుంటాయని వారు వివరించారు. వాటిని బట్టి చూస్తే.. చాలా మంది శృంగారానికి నిర్వచనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
సిసలైన సెక్స్ చూపులతోనే మొదలవుతుంది.. మేల్ పార్టనర్ అయినా, ఫిమేల్ అయినా.. చూపులతోనే పార్టనర్‌ను మత్తెక్కించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలా మొదలుపెడితే.. ఒకరినొకరు రంజింపచేసుకునే ప్రతి చర్యా శృంగారంలో భాగమే అంటున్నారు.
సెక్స్ అంటే ఓరల్ స్టిముల్యేషన్, మ్యానువల్ స్టిములేషన్, మ్యూచువల్ మాస్టర్ బేషన్.. అంటూ వివరిస్తున్నారు. స్పర్శతో పరస్పరం ఆనంద పెట్టుకోవడమే శృంగారం అని విపులంగా చెబుతున్నారు. మొహమాట పడొద్దు పచ్చిగా మాట్లాడుకోండి, ఎరోటిక్ కంటెంట్‌ను చదువుకోండి, కలిసి పోర్న్ చూడండి, సెక్సువల్ ఫాంటసీలను షేర్ చేసుకోండి.. కాన్సెప్ట్ ఆఫ్ సెక్స్‌ను బ్రాడెన్‌గా మార్చుకోండి. ఎలాంటి పరిమితులూ పెట్టుకోవద్దు..అని సెక్స్ థెరఫిస్టులు సూచిస్తున్నారు. కొన్ని నిమిషాల లైంగిక పరమైన కలయిక మాత్రమే సెక్స్ కాదు.. అని ఎంతో ఉంది, దాన్ని ఆస్వాదించడమే శృంగారాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తున్నట్టు అని నొక్కి చెబుతున్నారు.