ఎమ్బీయస్‍: పుటుక్కు జరజర జెలెన్‌స్కీ

అమెరికా తన పెట్టుబడి రాబట్టాలి, జెలెన్‌స్కీ మర్యాదగా బయటపడాలి. ఇది గ్రహింపుకి తెచ్చుకుని, టెంపర్లు తగ్గించుకున్నాక యిద్దరూ త్వరలోనే మరో సమావేశానికి సిద్ధం కావచ్చు.

ఇద్దరు దేశాధ్యక్షుల మధ్య ఎన్నడూ చూడని విధంగా ట్రంప్, జెలెన్‌స్కీ సమావేశం రసాభాస అయింది, అదీ బహిరంగంగా! విదేశాంగ విధానం అనేది డిప్లమసీతో కూడుకున్నది. అది రెండు దేశాల మధ్య నడుస్తుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య, రెండు పార్టీల మధ్య కాదు. ఒక పార్టీ దిగిపోయి, మరో పార్టీ అధికారంలోకి రాగానే ఏ దేశంతోనూ మొత్తం విధానం మార్చేయదు. కొద్ది మార్పులు మాత్రమే సాధ్యం. ప్రతిపక్షంలో ఉండగా పొరుగు దేశాల గురించి ఏం మాట్లాడినా, వారితో సంబంధ బాంధవ్యాలు తెంపుకోవాలని డిమాండు చేసినా, అధికారంలోకి రాగానే బాధ్యత నెత్తి మీద పడుతుంది కాబట్టి, దీర్ఘకాలిక ఒప్పందాలను గౌరవించాలి కాబట్టి, వాణిజ్యవ్యాపారాలను కొనసాగించాలి కాబట్టి, యించుమించు అదే తరహాలో విదేశీ వ్యవహారాలు నడిపిస్తారు.

పైన చెప్పినది సమానస్థాయిలో ఉన్న దేశాలకు వర్తిస్తుంది. అమెరికా, ఉక్రెయిన్ దేశాల మధ్య సమీకరణానికి పూర్తిగా వర్తించదు. మూడేళ్ల క్రితం ఉక్రెయిన్ అయితే కథ వేరేలా ఉండేది. కానీ మూడేళ్లగా ఉక్రెయిన్ రష్యాపై కోపంతో తనను తాను అమెరికాకు, యూరోపియన్ యూనియన్‌కు (ఇయు)కు అర్పించేసుకుంది, దాసోహమనేసింది. వాళ్ల మద్దతు, ధనబలం, ఆయుధసంపత్తి తోనే యుద్ధం చేస్తోంది, సొంత బలంతో కాదు. ట్రంప్ నిష్కర్షగా చెప్పినా నిజమే చెప్పాడు. మేం మద్దతు ఆపేస్తే రెండు వారాల్లో రష్యా మిమ్మల్ని కబళించి వేస్తుంది జాగ్రత్త అని. జెలెన్‌స్కీ మండిపడ్డాడు. నీ దేశానికి నువ్వు అధ్యక్షుడవైతే, నా దేశానికి నేను అధ్యక్షుణ్ని, మనిద్దరదీ సమానస్థాయే అన్న లెవెల్లో ప్రవర్తించాడు. ‘బెగ్గర్స్ ఆర్ నో ఛూజర్స్’ అనే సామెత అతను విన్నట్లు లేదు. తన స్థాయికి మించి మాట్లాడాడు.

అమెరికా, ఇయు యిన్నాళ్లూ బిలియన్ల డాలర్లు కుమ్మరించాయి. ఎంత అనేది యిప్పుడు వివాదాస్పదం అయింది. బిబిసి వారి ఒక కథనం ప్రకారం, ఇయు మొత్తం కలిసి 2024 డిసెంబరు వరకు 140 బిలియన్ డాలర్లు యిస్తే అమెరికా ఒక్కటే 183 బిలియన్ డాలర్లు యిచ్చింది. (ఇది అమెరికన్ డిఫెన్స్ డిపార్టుమెంటు లెక్క ప్రకారం. కానీ జర్మనీలో ఉన్న ఒక రిసెర్చి సంస్థ 120 బిలియన్ డాలర్లే యిచ్చింది అంటోంది. ట్రంప్ యిప్పుడు మేం ఇయు కన్నా 300 బిలియన్ డాలర్లు ఎక్కువ ఖర్చు పెట్టామని చెప్పుకుంటున్నాడు). ఇంత ఖర్చు పెట్టినా అవి ఉక్రెయిన్ ద్వారా రష్యాను ఓడించ లేకపోయాయి. అఫ్‌కోర్సు, రష్యా కూడా ఉక్రెయిన్‌ను ఓడించలేక పోయింది. ఉక్రెయిన్ కంటె భారీ నష్టాలను మూట గట్టుకుంది.

అయితే రష్యా యుద్ధాన్ని ఒంటరిగానే చేస్తోంది. దానివలన కలిగే కష్టనష్టాలను అదే భరిస్తోంది, తట్టుకుంటోంది. అలా నిలదొక్కుకునే సత్తాను ప్రకృతి దానికి యిచ్చింది. ప్యుటిన్ రూపంలో బలమైన నియంతృత్వం దానికి తోడైంది. రష్యా యూనియన్‌లో చాలాకాలం భాగంగా ఉన్న ఉక్రెయిన్‌కు యీ విషయం తెలిసి ఉండాలి. దాన్ని కవ్వించి, యుద్ధంలోకి దింపడానికి ముందే గెలుపోటముల గురించి అంచనా వేసుకుని ఉండాల్సింది. తమ వంటి చిన్న దేశం పోరాడి గెలవగలదా? ‘నీ వెనకాల మేమున్నాం, పద పోరాడు అని యీ వేళ అంటున్న అమెరికా, ఇయు యీ సైనిక సహకారానికి బదులుగా యుద్ధానంతరం ఏమడుగుతాయి? అది మనం సమర్పించుకోగలమా?’ అని బేరీజు వేసుకుని చూడాల్సింది. అదేమీ లేకుండా ఉత్తి పుణ్యాన రష్యాను కవ్వించడం దేనికి?

ఈ రోజు ట్రంప్ ఏమంటున్నాడు? మీపై బిలియన్ల డాలర్ల డబ్బు అమెరికన్ టాక్స్ పేయర్ ఖర్చు పెట్టాడు. దానికి పరిహారంగా మీ ఖనిజాలను మమ్మల్ని తవ్వుకోనీయ్ అంటున్నాడు. వీళ్లకు సై అంటే మా మాటేమిటి? అంటూ యూరోపియన్ దేశాలూ క్యూ కడతాయి. ‘మా దేశప్రజలూ త్యాగాలు చేశారు. మీకోసం పెట్రోలు కొరతతో, విద్యుత్ కొరతతో అవస్థ పడ్డారు. మీకు డబ్బు, ఆయుధాలు యిస్తూంటే ఊరుకున్నారు. మా దేశానికీ ఏదైనా రాసి యివ్వకపోతే వాళ్లు ఒప్పుకోరు. మేం చేతకాని వాళ్లమని మా ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తాయి’, అనవచ్చు. ఏదైనా యుద్ధం జరిగాక, ఓడిపోయిన దేశాన్ని విజేత దేశాలు ఎలా పంచుకునేవో, ఎలా పీడించి డబ్బులు లాక్కునేవో చరిత్ర చెప్తోంది.

‘నీ యుద్ధోన్మాదం వలననే యుద్ధం సంభవించి, అపారనష్టం జరిగింది. అందుకు అపరాధ రుసుం కట్టు’ అంటూ కొల్లగొట్టేసేవి. మొదటి ప్రపంచయుద్ధానంతరం విజేత దేశాలు జర్మనీపై విపరీతమైన ఆంక్షలు విధించి, దాన్ని దోచేయడంతో జర్మన్ ప్రజల అహం దెబ్బ తింది, మనసులు గాయపడ్డాయి. దాన్ని తనకు అనువుగా మలచుకుని హిట్లర్ రాజకీయంగా ఎదిగి, వీళ్లందరికీ బుద్ధి చెపుదాం అనే నినాదంతో రెండో ప్రపంచ యుద్ధం తెచ్చిపెడితే జర్మన్లందరూ అతని వెంట నిలిచారు. ఇప్పుడు ఉక్రెయిన్ నుంచి అమెరికా ఏదైనా లాక్కుంటే యిదో కొత్త తరహా కథ అవుతుంది. యుద్ధంలో ఓడిపోయిన వాడి దగ్గర గతంలో శత్రు దేశాలు లాక్కుంటే యిప్పుడు మిత్ర దేశాలే లాక్కున్నట్లవుతుంది. ఇక్కడే యింకో మాట కూడా చెప్పాలి. ఉక్రెయిన్ యింకా ఓడిపోలేదు, రష్యా యింకా గెలవలేదు. మిత్రదేశమైన అమెరికాయే ఉక్రెయిన్‌ను ఓడించి, లాక్కుందామని చూస్తోంది.

