రూ.7.5 కోట్లు ఖరీదైన కారులో రామ్ చరణ్

ఇండస్ట్రీలో చాలామందికి కార్ల మోజు ఉంది. మంచి మోడల్ కనిపిస్తే ధర గురించి పట్టించుకోకుండా కొనుగోలు చేస్తారు. అలాంటి ఓ మంచి మోడల్ ను రామ్ చరణ్ దక్కించుకున్నాడు. Advertisement తాజాగా చరణ్ గరాజ్…

ఇండస్ట్రీలో చాలామందికి కార్ల మోజు ఉంది. మంచి మోడల్ కనిపిస్తే ధర గురించి పట్టించుకోకుండా కొనుగోలు చేస్తారు. అలాంటి ఓ మంచి మోడల్ ను రామ్ చరణ్ దక్కించుకున్నాడు.

తాజాగా చరణ్ గరాజ్ లోకి రోల్స్ రాయిస్ స్పెక్టర్ కారు వచ్చి చేరింది. ఈవీ విభాగానికి చెందిన దీని ధర అక్షరాలా 7 కోట్ల 50లక్షల రూపాయలు. తాజా సమాచారం ప్రకారం, ఈ మోడల్ కు సంబంధించి దేశంలో ఇది రెండో కారు మాత్రమే.

గత వారమే చరణ్ కు ఇది డెలివరీ అయింది. ఈరోజు ఇదే కారులో ఎయిర్ పోర్టులో కుటుంబ సమేతంగా ప్రత్యక్షమయ్యాడు. అనంత్ అంబానీ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్తున్నారు చరణ్-ఉపాసన దంపతులు.

రామ్ చరణ్ కు కార్లు అంటే సరదా. తనకు ఇష్టమైన కార్లను వెంటనే దక్కించుకుంటాడు. ఇప్పటికే అతడి వద్ద బీఎండబ్ల్యూ, బెంజ్, రేంజ్ రోవర్ కార్ల కలెక్షన్ ఉంది.