ఉంగరాల రాంబాబుకు సమస్యలు?

ఉంగరాల రాంబాబు సినిమా మే లో విడుదల అంటూ ప్రెస్ నోట్ అయితే బయటకు వచ్చింది. కానీ ఈ సినిమా విడుదల అంత వీజీ కాదని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం…

ఉంగరాల రాంబాబు సినిమా మే లో విడుదల అంటూ ప్రెస్ నోట్ అయితే బయటకు వచ్చింది. కానీ ఈ సినిమా విడుదల అంత వీజీ కాదని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం హీరో సునీల్ ఇంకా ఫైనల్ డబ్బింగ్ చెప్పకపోవడమే. సినిమాకు ఇంకా ప్రకాష్ రాజ్ వర్క్ కొంచెం మిగిలి వుంది. అది ఈ నెలాఖరులో పూర్తవుతుంది.

కానీ సునీల్ డబ్బింగ్ ఫైనల్ వర్క్ స్టార్ట్ చేసి, పూర్తి చేయాల్సి వుంది. అలా జరగాలి అంటే ఫైనాన్సియల్ సెటిల్ మెంట్ లు కొన్ని అడ్డం పడుతున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సునీల్ రెమ్యూనిరేషన్ లో సగానికి పైగా ఇంకా బకాయి వుండిపోయినట్లు తెలుస్తోంది. అది కొంతయినా క్లియర్ కాకుండా డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేస్తాడా? అన్నది అనుమానం. 

మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి హిట్ సినిమా అందించిన దర్శకుడు క్రాంతి మాధవ్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. పరుచూరి ప్రసాద్ నిర్మాత.