యుద్ధం మధ్యలో ఉన్న వాడికి ఆయుధ రవాణా ఆపేయడం ఒక రకం. పోరాడే ధైర్యం, నైతిక స్థయిర్యం లేకుండా చేయడం మరో రకం. ఇప్పుడు ట్రంప్, వాన్స్ కలిసి అదే చేశారు. ‘నీ చేతిలో కార్డులన్నీ అయిపోయాయి, నీ దగ్గర మ్యాన్‌పవర్ లేదు, నీ రిసోర్సెస్ అన్నీ అయిపోయాయి, మీ దేశం సర్వనాశనమైంది, ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధం వైపు నడిపిస్తున్నావు, మేము సాయం చేయడం ఆపేస్తే రెండు వారాల్లో ఓడిపోతావు. శరణు మహా ప్రభో అని రష్యా ముందు మోకరిల్లడం తప్ప నీకు గతి లేదు. ఏ విధంగా మోకరిల్లాలో మేం చెప్తాంగా..’ అని బహిరంగంగా హెచ్చరించారు. ఈ మాటలు విన్నాక ఉక్రెయిన్ తరఫున పోరాడేవారికి ఉత్సాహం ఉంటుందా? ఉక్రెయిన్ పౌరులకు జెలెన్‌స్కీ మీద గౌరవం ఉంటుందా? ఇప్పటికే వాళ్లకు అతని మీద అనుమానాలు పుట్టించారు.

అమెరికా ఉక్రెయిన్‌కు చేసిన ఆర్థిక సాయం విషయంలో జెలెన్‌స్కీ చెప్పే అంకెకు, ట్రంప్ చెప్పే అంకెకు మధ్య చాలా తేడా ఉంది. అంకెలు పెంచి చెప్పడం ట్రంప్ హాబీ అనుకుని సరిపెట్టుకున్నా, పాశ్చాత్య దేశాలు యిచ్చిన సాయమంతా మన సైనికులకు అందించాడా, మధ్యలో జెలెన్‌స్కీ కాస్త బొక్కాడా? అనే సందేహం ఉక్రెయిన్ ప్రజలకు కలుగుతోంది. జెలెన్‌స్కీ భార్య పేర విదేశాల్లో ఆస్తులు కొంటున్నాడని, లెక్కలు అడగడం మొదలుపెడితే ఏ క్షణాన్నయినా భార్యతో సహా అతను పారిపోవచ్చని యిప్పటికే వదంతులు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశం తర్వాత ఉక్రెయిన్‌లో జెలెన్‌స్కీకు వ్యతిరేకంగా తిరుగుబాటు వచ్చినా రావచ్చు.

మినరల్స్ తవ్వుకోవడానికి అనుమతి నివ్వమని అమెరికా చేస్తున్న డిమాండ్‌పై చెప్పాలంటే, సైనిక సహాయం చేసినందుకు ఫీజు వసూలు చేయడం కూడా అనాదిగా ఉంది. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మన దేశపు రాజుల దగ్గర అలాగే అనేక ప్రాంతాలు స్వాధీనం చేసుకున్నారు. కానీ ముందే షరతులు మాట్లాడుకునే వారు. ఉక్రెయిన్ విషయంలో అలా మాట్లాడుకున్నట్లు తోచటం లేదు. అందుకే మినరల్స్ రాసిచ్చే విషయంలో జెలెన్‌స్కీ మొండికేస్తున్నాడు, మెలికలు పెడుతున్నాడు. అంటే దీని అర్థం – జెలెన్‌స్కీ అమెరికా, యూరోప్‌లు తనకు చేసిన సహాయానికి ప్రతిగా ఏమీ అడగరని అనుకున్నాడా? ‘నువ్వొకందుకు పోస్తే, నేను ఒకందుకు తాగుతున్నా’ అనే సామెత వాళ్ల భాషలో లేదా? పోనీ ‘తండ్రికి పెళ్లవుతోందన్న సంబరమే తప్ప సవతి తల్లి వస్తుందన్న ఆలోచనే లేదు’ అనే సామెతైనా తెలిసి ఉండాలిగా!

ఇప్పుడు ఏదైనా సాయం చేస్తున్నారంటే, దానికి బదులుగా ఏదో ఒకటి అడుగుతారు, మనం యివ్వాల్సి వస్తుందన్న యింగితం లేదా? తెలుగు సామెతలు తెలియకపోయినా ఇంగ్లీషు చక్కగా మాట్లాడుతున్న జెలెన్‌స్కీకి ‘దేర్ ఆర్ నో ఫ్రీ లంచెస్’ అనే ఇంగ్లీషు సామెతైనా తెలిసి ఉండాలిగా! ‘కేవలం రష్యాను అణచాలన్న కాంక్షతో, దాని సహజవనరులను దోచాలనే ప్రణాళికతో పాశ్చాత్య దేశాలు, తనను శిఖండిగా పెట్టుకుని యుద్ధం చేస్తున్నాయి. తను కేవలం ఆ పాత్ర పోషిస్తే చాలు అనుకున్నాడా?’ మన తెలుగు సినిమాలు కొన్నిటిలో శిఖండిని ఆడారి వాడిగా, తిప్పుకుంటూ యుద్ధరంగంలోకి వచ్చినట్లు చూపించారు కానీ, మూల భారతం చదివితే తెలుస్తుంది – అతను మహా వీరుడని. లింగమార్పిడి జరిగినంత మాత్రాన బలం ఎక్కడికీ పోదు కదా! భీష్ముణ్ని పడగొట్టే రోజు మాత్రమే అతను యుద్ధక్షేత్రంలో అడుగు పెట్టాడని అనుకోకూడదు. అంతకు ముందు నుంచీ యుద్ధం చేస్తూ, యితరులను ఓడిస్తూ వచ్చాడు.

అందువలన జెలెన్‌స్కీని శిఖండి అనడానికీ లేదు. మూడేళ్లగా యుద్ధం చేస్తూ వచ్చినా గెలవలేక పోయాడితను. నెలా, రెణ్నెళ్ల యుద్ధమైతే పాశ్చాత్య దేశాలు పోనీలే, ఏమీ అడగవద్దులే, మనకు కృతజ్ఞతగా ఉంటాడు, చాలనుకుని ఊరుకునేవేమో! కానీ మూడేళ్లు యుద్ధాన్ని సాగదీసి ‘ఇంకా తే, యింకా తే’ అంటూ ఉంటే చిర్రెత్తదూ? జెలెన్‌స్కీకి తెలుగు సామెతలు, భారతాలూ ఏమీ తెలియనక్కర లేదు. ఈసప్ కథలు చదివి ఉంటాడు కదా! దానిలో గుఱ్ఱం గురించిన ఓ కథ ఉంది. దానికి ఓ సారి లేడిపై కోపం వచ్చింది. దాన్ని చంపడం తన తరం కాదని, ఒక మనిషి వద్దకు వచ్చి ‘నీ దగ్గరున్న బాణాలతో దాన్ని చంపేయ్’ అంది. ‘బాణాలున్నాయి కానీ దానితో సమానంగా పరిగెత్తే నేర్పు నాకు లేదు’ అన్నాడు మనిషి. ‘నా మీద ఎక్కు, దాని వేగాన్ని అందుకో, బాణమేసి చంపేయ్’ అంది.

అప్పటిదాకా గుఱ్ఱం మనిషికి మచ్చిక కాలేదు. అడవుల్లో మాత్రమే ఉండేది. పరిగెత్తి పారిపోయే జంతువులను వేటాడడానికి మనిషి కష్టపడుతూ ఉండేవాడు. గుఱ్ఱం యీ ఆఫర్ యివ్వగానే అతను ‘మరి అలా పరిగెడితే నేను పడిపోనా?’ అన్నాడు. గుఱ్ఱం తనను ఎక్కడానికి ఏమేం కావాలో నేర్పించింది. మనిషి గుఱ్ఱం ఎక్కి, దాని కోరిక మేరకు లేడిని వేటాడి చంపేశాడు. ‘పని అయిపోయిందిగా, యిక దిగు’ అంది గుఱ్ఱం. ‘ఈ వాహనం బాగుంది, నేను దిగను. ఇప్పణ్నుంచి నువ్వు నాకు బానిసవు. నీకు తిండి పడేస్తాను, నా దగ్గరే ఉండి నాకు సేవలు చేస్తూ యితర మృగాలను వేటాడేందుకు ఉపయోగ పడు’ అన్నాడు మనిషి. అప్పణ్నుంచి గుఱ్ఱం మనిషికి బానిసైంది.

ఈ కథలో గుఱ్ఱం లాగానే ఉక్రెయిన్ రష్యా వేటకు అమెరికా, యూరోప్‌లకు ఉపయోగపడింది. చిత్రమేమిటంటే రష్యా జింకకు గాయాలయ్యాయి తప్ప, చావలేదు. వీళ్లిప్పుడు ఉక్రెయిన్ గుఱ్ఱాన్ని దిగకుండా ‘నిన్ను కాస్త కాస్త కోసుకోనీయ్, ఓ ముక్క జింకకిస్తాం, మరో ముక్క మేం తీసుకుంటాం. తర్వాత కుంటుకుంటూ నువ్వు ఎలాగోలా తిరుగుదువు గాని’ అంటున్నారు. థయ్‌మంటూ యుద్ధంలోకి దూకేందుకు ముందే యీ పర్యవసానాలను జెలెన్‌స్కీ ఊహించాల్సింది.

మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఊహించలేక పోయాడని అనుకున్నాకైనా, ఓ ఆర్నెల్లు గడిచేసరికి, యుద్ధం తను అనుకున్న రీతిలో నడవటం లేదని గ్రహించాకనైనా సమీక్షించుకోవాల్సింది. తనకు సాయం చేస్తున్న దేశాల్లో మధ్య లుకలుకలు వస్తాయని, ఆ దేశప్రజలు అభ్యంతర పెడతారని గ్రహించి, గౌరవప్రదంగా యుద్ధాన్ని ఎలా విరమించాలా అని ఆలోచన చేయాల్సింది. రష్యాతో తమ యుద్ధం కారణంగా ప్రపంచం మొత్తం బాధపడుతోందని, అనేక దేశాల ఆర్థికవ్యవస్థలు కుంటుపడుతున్నాయని, వారంతా తిట్టుకుంటున్నారని గ్రహించి వారందరినీ కూడా యిన్వాల్వ్ చేసి, యుద్ధనష్టాలు భారీగా లేకుండా జాగ్రత్త పడాల్సింది. ఇదేమీ చేయలేదు.

అమెరికాలో ఎన్నికలు జరిగి, తనకు యిన్నాళ్లూ మద్దతు యిస్తున్న ప్రభుత్వం గద్దె దిగి, తన పట్ల సానుభూతి లేని, తను శత్రువుగా భావించి వ్యతిరేకంగా ప్రచారం చేసిన ట్రంప్ అధ్యక్షుడుగా వచ్చాడని తెలిశాకైనా కాస్త తగ్గి, డిప్లమేటిక్‌గా వ్యవహరించి, యుద్ధంలోంచి సాధ్యమైనంత తక్కువ గాయాలతో బయట పడాలని ప్రయత్నించాల్సింది. ఆ రాజకీయ జ్ఞానం, ఆ లౌక్యం అతనికి కొరవడ్డాయి. అతను గతంలో ఏ వృత్తిలోనైనా ఉండవచ్చు. కానీ రాజకీయాల్లోకి వచ్చాక ప్రజల మనసు గెలిచే నైపుణ్యం అలవర్చుకున్నాక యివీ నేర్చుకోవాలి. ఎందుకంటే యిది అతని వ్యక్తిగత వ్యవహారం కాదు, తనను ఎన్నుకున్న దేశప్రజల జీవన్మరణ సమస్య. మూడేళ్లగా నానా రకాలుగా నాశనమై పోయిన ప్రజల కోసం తనను తాను తగ్గించుకునైనా వ్యవహారం చక్కబెట్టుకోవాలి.

అతను ఒదిగినా, వినయంగా ప్రవర్తించినా అది దేశ ప్రజల సంక్షేమం కోసమే అని అందరూ అర్థం చేసుకుంటారు. గతంలో బద్ధశత్రువులుగా వ్యవహరించిన వారు యిప్పుడు వాటేసుకున్నా, ‘రాజకీయాల్లో యిది సహజం. శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు’ అని కూడా అర్థం చేసుకుంటారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో యిది నిత్యవ్యవహారం. ఏ దేశం ఎప్పుడు ఎవరితో, ఎంతకాలం స్నేహం చేస్తుందో, ఎప్పుడు వైరం పూనుతుందో ఎవరికీ తెలియదు. కానీ జెలెన్‌స్కీ రష్యాను, ప్యుటిన్‌ను తీవ్రంగా ద్వేషిస్తున్నాడు. దాన్ని చాటి చెప్తున్నాడు. రాజీ పడే ప్రశ్నే లేదంటున్నాడు. ఎంత చెడ్డా అది పొరుగుదేశం. ఎన్నో విషయాల్లో యిచ్చి పుచ్చుకోవడాలుంటాయి.

అంతెందుకు యివాళ అమెరికా అధ్యక్షుడు మెడ బట్టుకుని గెంటేసినా, కొన్ని రోజుల్లోనే యిద్దరూ మళ్లీ కలిసి కూర్చోవలసిన అగత్యం పడుతుంది. ఎక్కడో ఉన్న అమెరికాతోనే అది తప్పనపుడు సరిహద్దు పంచుకుంటున్న రష్యాతో కూర్చుని ఎన్నో విషయాలు చర్చించుకోక తప్పుతుందా? ప్యుటిన్, జెలెన్‌స్కీ ఒకరినొకరు ఎంత అసహ్యించుకున్నా, కలిసి ఫోటోలు దిగక తప్పదు. అది వారి పదవి కల్పించిన బాధ్యత! ఈ రాజకీయ పరిణతి లేకుండా జెలెన్‌స్కీ యీ సమావేశంలో వ్యవహరించాడని చెప్పక తప్పదు. ఓ పూట అన్నం పెడితేనే ‘అన్నదాతా సుఖీభవ’ అని ఆశీర్వదిస్తామే, అలాటిదే మూడేళ్లగా మేపుతున్నవాణ్ని, ఆర్థికంగా, ఆయుధపూర్వకంగా సాయపడుతున్న వాణ్ని ఆశీర్వదించడం పోయి, శాపనార్థాలు పెడితే ఎలా?

నూతన వధువు వితంతువు దగ్గర కెళ్లి ఆశీర్వదించమంటే ‘నాలాగే తయారవ్వు’ అందనే సామెత చాలా మోటుగా, క్రూరంగా ఉంటుంది అనుకుంటాను నేను. జెలెన్‌స్కీ లాటి వాళ్లను చూసే అది తయారై ఉంటుంది. అధ్యక్ష భవనంలో, అమెరికన్ మీడియా ముందు కూర్చోబెట్టి, మాట్లాడమంటే ‘ఇన్నాళ్లూ చేసిన సాయానికి కృతజ్ఞతలు, పాత ప్రభుత్వం లాగే యీ ప్రభుత్వమూ సాయాన్ని కొనసాగిస్తుందని ఉక్రెయిన్ ప్రజలు ఎదురు చూస్తున్నారు.’ లాటివి మాట్లాడకుండా, ‘మీకు పక్కన మహాసముద్రం యిన్నాళ్లూ యుద్ధవినాశనాన్ని చవి చూడలేదు. కానీ మీకూ ఓ రోజు రావచ్చు. అప్పుడు తెలిసి వస్తుంది, అప్పుడు ఫీలవుతారు మీరు..’ అంటూ శకునాలు చెప్పడమేమిటి? మంకెన్నలా అశుభం పలకడమేమిటి?

రెండు ప్రపంచయుద్ధాల్లోనూ యూరోప్ దేశాలు, ఆసియా దేశాలు – జయించినా ఓడినా – నాశనమయ్యాయి. కానీ రెండిటిలోనూ గెలిచిన అమెరికాకు నష్టం వాటిల్లలేదు, ఒక్క పెర్ల్ హార్బర్ విషయంలో తప్ప! దీనికి కారణం అది రణక్షేత్రం కాకపోవడం! యుద్ధమంతా యూరోప్, ఆసియా దేశాల్లో ఎక్కువగా జరిగింది. యుద్ధానంతరం ఆసియా కోలుకుంది కానీ యూరోప్ పూర్తిగా దెబ్బ తింది. అమెరికా దూసుకుపోయింది. ఈ బాధ యూరోప్ దేశాల్లో ఉంది. దాన్నే జెలెన్‌స్కీ వెళ్లగక్కాడు. కానీ అది సమయమూ కాదు, సందర్భమూ కాదు. అతను ఔచిత్యం మరచి మాట్లాడగానే ట్రంప్ ‘మా గురించి మాట్లాడకు’ అన్నప్పుడైనా జెలెన్‌స్కీ సారీ అంటూ మాట వెనక్కి తీసుకోవలసింది. అది చేయలేదు. మా సాయం లేకపోతే రెండు వారాల్లో యుద్ధం ఓడిపోతావు అని ట్రంప్ అంటే ‘మూడు రోజులని ప్యుటిన్ అన్నాడు, ఏమైంది?’ అంటూ వెక్కిరించడం దేనికి?

అమెరికా 500 బిలియన్ డాలర్లిచ్చిందో, సగమో పావో యిచ్చిందో – ఎంతైనా భారీగానే సాయం చేసింది కదా. యూరోప్ మద్దతు కూడగట్టి పెట్టింది కదా. అదేమీ ప్రస్తావించకుండా నేను ఒంటరిగానే పోరాటం చేస్తూ వచ్చాను అని జెలెన్‌స్కీ అనడమేమిటి? టైమెంతయిందో చెప్పినవాడికే థాంక్యూ అంటాం కదా, యింతా తీసుకుని ఆ ముక్క చెప్పడానికి గోరోజనం ఏమిటి? వాన్స్ మృదువుగా మాట్లాడుతూనే ‘అమెరికాకు కృతజ్ఞతలు చెప్పలేదు.’ అంటూ గుర్తు చేస్తే ప్రజలకు చెప్పాను అన్నాడు – ప్రభుత్వాలకు చెప్పాల్సిన పని లేదని ధ్వనిస్తూ! ప్రజలు డైరక్టుగా వచ్చి సాయం చేయరు. ప్రభుత్వాల ద్వారానే పనులు జరుగుతాయి. పైగా ‘నువ్వు బిగ్గరగా మాట్లాడినంత మాత్రాన నేను బెదరను’ అన్నాడు. ట్రంప్ కలగజేసుకుని ‘వాన్స్ అలా మాట్లాడలేదు’ అని గుర్తు చేయాల్సి వచ్చింది.

