ఆహా…ఇంటర్ నెట్ చానెల్?

మై హోమ్ రామ్ పెట్టుబడి, నిర్వహణతో స్టార్ట్ అయిన తెలుగు ఓటిటి ఆహా.  సాధారణంగా ఓటిటి అంటే అబ్రివేషన్ అందరికీ తెలియదు కానీ, ఓటిటి అంటే మొబైల్ యాప్ లో సినిమాలు చూసుకోవచ్చు. అందుకోసం…

మై హోమ్ రామ్ పెట్టుబడి, నిర్వహణతో స్టార్ట్ అయిన తెలుగు ఓటిటి ఆహా.  సాధారణంగా ఓటిటి అంటే అబ్రివేషన్ అందరికీ తెలియదు కానీ, ఓటిటి అంటే మొబైల్ యాప్ లో సినిమాలు చూసుకోవచ్చు. అందుకోసం ఏడాదికి ఇంత అని ఫీజు చెల్లించాలి అన్నది కామన్ ఒపీనియన్.  

అమెజాన్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ లాంటి బడా సంస్థలు అన్నీ ఇదే అభిప్రాయాన్ని కలిగిస్తూ వచ్చాయి. టీవీలో సీరియళ్ల మాదిరిగా రోజువారీ విడతలు విడతలుగా కాకుండా ఒకేసారి పది ఎపిసోడ్ లు అందిస్తూ, వెబ్ సిరీస్ లుగా పాపులర్ అయ్యాయి. అలాగే చిన్న సినిమాలను వెబ్ ఫిల్మ్ లు గా అందిస్తున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో పూర్తి తెలుగు కంటెంట్ తో ఆహా ఓటిటి స్టార్ట్ అయింది. పూర్తి తెలుగు కంటెంట్ తో అంటే అసలు అంత కంటెంట్ ఎక్కడ వస్తుంది అన్న అనుమానం కలిగింది అందరికీ. కానీ ఆహా అసలు ప్లాన్ పై ఇప్పుడు క్లారిటీ వస్తోంది. ఓటిటి ప్లాట్ ఫారమ్ అనే కన్నా, మొబైల్ లో టీవీ ఛానెల్, లేదా ఇంటర్ నెట్ టీవీ అనే స్ట్రాటజీతో ఆహా ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది,.

టీవీ ఎంటర్ టైన్ మెంట్ ఛానెళ్లు అన్నీ ఇప్పుడు పెయిడ్ ఛానెళ్లుగా మారిపోయాయి. మా టీవీ ని స్టార్ మా కు అమ్మేసారు. దాని ప్రమోటర్లు మళ్లీ ఇప్పట్లో మరో ఛానెల్ స్టార్ట్ చేయకూడదు. కానీ ఓటిటి వేరు. ఆహా ఇప్పుడు మా టీవీ, జీటీవీ లాంటి శాటిలైట్ ఎంటర్ టైన్ మెంట్ చానెళ్లకు పోటీగా ఓటిటి చానెల్ గా మారుతోంది.

చిన్న చిన్న పరభాషా సినిమాలు కొని స్వంతంగా డబ్బింగ్ చేసి అందించడం, చిన్న సినిమాలు నేరుగా కొనడంతో పాటు టీవీ షో ల మాదిరిగా షోస్ అందించడం చూస్తుంటే అలాగే భావించాల్సి వస్తోంది. సుమ, సమంత, హర్ష లాంటి వాళ్ల షో లు కొత్తవేమీ కాదు. టీవీల్లో వచ్చిన ఆలీతో సరదాగా, ప్రదీప్ కొంచెం టచ్ లో వుంటే చెబుతా,  మంచు లక్ష్మి టాక్ షో లాంటివే. ఆహా కూడా అలాంటివే చేస్తోంది. 

టీవీల్లో వచ్చే జబర్దస్త్, అదిరింది లాంటి షో లు కూడా అందించే ఆలోచనలు సాగుతున్నట్లు తెలుస్తోంది.  ఆహా కు డిస్కౌంట్ పోను ఏడాదికి 250 అంటే నెలకు ఇరవై రూపాయలు అవుతోంది. టీవీ చానెళ్లకు కూడా పది రూపాయల వరకు కట్టాల్సి వస్తోంది.  

అందువల్ల ఓ విధంగా ఆహా కూడా ఓ పెయిడ్ టీవీ చానెల్. అదనంగా కడుతున్నందున సినిమాలు ఎక్కువగా వుంటాయి. అవి కూడా లైబ్రరీ మాదిరిగా అక్కడే వుంటాయి అని లెక్క వేసుకోవచ్చు.

మొత్తం మీద మాటీవీ ని అమ్మేసిన లోటు సినిమా ఇండస్ట్రీకి, ముఖ్యంగా అల్లు అరవింద్ కు ఇలా తీరుతోందని అనుకోవాలేమో?

పవన్ కు ఒక నీతి.. ప్రకాష్ రాజ్ కు మరో నీతి