అదిగో ఫోటో.. ఇదిగో మోక్షు!

చాలా పట్టుదలగా మేకోవర్ అవుతున్నాడు నందమూరి మోక్షజ్ఙ. నిజానికి ఇప్పటికే బాగా ఆలస్యమైంది నందమూరి మూడో తరం వారసుడి తెరంగ్రేటం. దానికి బోలెడు కారణాలు. కానీ ఇప్పటికి కాస్త వేడి పుట్టింది. ముఖ్యంగా మోక్షజ్ఙ…

చాలా పట్టుదలగా మేకోవర్ అవుతున్నాడు నందమూరి మోక్షజ్ఙ. నిజానికి ఇప్పటికే బాగా ఆలస్యమైంది నందమూరి మూడో తరం వారసుడి తెరంగ్రేటం. దానికి బోలెడు కారణాలు. కానీ ఇప్పటికి కాస్త వేడి పుట్టింది. ముఖ్యంగా మోక్షజ్ఙ కు కూడా సినిమాల్లోకి రావాలనే ఆసక్తి బాగా పెరిగింది అని సన్నిహితుల బోగట్టా.

బాలకృష్ణ ఇఫ్పుడు ఫుల్ సెటిల్డ్ గా వున్నారు. రాజకీయంగా మంచి కంఫర్ట్ పొజిషన్ లో వున్నారు. సినిమాల పరంగా ఊపు మీద వున్నారు. కూతుర్లు ఇద్దరూ మంచి ఫ్యామిలీల్లో సెటిల్డ్ గా వున్నారు.

ఇప్పుడు మిగిలిన బాధ్యత మోక్షు ను హీరోను చేయడమే. కానీ అది అంత సులువుగా తీసుకునే నిర్ణయం కాదు. సరైన దర్శకుడు. సరైన సబ్జెక్ట్ కావాలి. ఏ తీరుగా, ఏ జానర్ లో ఎంటర్ చేయించాలి అన్నది బాలకృష్ణ ముందుగా డిసైడ్ కావాల్సి వుంది. మరీ పెద్ద డైరక్టర్లు కాదు. మరీ కొత్త డైరక్టర్లు కాదు. ఇదంత సులువుగా డిసైడ్ అయ్యేది కాదు. చాలా టఫ్ డెసిషన్ ఇది. సబ్జెక్ట్ సరైనది ఆర్గానిక్ గా దొరకాలి.

ఎన్టీఆర్ చాలా పద్దతిగా కే. విశ్వనాధ్ లాంటి మంచి దర్శకులతో కూడా బాలకృష్ణకు అప్పట్లో సినిమాలు సెట్ చేసారు. అంత మంది దర్శకుల వద్దా శిక్షణ పొందేలా చేసారు. ఇప్పుడు బాలయ్య కూడా అలాగే ప్లాన్ చేయాల్సి వుంటుంది.

రాబోయే ఆరునెలల్లో ఎలాగైనా మోక్షు సినిమాను స్టార్ట్ చేయాలని బాలయ్య ఆలోచనగా తెలుస్తోంది. అందువల్ల ఈ ఏడాదే ఎంట్రీ వుంటుందని తెలుస్తోంది.