మూడేళ్లగా చేసిన దానికి థాంక్స్ చెప్పకపోగా, 2014లో చేయని దాన్ని ఎత్తి చూపించాడు మహానుభావుడు, క్రైమియా విషయంలో రష్యాను నిలవరించడమే వీళ్ల పని అన్నట్లు! వీళ్లేమైనా సెక్యూరిటీ గార్డులా? వీళ్లతో సైన్యసహకార ఒప్పందం ఏమైనా ఉందా? అమెరికా తక్కిన వాళ్లతో యుద్ధానికి దిగినప్పుడు వీళ్లు సైన్యాన్ని పంపించారా? ‘నేనప్పుడు లేనులే’ అని ట్రంప్ అంటే, ‘2016లో వచ్చావుగా, అప్పుడు మాత్రం ఏం చేశావు మహ’ అని ఎత్తిపొడిచాడు. వాగ్వాదానికి ముందు జరిగిన మాటల్లో ‘మాకు సాయం చేయడం విషయంలో బైడెన్ ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోండి’ అని కూడా అన్నాడట! బైడెన్ అడ్డగోలుగా సాయం చేశాడని అతన్ని తిట్టితిట్టి పోసిన ట్రంప్‌కు అమెరికన్ ప్రజలు పట్టం కట్టారని మర్చిపోతే ఎలా? బైడెన్ దిగిపోతూ కూడా ఉక్రెయిన్‌కు దోచి పెట్టాడు, అదంతా బూడిదలో పోసినట్లవుతోందని మూడేళ్లగా రుజువైనా! ప్యుటిన్‌ మీద కోపంతో యితనికి యిచ్చినట్లుంది తప్ప, యుద్ధాన్ని ఆపి, ప్రపంచానికి మేలు చేయాలన్న ఆలోచన ఉన్నట్లు ఎక్కడా కనబడలేదు. ప్యూటిన్‌తో నైస్‌గా మాట్లాడడంపై ట్రంప్ చెప్పిన వివరణ కరక్టే. డీల్ కుదర్చాలంటే కాస్త మర్యాద యిచ్చి ఐస్ బ్రేక్ చేయాలి. బైడెన్‌లా తిట్టి, ఆంక్షలు విధించి, డీల్ చేసుకోవడం కుదరదు.

ఇక ముందు సాయం వుండదు, యిప్పటిదాకా యిచ్చినదానికి బదులుగా మినరల్స్‌పై సంతకం పెట్టు అని ట్రంప్ అంటే ‘అయితే శాశ్వతంగా మాకు సైనిక రక్షణ కల్పించండి.’ అని అడిగాడు జెలెన్‌స్కీ. ఏమీ లేకుండానే యింత ఎగిరెగిరి పడుతున్నాడు, సైన్యాన్ని కూడా అతనికి యిస్తే చీటికీమాటికీ యుద్ధానికి దిగి డబ్బియ్యి, ఆయుధాలియ్యి అని తగులుకుంటే? సీజ్ ఫయర్ చేయాలి అంటే ప్యుటిన్ దాన్ని అమలు చేయడు అంటూ వాదించాడు. అలా అని సీజ్ ఫయర్ అస్సలు చేయకుండా కూర్చుంటావా? మధ్యవర్తిగా ఉంటానంటున్న ట్రంప్ యిచ్చే హామీ ఎలాటిదో చూడాలి. ప్యుటిన్‌తో మాట్లాడితే తప్ప ఆ హామీ ఏమిటో తెలియదు. ప్యుటిన్ హంతకుడు, వాడితో రాజీ ఏమిటి? అనే స్టాండ్ తీసుకుంటే సమస్య ఎప్పటికీ తీరదు. రష్యా యిప్పటికే ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగాలపై ఆశ వదులుకో అని ట్రంప్ స్పష్టంగా చెప్పేశాడు. అక్కడ రష్యన్ జనాభా ఎక్కువ. స్థానిక ప్రతినిథులు కూడా రష్యా పక్షమే, రష్యాకే మద్దతు పలుకుతారు. ఉక్రెయిన్‌లో కలిపినా, పక్కలో బల్లెంగానే ఉంటారు. ఎక్కడికో అక్కడికి తెంపుకుని, యుద్ధంలోంచి బయటపడడమే జెలెన్‌స్కీ చేయగలిగేది.

కానీ అతనికి ఆ యింగితం ఉన్నట్లు తోచటం లేదు. బ్రిటన్, ఫ్రాన్స్ బాగా గిల్లి పంపించేయేమో! ఇప్పుడీ గొడవ తర్వాత కూడా బ్రిటన్, ఫ్రాన్స్ మేమున్నామనీ, నీకేం కాదనీ.. అంటూ పాట పాడుతున్నాయి. అసలు వాటి ఆర్థిక పరిస్థితే అంతంత మాత్రం. అమెరికా దన్ను లేకుండా ఏం చేయగలుగుతాయో తెలియదు. గ్రీన్‌లాండ్ విషయంలో అమెరికాపై ఉన్న కచ్చను యితని ద్వారా తీర్చుకుందామని చూస్తున్నాయేమో! ఉక్రెయిన్‌కు మద్దతిస్తే మీ దేశాల దిగుమతులపై సుంకం పెంచుతా అని ట్రంప్ అంటే మధ్యలో తోక ఝాడించినా ఝాడించవచ్చు. ఉక్రెయిన్ పరిస్థితి అనాథ అవుతుంది. ప్రజలకు ఆ భయం పుట్టిందంటే, జెలెన్‌స్కీని తరమడానికి తయారవుతారు. యుద్ధప్రారంభంలో హీరోలా కనబడిన అతను, యిప్పుడు జీరోలా, ఒక మూర్ఖుడిగా కనబడతాడు వాళ్లకు. ప్రజలు విజేతలనే మన్నిస్తారు. తమ కొంపలు పోగొట్టినవాణ్ని కాదు.

చివరగా ఓ విషయం చెప్పి ముగిస్తాను. ట్రంప్ జెలెన్‌స్కీ వాగ్వాదం చూస్తూ ఉంటే నాకు మా మిత్రుడు మంజునాథ్ గారు గుర్తుకు వచ్చారు. ఆయన మంచి పెర్శనాలిటీ. గంభీరమైన కంఠం, పెద్దరికం ఉట్టిపడుతుంది, మనిషి మంచివాడు కానీ సులభంగా కోపం వస్తుంది. ఎవరైనా గొడవ పడుతూంటే మధ్యలోకి వెళ్లి మధ్యస్తం చేయబోయేవాడు. ఇద్దరి వాదనలూ విని, న్యాయంగానే తీర్పు చెప్పేవాడు. కానీ అది నచ్చనివాడు ‘అలా కుదరదండీ’ అని వాదిస్తే, యీయనకు చికాకు వేసేది. ‘ఎందుకు కుదరదు? నేను చెప్తున్నానుగా, అన్నీ ఆలోచించి, చక్కగా నీ మేలు గురించే చెప్పాను. అయినా మూర్ఖంగా విననంటావేమిటి?’ అని గసిరేవాడు. వాడు ‘మీరు నన్నంటారేమిటండీ?’ అని ఎదురు తిరిగితే యీయన కోపం తారస్థాయికి వెళ్లిపోయేది. కాస్సేపు పోయాక చూస్తే మధ్యవర్తిగా వెళ్లిన యీయన పోట్లాడే పార్టీల్లో ఒకడై పోయేవాడు. నేను సరదాగా ఆటపట్టిస్తూ ‘మంజునాథ్ మధ్యవర్తిత్వం’ అని పేరు పెట్టాను. నిన్న ట్రంప్ కూడా ‘రష్యాకు, నీకూ మధ్యవర్తిత్వం చేస్తా’నని మొదలుపెట్టి ‘నేనెంత చెప్పినా వినవేం?’ అంటూ కోపగించుకుని, మా మంజునాథ్ గార్ని గుర్తుకు తెచ్చాడు. నాకు ‘పుటుక్కు జరజర డుబుక్కు మే..’ అనే కథ కూడా గుర్తొచ్చింది! ఇప్పుడు ట్రంప్‌తో సంబంధాలు పుటుక్కు మంటే జెలెన్‌స్కీ జరజర కిందకు జారి డుబుక్కున పడి బేర్ మనవచ్చు. కానీ రెండు దేశాలూ యిప్పటికే చాలా యిరుక్కుని ఉన్నాయి. అమెరికా తన పెట్టుబడి రాబట్టాలి, జెలెన్‌స్కీ మర్యాదగా బయటపడాలి. ఇది గ్రహింపుకి తెచ్చుకుని, టెంపర్లు తగ్గించుకున్నాక యిద్దరూ త్వరలోనే మరో సమావేశానికి సిద్ధం కావచ్చు.

– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2025)

mbsprasad@gmail.com

70 Replies to “ఎమ్బీయస్‍: పుటుక్కు జరజర జెలెన్‌స్కీ”

  1. ఎమ్ బీ ఎస్ గారు….మీరు ఈ మధ్య తెలుగు రాష్ట్రాల రాజ కీయాల మీద ఆర్టికల్స్ రాయడం లేదు…!!!!

  2. చాలా మంచి ఆర్టికల్. ట్రంప్ 100% కరెక్ట్. అమెరికాలో మన చెట్ల ఆకులు గాలికి వెళ్లి పక్కింటి దొడ్లో పడితే రచ్చ రచ్చ చేస్తారు, కానీ ఉక్రెయిన్ NATO లో చేరితే రష్యా గమ్మున ఉండాలంటారు. మామూలు జనజీవన స్రవంతిలో కూడా ఈ ఉక్కి గాళ్లను చేరదీసి మ.. కు..పోవటమే తప్ప బాగుపడిన వాడు వుండడు. 35000 కోట్ల డాలర్లు దె…గి వాళ్ల ప్రెసిడెంటే ఈ రకంగా ప్రవర్తించాడు అంటే ఇక వాడికి ఓట్లు వేసిన జనాల గురించి చెప్పేదేముంది. వీళ్ల కంటే మన దాయదులే నయం. గాడ్ బ్లెస్ అమెరికా, విజయోస్తూ రష్యా విజయోస్తు!

