అజ్ఞాతవాసికి దారివదిలేసినట్లేనా?

కొద్ది రోజుల క్రితం వరకు రాబోయే సంక్రాంతికి సినిమాలు క్యూ కట్టేస్తాయని, కొట్టేసుకుంటాయని వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టే సినిమాలు ప్లాన్ చేసుకున్నారు. ఇలాంటి టైమ్ లో 120కోట్ల అజ్ఞాతవాసి ఎలా నెగ్గుకువస్తుందో అనుకున్నారు.…

కొద్ది రోజుల క్రితం వరకు రాబోయే సంక్రాంతికి సినిమాలు క్యూ కట్టేస్తాయని, కొట్టేసుకుంటాయని వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టే సినిమాలు ప్లాన్ చేసుకున్నారు. ఇలాంటి టైమ్ లో 120కోట్ల అజ్ఞాతవాసి ఎలా నెగ్గుకువస్తుందో అనుకున్నారు. కానీ ఇప్పుడు రాను రాను పరిస్థితి మారిపోతోంది. దాదాపు రెండు వారాల పాటు అజ్ఞాతవాసికి పూర్తిగా దారి వదిలేస్తున్నట్లు కనిపిస్తోంది.

చాలా కాలం క్రితం సంక్రాంతికి భరత్ అనే నేను వస్తుంది అనుకున్నారు. కానీ అంతలోనే అది సమ్మర్ కు జారుకుంది. రంగస్థలం సినిమా ఏనాడో అజ్ఞాతవాసి కారణంగానే వెనక్కు పోయింది. భాగమతి విడుదలవుతుంది అనుకున్నారు. వారం వెనక్కు వెళ్లింది. రోబో 2లాంటి భారీ సినిమా సంక్రాంతి తరువాతి వారం వస్తుందనుకుంటే అదీ వెనక్కు వెళ్లింది. 

సంక్రాంతికి వస్తాడన్న విశాల్ అభిమన్యుడు వారం వాయిదా. ఇక రవితేజ టచ్ చేసి చూడు కూడా దాదాపు వాయిదా పడిపోయినట్లే అని వార్తలు వస్తున్నాయి. ఇక సంక్రాంతి బరిలోకి వస్తున్నట్లు నికరంగా తేలిన సినిమాలు రెండే. వాటిల్లో ఒకటి సూర్య నటించిన గ్యాంగ్. ఇదేమీ అజ్ఞాతవాసికి పోటీ కాదు. అంత సీనూ వుండదు. పండగ సీజన్ లో చూడాలనుకునే సినిమాల జాబితాలో ముందుగా అయితే వుండదు. అది వాస్తవం. 

ఇక రెండో సినిమా బాలయ్య బాబు నటించిన జై సింహా. ఈ సినిమా మీద పెద్దగా బజ్ లేదు. హోప్స్ లేవు. పైసావసూల్ కు వచ్చిన బజ్ లో కానీ, చేసిన హడావుడి కానీ పదిశాతం కూడా కనిపించడం లేదు. పైగా కేఎస్ రవికుమార్ ఇప్పుడు ఏమంత క్రేజీ డైరక్టర్ కాదు. అందువల్ల పండుగ టైమ్ లో జస్ట్ ఓ ఆప్షన్ గా మాత్రమే వుంటుందీ సినిమా.

సో. మొత్తం మీద 9వ తేదీ రాత్రి నుంచి 25వరకు దాదాపు పదిహేను రోజులు అజ్ఞాతవాసి దున్నుకోవడం పక్క. ఒక్కటే కండిషన్ సినిమా బాగుంటే చాలు.