  3. MBS gaaru meeru ee international affairs meeda raasukondi, one of the best article in recent times and I never expected this much good article from you, Telugu states gurinchi asalu raayaddu, I know you have to be biased towards Jagan since you are working for him but with this kind of talent please don’t write baised articles and loose your credibility

  4. ఈ అంతర్జాతీయ మానవతా సాయం, మిలటరీ సాయం, ఆయుధ సాయం పెర్ల తో జరిగే కోట్లాది డాలర్ల పంపిణీ లో ప్రభుత్వ పెద్దలు, మిలటరీ పెద్దలు, ఆయుధ కంపెన లా పెద్దలు కి చేతి వాటా లు వుండనే ఉంటాయి. చివరికి గ్రౌండ్ లెవల్ లో చేర్వివి పైసా అంట.

  5. మీ రాతలు భలే గమ్మత్తుగా ఉంటాయి… మాకు తెలీని ఎంతో కొంత సమాచారం మాకు దొరుకుతుంది… ఈ వ్యాసంలో కాదు గానీ… కొన్నింటిలో మీ పక్షపాతం… దుగ్ధ.. దొర్లుతుంటాయి… (ఇలా అన్నందుకు వేరేలా అనుకోకండి)

    అయినా చదవడానికి బావుంటాయి.

    విపుల పుస్తకాల తర్వాత మీ ఆర్టికల్స్ మాత్రం ఫాలో అవుతుంటా..

  6. బెయిడన్ పుణ్యమా అని అమెరికా అధ్యక్త పదవి అంటే ఎంతో గొప్పది అని భ్రమలు పటాపంచలు అయ్యాయి. ఒక మానసిక అవరోధం వున్న వ్యక్తి కూడా అమెరికా లాంటి దేశాన్నికి అధ్యక్షుడిగా చెలామణి కావొచ్చి అని నిరూపణ అయ్యారు

    1. అమెరికా అధ్యక్షయ పదవి చాలా చులకన అయింది, ఒక రేపిస్ట్, శాడిస్ట్, క్రిమినల్ కూడా ఎన్నిక అవ్వచ్చు అని drump ఋజువు చేశాడు. Biden చాలా చాలా బెట్టర్ ఫర్ కామన్ పీపుల్.

  7. ఎంబీస్ గారు,

    మీరు వ్రాసినది చదవడానికి బాగా ఉన్నా, ప్రస్తుత పరిస్థితుల్లో జెలెన్స్కీ చేసింది కరెక్ట్. ఎందుకంటే రష్యన్ వారు మూర్ఖత్వంతో యుద్ధం చేయడం అనేది పరిపాటిగా చేసుకున్నారు. ఈ విషయం చరిత్ర తెలిసిన మీకు చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఉక్రెయిన్ ఏదో ఒకటి ఒప్పుకోవడం వల్ల రష్యా అక్కడితో ఆగుతుంది అనుకుంటే అది భ్రమే. అది పక్కన ఉన్న పోలండ్, ఫిన్లాండ్ మీద పడుతుంది. అవి నాటోలో భాగమే అయినా ఈ ట్రంప్ ను నమ్ముకుని యూరోప్ దేశాలు తానే అంటూ ట్రంప్ చెప్పిన దానికి కట్టుబడి ఉండవు. ఇప్పుడు ఫ్రాన్స్ , యుకె , జర్మనీ దేశాలు భయపడేది, ఈ యుద్ధం వల్ల కలిగిన ఇబ్బందులు అన్నీ భరించాల్సి వచ్చింది అందుకే.. రష్యా ని ఇక్కడితో నిర్వీర్యం చేయాల్సిన అవసరం ఉంది అనే..

    1. నాకు తెలిసి ముందు కెలికింది ఉక్రైనే. 2014 లో క్రిమియా పోతానికి కారణం వీళ్లు దానికి వాటర్ బ్లాక్ చెయ్యటమే. దీంతో రష్యా కి ఉన్న ఏకైక అల్ సీజన్ పోర్ట్ కి అడ్డంకులు మొదలు పెట్టారు. USSR విడిపోయినప్పుడు రష్యా చాలా పెద్దమనసుతో భారీ ఇండస్ట్రీస్, మంచి ల్యాండ్స్ అన్ని ఉక్రెయిన్ కి ఇచ్చింది. అనుకూల ప్రెసిడెంట్స్ ఉన్నప్పుడు ఎంతో హెల్ప్ చేసింది. కానీ ఉక్రెయిన్ పాత ప్రెసిడెంట్ ని illegalగా తరిమేసి వీరిని తీసుకొచ్చింది. పైగా వచ్చి రావటంతోనే NATO, NATO అంటూ పిచ్చి పట్టినట్టు ప్రవర్తించారు. ఇన్నాళ్లు ఓపిక పట్టిన రష్యా, ఉక్రెయిన్ కూడా NATO అనేసరికి తట్టుకోలేక పోయింది. ఎందుకంటే ఉక్రెయిన్ జియోగ్రఫీ పరంగా plains. ఒక్కసారి NATO అక్కడికి చేరితే మాస్కో కూతవేటు దూరమే. ఈ విషయం ఉక్రెయిన్ కి తెలిసి కూడా రష్యా ని రెచ్చగొట్టింది, వాళ్లు ఎందుకు ఊరుకొంటారు?

      తూర్పు యుక్రెయిన్లో మెజారిటీ వర్గమైన ఎథ్నిక్ రష్యన్స్ ను ఉక్రెయిన్ మాముల్గా రాచి రంపాన పెట్టలేదు అందుకే పోగొట్టుకుంది.

    2.  నాకు తెలిసి ముందు కెలికింది ఉక్రైనే. 2014 లో క్రిమియా పోతానికి కారణం వీళ్లు దానికి వాటర్ బ్లాక్చెయ్యటమే. దీంతో రష్యా కి ఉన్న ఏకైక అల్ సీజన్ పోర్ట్ కి అడ్డంకులు మొదలు పెట్టారు. U/S/S/R విడిపోయినప్పుడు రష్యా చాలా పెద్దమనసుతో భారీ ఇండస్ట్రీస్, మంచి ల్యాండ్స్ అన్ని ఉక్రెయిన్ కి ఇచ్చింది. అనుకూల ప్రెసిడెంట్స్ ఉన్నప్పుడు ఎంతో హెల్ప్ చేసింది. కానీ ఉక్రెయిన్ పాత ప్రెసిడెంట్ ని i/l/l/e/g..a..l.గా తరిమేసి వీరిని తీసుకొచ్చింది. పైగా వచ్చి రావటంతోనే N/A/T/O, N/A/T/O అంటూ పిచ్చి పట్టినట్టు ప్రవర్తించారు. ఇన్నాళ్లు ఓపిక పట్టిన రష్యా, ఉక్రెయిన్ కూడా N/A/T/O అనేసరికి తట్టుకోలేక పోయింది. ఎందుకంటే ఉక్రెయిన్ జియోగ్రఫీ పరంగా plains. ఒక్కసారి N/A/T/O అక్కడికి చేరితే మాస్కో కూతవేటు దూరమే. ఈ విషయం ఉక్రెయిన్ కి తెలిసి కూడా రష్యా ని రెచ్చగొట్టింది, వాళ్లు ఎందుకు ఊరుకొంటారు?  తూర్పు యుక్రెయిన్లో మెజారిటీ వర్గమైన ఎథ్నిక్ రష్యన్స్ ను ఉక్రెయిన్ మాముల్గా రాచి రంపాన పెట్టలేదు అందుకే పోగొట్టుకుంది.

    3. చరిత్రలో రష్యా కావాలని దురాక్రమణదారు ఎప్పుడూ కాదు. గట్టిగా మాట్లాడితే అమెరికానీ, యూరప్నీ నమ్మి దేశం ముక్కలు చేసుకుంది. తర్వాత కూడా వదలక పోతే ఓపికపట్టింది. పీకల మీదకి వస్తే ఎవ్వరికైనా చావో రేవో తప్పదు కదా.

  8. ఇలాంటి చర్చల సమయంలోనే ifs ( దౌత్యవేత్త ) ల పేర్లు బయటకి వస్తూ వింటారు, వారి యొక్క మాటల చమత్కారి తనం పేపర్ల ద్వారా బయటపడుతూ వుంటది.

  9. Putin started the war, but Trump is wrongly blaming Zelensky. When America began funding Zelensky, it wasn’t for recovery. Now, Trump is demanding $500 billion worth of minerals, while Zelensky seeks security for his country. It’s like Modi providing vaccines free to build goodwill and help other countries. Trump is sacrificing the EU for Putin, which isn’t good in the long run. Instead of forcing Zelensky to sign an agreement, Trump should negotiate a respectful exit for Ukraine. Zelensky is a small, beleaguered man who needs sympathy and moral support to return to normalcy. Trump blamed Biden and Obama in front of a foreign president, showing that might is right. MBS, you’re standing for might, not morals.

    1. ఇప్పుడు ప్రపంచానికి కావలసింది rare earth minerals. అవి లేక పోతే అమెరికా చైనాతో పోటీ పడలేదు . ప్రపంచములో అవి ఉక్రెయిన్ , రష్యా , చైనా , లో వున్నాయి . అందుకే ట్రంప్ రష్యా వైపు మొగ్గుచూపుతున్నారు . వాటికోసమే ఈ యుద్ధ సహాయాలు అన్నీ .

    2.  నాకు తెలిసి ముందు కెలికింది ఉక్రైనే. 2014 లో క్రిమియా పోతానికి కారణం వీళ్లు దానికి వాటర్ బ్లాక్చెయ్యటమే. దీంతో రష్యా కి ఉన్న ఏకైక అల్ సీజన్ పోర్ట్ కి అడ్డంకులు మొదలు పెట్టారు. U/S/S/R విడిపోయినప్పుడు రష్యా చాలా పెద్దమనసుతో భారీ ఇండస్ట్రీస్, మంచి ల్యాండ్స్ అన్ని ఉక్రెయిన్ కి ఇచ్చింది. అనుకూల ప్రెసిడెంట్స్ ఉన్నప్పుడు ఎంతో హెల్ప్ చేసింది. కానీ ఉక్రెయిన్ పాత ప్రెసిడెంట్ ని i/l/l/e/g..a..l.గా తరిమేసి వీరిని తీసుకొచ్చింది. పైగా వచ్చి రావటంతోనే N/A/T/O, N/A/T/O అంటూ పిచ్చి పట్టినట్టు ప్రవర్తించారు. ఇన్నాళ్లు ఓపిక పట్టిన రష్యా, ఉక్రెయిన్ కూడా N/A/T/O అనేసరికి తట్టుకోలేక పోయింది. ఎందుకంటే ఉక్రెయిన్ జియోగ్రఫీ పరంగా plains. ఒక్కసారి N/A/T/O అక్కడికి చేరితే మాస్కో కూతవేటు దూరమే. ఈ విషయం ఉక్రెయిన్ కి తెలిసి కూడా రష్యా ని రెచ్చగొట్టింది, వాళ్లు ఎందుకు ఊరుకొంటారు? తూర్పు యుక్రెయిన్లో మెజారిటీ వర్గమైన ఎథ్నిక్ రష్యన్స్ ను ఉక్రెయిన్ మాముల్గా రాచి రంపాన పెట్టలేదు అందుకే పోగొట్టుకుంది.

  10. How lame US, Canada and Europe are who invested heavily on Zelensky? bad call! Zelensky is a joker by profession, and he proved he is the one in real life too. At least now we hope this war ends soon.

  11. ఇప్పుడు ప్రపంచానికి కావలసింది rare earth minerals. అవి లేక పోతే అమెరికా చైనాతో పోటీ పడలేదు . ప్రపంచములో అవి ఉక్రెయిన్ , రష్యా , చైనా , లో వున్నాయి . అందుకే ట్రంప్ రష్యా వైపు మొగ్గుచూపుతున్నారు . వాటికోసమే ఈ యుద్ధ సహాయాలు అన్నీ . పుతిన్ ట్రంప్ కి అవి సప్లై చేస్తాను అంటున్నాడు . అందుకే ఉక్రెయిన్ కూడా ఇస్తే అందరూ కలిసి బిజినెస్ చేసుకోవచ్చు . సమస్య శాశ్వతంగా పరిస్కారం అవుతుంది అంటున్నాడు . ట్రంప్ బిజినెస్ డీల్ ద్వారా శాంతి వస్తుందంటున్నారు

  12. This is an insensitive article with no consideration to the people of Ukraine and supporters of Ukraine. Zelensky stood-up for the people of Ukraine at the moment and showed the world the meaning of self-respect without too much worrying about the consequences. They would rather let Russia take over Ukraine instead of surrendering to the Trump demands, which will make Ukraine a vulnerable region economically, morally, and politically. Ukranians are a bunch of smart and hard-working people and can thrive even under the rule of Russia.

  13. పాము పుట్ట పక్కన ముంగిస వస్తే పాము ఊరుకుంటుందా ??

    ఈ యుక్రెయిన్ , నాటో నాటో అని పాడిన పాటే పాడుతూ ఉండేవాడు ….

    అసలు నాటో నా పక్కకి రావొద్దు అని రష్యా ఎప్పుడో చెప్పింది …. ఎవరైనా అదే చేస్తారు

  14. Seems to be fully biased article. Unfortunately most of Indian intellectuals (so called) are biased towards USSR. what they are missing is Russia is not USSR. Russia is not fighting for socialism any more. It is Putin who invaded Ukraine, not the other way. Ukraine is weaker. That doesn’t mean that they should not have any self respect. If Russia is not stopped, tomorrow China will occupy Taiwan. And God forbids, China may start war with India. If China occupies parts of India, as China is mightier than us, no one will be there to our rescue. We can easily win a war with Pakistan, but not China. We already lost one war with China. So, there should someone or group of countries who should stop mighty countries occupying weaker neighbors. Otherwise, Colonization will be back.

    1.  నాకు తెలిసి ముందు కెలికింది ఉక్రైనే. 2014 లో క్రిమియా పోతానికి కారణం వీళ్లు దానికి వాటర్ బ్లాక్చెయ్యటమే. దీంతో రష్యా కి ఉన్న ఏకైక అల్ సీజన్ పోర్ట్ కి అడ్డంకులు మొదలు పెట్టారు. U/S/S/R విడిపోయినప్పుడు రష్యా చాలా పెద్దమనసుతో భారీ ఇండస్ట్రీస్, మంచి ల్యాండ్స్ అన్ని ఉక్రెయిన్ కి ఇచ్చింది. అనుకూల ప్రెసిడెంట్స్ ఉన్నప్పుడు ఎంతో హెల్ప్ చేసింది. కానీ ఉక్రెయిన్ పాత ప్రెసిడెంట్ ని i/l/l/e/g..a..l.గా తరిమేసి వీరిని తీసుకొచ్చింది. పైగా వచ్చి రావటంతోనే N/A/T/O, N/A/T/O అంటూ పిచ్చి పట్టినట్టు ప్రవర్తించారు. ఇన్నాళ్లు ఓపిక పట్టిన రష్యా, ఉక్రెయిన్ కూడా N/A/T/O అనేసరికి తట్టుకోలేక పోయింది. ఎందుకంటే ఉక్రెయిన్ జియోగ్రఫీ పరంగా plains. ఒక్కసారి N/A/T/O అక్కడికి చేరితే మాస్కో కూతవేటు దూరమే. ఈ విషయం ఉక్రెయిన్ కి తెలిసి కూడా రష్యా ని రెచ్చగొట్టింది, వాళ్లు ఎందుకు ఊరుకొంటారు? తూర్పు యుక్రెయిన్లో మెజారిటీ వర్గమైన ఎథ్నిక్ రష్యన్స్ ను ఉక్రెయిన్ మాముల్గా రాచి రంపాన పెట్టలేదు అందుకే పోగొట్టుకుంది.

  15. I don’t see anything wrong in Zelensky asking for future safety. Trump is now asking for $500B worth of minerals. what if Russia invades in future again? Ukraine is not in NATO yet. but there are other Nato countries who are neighbors to Russia. Finland just joined nato. words like “beggars are not choosers” are disrespectful to any person, let alone a Sovereign country. It US who promised to Ukraine. if US said that they can’t on day 1, Ukraine would not have entered the war. Or war might have been finished in a week. Even now war will be finished in a week without US support. The whole world knows that. Do you think Zelensky doesn’t that? Trump is totally taking Putin’s side. he is not talking like a mediator. There is no word about the conditions that Trump had for Putin.

    1. I think you did not understand what 5he author is saying. He is saying g the same thing. Zelensky should have thought what will be the terms of other countries after the war. Trump is a businessman. He wants to get the maximum out of his investment. Do you think that even if ‘not smart’ (according to Trump) Biden was in power, he would not have asked Zelensky about some returns on investment. Zelensky should be atleast know that US will never fight China or Russia directly and vice-versa. They always use small countries like scape-goats. End of the day his own country is turned into bubbles. Even today he wants to continue war instead of making peace.

  16. truth is that USA could have stopped funding quietly and diplomatically. But Trump is a crook. So he invited zelensky and insulted him in front of world. Karma is a bit ch. Today it might be ok, but tomorrow it come back and bite evenn the most powerful people. Karma doesn’t give exceptions.

  17. చిత్రంగా ఎక్కడా మోడిని మధ్యలోకి లాక్కువచ్చి విమర్శించలేదు. భలే భలే

  18. ఉక్రెయిన్ సార్వభౌధికారాన్ని గౌరవించకుండా, రష్యా నాటో సభ్యత్వం విషయంలో కలుగచేసుకున్నది. తన సరిహద్దుల్లోకి నాటో దేశాలు వస్తే జరిగే పరిణామాల విషయంలో దాని భయం దానిది.

    మహాభారతం చాలా పాఠాలు చెప్పింది.

    యుద్దానికి ముందు శత్రుబలాలనూ రాబోయే పరిణామాలనూ అంచనా వేయమన్నది.

    కొద్దిగా అయినా జెలెన్‍స్కీ భారతం చదివి ఉంటే, అటు నాటో దేశాలకూ ఇటు రష్యాకు మధ్య, తనకెందుకు తలనొప్పి అని తప్పుకుని ఉండేవాడు.

    పొరుగువాడు శాశ్వతం, దూరాన ఉన్నవాడి మీద నమ్మకంతో బలమైన పొరుగువాడితో శతృత్వం ప్రమాదం. మనం పాకిస్తాన్ తో చైనాతో వేగటంలేదూ,

      1. . కాశ్మీర్ చూస్తూనే వున్నాం కదా, ఈ అందరూ కలిసి ఏమో చేసేరో!

        సర్దార్ నీ కాశ్మీర్ లో వేలు పెట్టనివ్వకుండ , నెహ్రూ ఖాన్ నే కథ నడిపించాడు, తనలో వున్న అరబ్బు రక్తానికి అనుకూలంగా.

        1. అదేంటి బ్రిటిష్ వాళ్ళని క్షమాబిక్ష అడుక్కున్న సావర్కర్ కదా ఇదంతా చేసింది అని సర్దార్ తన నిజమైన బయో గ్రఫీ లో వ్రాసుకున్నాడు

  19. ఎప్పటిలాగా ఇదంతా యూరప్ చేసిన జిత్తులమారి వ్యవహారం/కంపు. యుక్రెయిన్ ను ముందరికి తోసి సమిధను చేశాయి. యూరప్ కి రష్యా LPG/Petrolium కావాలి. కానీ అవి colonial style లో కావాలి. అంటే దోపిడీ విధానంలో కావాలి. అలవాటు పడిన ప్రాణం. కానీ రష్యాను రుబాబు చేయగల దమ్ము/ధనం లేదు. అమెరికా దన్ను కావాలి. రష్యాకు USSR కాలం నాటి ప్రభ కావాలి. యూరప్ కెలుకుడు నుంచి రక్షణ కావాలి. దానికి USSR కాలంతో సరితూగ భూమి కావాలి. అటువంటి రాజ్యకాంక్షా ఉపద్రవం నుంచి యుక్రెయిన్ కు రక్షణ కావాలి. అందుకు దానికి NATO సభ్యత్వం కావాలి. NATO సభ్యత్వం Russia కు నిస్సందేహంగా నచ్చదు. పక్కలో బల్లెంలాగా యూరప్ నుంచి ఉపద్రవాలు నిత్యం అవుతాయనీ అనుమానం కావచ్చు. అమెరికాకు rare earth minerals కావాలి. ప్రస్తుతం అవి వారి అధీనంలో లేక పోవటం వలన చైనా దగ్గర రాజీ పడవలసి వస్తోంది/వస్తుంది. Trump తనొక్క గొప్ప బేరగాడని నమ్మకం. యుక్రెయిన్ లో (అప్పనంగా) rare earth minerals తవ్వుకునే పథకం రచించాడు. ట్రంప్ కాకున్నా అసలు USA ఉద్దేశ్యం అదే అయ్యివుంటుంది. యుక్రెయిన్ కు NATO సభ్యత్వం ఇచ్చి తవ్వుకుందామని చూస్తే రష్యాకు నచ్చదు, వారి అదుపులో ఉన్న యుక్రెయిన్ mineral rich భూమి దక్కదు. సభ్యత్వం ఇస్తే కానీ యుక్రెయిన్ minerals తవ్వుకోనివ్వదు. కాబట్టి యుక్రెయిన్ ప్రమేయం లేకుండా రష్యా తో చర్చలు జరిపేసి, వారి అదుపులో ఉన్న యుక్రెయిన్ భూమి ని తవ్వుకునే ఒప్పందం చేసేసుకోవటం ట్రంప్ administration ఆలోచనగా తోస్తోంది. ట్రంప్ తో ఇటువంటి పితలాటకం ఏదో ఉందని ముందరే పసిగట్టి యుక్రెయిన్ అధ్యక్షుడు ట్రంప్ కు వ్యతిరేకంగా USA elections లో పాల్గొన్నాడని ట్రంప్ అభియోగం. ఈ రెండు నివురుగప్పిన నిప్పులు ఒక్కసారిగా మీడియా ఎదుట భగ్గుమన్నాయి. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే అమెరికా సహాయం మీద ఆధార పడుతూ, అమెరికా గడ్డపైనే, అందునా White House లో, మరీ ముఖ్యంగా పరమ అహంభావి అయిన ట్రంప్ ని వారి మీడియా ముందే Zelensky ఆక్షేపించటం! అది ఒళ్లు తెలియని ఆవేశమో, మూర్ఖత్వమో, తెంపరితనమో అర్థం కాలేదు. ఏది ఏమైనా దీనికి కారణమైన యూరప్ మాత్రం ఎప్పటిలాగా చేతులకి మట్టి అంటకుండా ఇది అమెరికా, రష్యా, యుక్రెయిన్ సమస్యగా చిత్రీకరించటంలో సఫలం అయ్యాయి. మధ్యలో పెద్దమనుషి లాగా సయోధ్య కుదర్చటానికి అన్నట్టు ఒక నాటకం. ఇప్పుడు Ukrain అనుకున్న దానికన్నా మరింత ఎక్కువ మూల్యం చెల్లించుకోవాల్సివస్తుంది.

      1. Too late..things are entangled very badly. 3 against 1 vs 2 against 2 and notably both the powerful on the same side. Either with or without USA, Ukraine is screwed…I wouldn’t completely finger point at Zelenksy, he has a valid point. After Russia occupying Georgia, the fears heightened for Ukraine. Zelensky is asking for formal security guarantees the west was promising all along, either by USA or Europe of course for a commercial benefit. Europe is cunning as usual, they wont/they cant guarantee anything as they by themselves are relying on USA for the protection from Russia. Originally Zelensky was ready for a compromise but the lobby groups “led” by an influential senator who is “mediating” in between Ukraine and USA didn’t let that happen per some news outlets. Moral of the story, in a relation with the powerful, the latter will decide the agenda and prior must abide by. So one should be careful choosing the level of engagement/reliance in a relation with powerful.

  20. ఆఫ్రికా దేశాలను చూస్తే అర్ధం అవుతుంది, ఈ పెద్ద పెద్ద దేశాలు మిలటరీ, ఖనిజాల కోసం , ఆఫ్రికా ను ఎలా బ్రేక్ఫాస్ట్ లో చప్పరించేసాయో?

    ఆఫ్రికా – ప్రపంచమే లోనే ఖనిజాలు, మినరల్స్ కి పెట్టు గడ్డ.

    చివరికి అమెరికా కంటే కూడా విస్తీర్ణం లో పెద్దదైన ఆఫ్రికా ను, మన అందరం జాగ్రఫీ లో వాడే అట్లాస్ లో కూడా అమెరికా కంటే చిన్నగా చూపిస్తారు.

    వాటికన్ సహాయంతో అక్కడి స్థానిక ఆదివాసీ, ప్రకృతి ఆరాధన పద్ధతులు అన్ని నాశనం చేసి , అక్కడ ప్రజలనిమతం పేరుతో తమకి శాశ్వత మానసిక బానిసలుగా మార్చుకున్నారు. ఆఫ్రికా చర్చ్ పాస్టర్లు అంటే బోలెడు కధలు బయటకి వస్తాయి.

    1. >>చివరికి అమెరికా కంటే కూడా విస్తీర్ణం లో పెద్దదైన ఆఫ్రికా ను, మన అందరం జాగ్రఫీ లో వాడే అట్లాస్ లో కూడా అమెరికా కంటే చిన్నగా చూపిస్తారు.

      (Note, this my clarification below is specific to world map only. No latent meaning is implied otherwise to other the parts of the comment) I believe it didn’t start with a preconceived intention though it might have been used for one’s benefit. The under sized representation we are seeing was invented in 1500’s ,the time when competition for global trade is ramping up among Europeans, with a focus to help navigators sail east<->west across northern hemisphere. There is a geometrical reasoning for such aberration in that projection. In fact there are many projections that were created or being created by various set of people with a variety of technical purposes in mind. All of them carry abnormalities. There is no one perfect solution.

      1. గతం లో అంటే టెక్నాలజీ లేదు అనుకుందాం,

        ఇంత టెక్నాలజీ అభివృద్ధి జరిగినకూడ, ఇంకా ఆ పాత తప్పు నీ సవరించక పోవడ. ఏమిటి ?

        ఒకవేళ ఇంకా టెక్నాలజీ పరిమితులు వున్నాయి అనుకుంటే, ఈ అసంబద్ధ అవాస్తవ దేశాల కొలతలు తక్కువ చూపించడం అమెరికా విషయంలో యెందుకు జరగ లేదు? కేవలం ఆఫ్రికా విషయం లో మాత్రమే యెందుకు ఇంకా జరుగుతేనే వున్నది?

  21. మన భారతదేశం ఉక్రెయిన్ కి ఎప్పుడు కూడా గతం లో వ్యతిరేకం కాకపోయినా, నష్టం చేయకపోయినా కూడా ,

    ప్రస్తుత ఉక్రెయిన్ ప్రభుత్వం ( రష్యా ఉక్రెయిన్ యుద్ధం కంటే ముందూ కూడా ) భారత దేశం కి వ్యతిరేఖంగా చాలా అంతర్జాతీయ వేదిక ల మీద తమ వైఖరి నీ తెలియ జేసింది.

      1. భారత దేశం విద్యార్థులు మెడిసిన్ విద్య కోసం అక్కడ కట్టే ఫీజులు వలనే చాలా యూనివర్సిటీ లు నడిచేవి యుద్ధం ముందు.

  22. ఈ టాపిక్ మీద ఇంత ఏకపక్ష ఆర్టికల్ చూడటం ఇదే మొదటిసారి. అసలు నేరస్తుడు అయిన పుతిన్ ని తప్పు పట్టకుండా బాధిత దేశాన్ని నిందించటం కన్నా ఘోరం లేదు. పైగా నీ చర్యలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తున్నాయి అని నిందలు ఒకటా? అసలు జెలెన్‌స్కీ అడిగినదాన్లో తప్పేమి లేదు. సోవియెట్ విచ్చినం అయ్యి ఉక్రెయిన్ ఏర్పడినప్పుడు ఆ దేశం వద్ద భారీగా అణ్వాయుధాలు ఉండేవి. ఎంత అంటే అమెరికా, రష్యా ల తర్వాత మూడో స్థాయి లో ఉండేది. కానీ అప్పట్లో అమెరికా, యుకే, రష్యా లు ఒత్తిడి చేసి ఉక్రేయిన్ భద్రత కి మాదీ హామీ అని చెప్పి ఆ ఆయుధాలని నిర్వీర్యం చేసారు. అప్పటి నించి మొదలైనాయి ఉక్రెయిన్ పాట్లు. అమెరికా, బ్రిటన్ లు ఉక్రెయిన్ రక్షణ కి చేసిన వాగ్ధానాలు నీటి మూటలు అయ్యాయి. రష్యా ఏకంగా దురాక్రమణ కే దిగింది. ఇవాళ అదే ఆయుధాలు ఉన్నట్లయితే ఇలా ఎవరి ముందు దేబిరించాల్సిన పని ఉండేది కాదు.

    అందుకే జెలెన్‌స్కి సెక్యూరిటి గ్యారంటీ ల కోసం పట్టుబట్టాడు. అంటే తన దృష్టి లో నాటో సభ్యత్వం. ఇవేమి లేకుండా ఉక్రెయిన్ ని ఇంకోసారి ముంచి అక్కడున్న మినరల్స్ ని వాటాలు పంచుకుని తీసుకెళ్దాం అని అమెరికా, రష్యా ల ఆలోచన.

    అసలు ఉక్రెయిన్ కి నాటో సభ్యత్వం ఇవ్వటం అమెరికా కి ఇష్టం లేదు. అది ఉక్రెయిన్ ని నాటో సభ్యదేశాలకి, రష్యా కి మధ్య ఒక బఫర్ జోన్ గా వాడుకోవాలని చూస్తుంది. కర్ర విరగకుండా పాము చావకుండా ఉండాలని దాని ఎత్తుగడ. సభ్యత్వం ఇస్తే నాటో సేనలు ఉక్రెయిన్ లో మోహారించాలి. అదే చేస్తే పుతిన్ ఎంతకైనా తెగిస్తాడు. పోనీ అలా వదిలేస్తే పుతినే ఉక్రెయిన్ ని ఆక్రమించి వాళ్ల పక్కనకి వస్తాడు. అది మరింత ముప్పు. కాబట్టి ఏం జరిగినా అమెరికా, నాటో దేశాలు ఉక్రెయిన్ కి డబ్బులు ఇవ్వకుండా ఆపవు. ఈ విషయం జెలెన్‌స్కి కి తెలుసు. కాబట్టే మీరంతా బాగుండాలి గాని మీకు రక్షణ కోసం మా దేశం బలి అవ్వాలా అని సెక్యూరిటీ గ్యారంటీ ల కోసం పట్టుబట్టాడు. ఏమైనా ఇది ఇప్పుడప్పుడే తేలదు. ఈ రావణ కాష్టం రగులుతూనే ఉండాలి. దీనివల్ల లబ్ధి పొందేది మాత్రం అమెరికా లో ఉన్న మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఇది చాలా చాలా పవర్ఫుల్ లాబీ. యుద్ధాలని సృష్టించేది, ఎగదోసేది.. సాయం పేర లక్షల కోట్ల డాలర్లు లాభపడేది ఈ ప్రెయివేటు సంస్థలే..

    చివరగా ప్రఖ్యాత అమెరికా దౌత్యవేత్త హెన్రీ కిస్సింజర్ వ్యాఖ్య ని ఒకసారి గుర్తు చేస్తా.. “To be an enemy of the US is dangerous, but to be a friend is fatal” – “అమెరికా తో శత్రుత్వం పెట్టుకుంటే ప్రమాదకరం. కానీ అమెరికా తో స్నేహం ప్రాణాంతకం.”

    1. I started reading this comment without seeing the commenter’s name. After reading this I verified who this commenter is with such an wise analysis. It is Satya one of the very few commenters who have good information

    2. ఇక్కడ వ్యాసం ప్రధాన ఉద్దేశ్యం ఏది మంచి చెడు/ తప్పు ఒప్పు లా కంటే కూడా ,

      చర్చల్లో బలహీన వైపు వున్న వారు,

      తమ పరిస్దితి గమనించి ఆచి తూచి మాట్లాడాలి అని అనుకుంటా.

      చివరికి

      నష్టపోయేది అమెరికా కాదు, ఉక్రెయిన్ మాత్రమే.

      అమెరికా వాడు, ఇంకో బిలియన్ డాలర్లు ప్రింట్ చేసుకుంటాడు, కావాలి అంటే.

    3. ఇక్కడ ఎక్కువ బాధిత దేశం రష్యా , ఉక్రెయిన్ కి నాటో సభ్యత్వం ఇవ్వటం ఇష్టం లేదు అని తెలిసినప్పుడు జెలెన్‌స్కీ యుద్ధానికి సిద్ధం అని కాలు దువ్వటం ఉక్రెయిన్ ప్రజలని మోసగించటమే

    4. యూక్రెయిన్ మీద అంత ప్రేమ ఉంటే వెళ్ళి వాళ్ళ సైన్యంలో కలిసి యుద్ధం చెయ్యి బ్రో. కానీ నువ్వలా చెయ్యవు ఎందుకంటే నీకు నీ ప్రాణం ముఖ్యం కాబట్టి. అలాగే అమెరికాకి కూడా వాళ్ళ దేశం ముఖ్యం. ట్రంప్ వచ్చాక కూడా అమెరికా యూక్రెయిన్ కి డబ్బులిచ్చుకుంటూ పోతుంది అని నువ్వనుకుంటే నీకు విషయ పరిజ్ఞానం లేదనుకోవాలి.

      1. ఉక్రెయిన్ సైన్యం కూడా అమెరికా కోసం ఇరాక్ తో యుద్దం లో పాల్గొన్నారు బ్రో.. కాబట్టి చెస్తే గీస్తే అమెరికా చెయ్యాలి ఉక్రెయిన్ కోసం.. నాకేం పట్టే?

  23. సుమారు 40 నిమిషాలపాటు జెలెన్‌స్కీ కి ట్రంప్ కి మధ్య సజావుగా సాగుతున్న సమావేశం మన ఆంధ్ర అల్లుడు వాన్స్ గారి వాచాలత్వం వల్ల పెంట అయింది.

    1. అతను అమెరికన్ , ఒకవేళ నువ్వు అనుకున్నట్టు ఆంధ్ర అల్లుడు కాబట్టే అనుకుంటే అమెరికాలో భారతీయులు ఎక్కువ అందుకే మిగతా రాష్ట్రాల నుంచి వచ్చిన భారతీయులకి బిక్ష పెట్టాడు అనుకోవచ్చుకదా ,ఠీవిగా ఆంధ్రుల అల్లుడిగా వైట్ హౌస్ లో ఉన్నాడు

  24. జెలెన్స్కీ పదవిలో ఉన్నంత కాలం యుక్రెయిన్ లో శాంతి స్థాపన సాధ్యం కాకపోవచ్చు. అతను పదవీ వీచ్యుతుడయితేనే ఆ దిశగా అడుగులు పడే అవకాశం వుంది. రాబోయే రోజుల్లో అమెరికా మిలిటరీ సహాయం నిలుపుదల చేస్తే, యూరోప్ చేసే అంతంత సహాయం యుక్రెయిన్ కి సరిపోదు. ఈ ఉత్సాహం తో రష్యా ఇంకా దూకుడు పెంచుతుంది. వీటన్నిటికీ నివారణ మార్గం , జెలెన్స్కీ ని తప్పించడమే.

  25. ఎంబిఎస్ ప్రసాద్ గారి నుండి ఇటువంటి ఏకపక్ష విశ్లేషణ రావడం చాలా ఆశ్చర్యకరం బాధాకరం.

  26. typical indian mind set..everybody has to be the most intelligent person by reading from google…

    first all, by the time we are told something, power players have already made move.

  27. అప్పట్లో ఒక సామెత వుండేది

    ఖనిజాలు వున్న ఆఫ్రికా దేశం లో కి వచ్చిన వాటికన్ మిషనరీ లు వాళ్ళ చేతుల్లో బైబుల్ పెట్టీ కళ్ళు మూసుకుని ప్రార్థన చేయమన్నారు.

    కళ్ళు తెరిచి చూసేసరికి ఆఫ్రికా భూములు అన్నీ చర్చ్ ఆదీనంలో కి వెళ్లి పోయాయి.

    ఆఫ్రికా వాళ్ళు ఏమో తన ప్రకృతి ఆరాధన సంస్కృతి పోగొట్టుకుని, పాపులుగా మిగిలి చేతిలో బైబిల్ పట్టుకుని ఇంకా దశమ భాగాలూ చర్చి కి కడుతూనే వున్నారు.

    1. అలాగే, ఖనిజాలు వున్న దేశాలిని కొల్లగొట్టడనీకి , బలమైన దేశాలు ఏదో రూపంలో ట్రై చేస్తూనే వుంటారు.

      అవతార్ మొదటి భాగం లో ఈ నిజాన్ని కళ్ళకి కట్టినట్లు చూపించారు.

Comments are closed.