అఖిల్ సరదా తెచ్చిన తలనొప్పి

కుర్రాళ్లకు అనుభవం తక్కువ. సరదాగానే కానీ ఆలోచన ఉండదు. 40కోట్లు ఖర్చు పెట్టే సినిమాకు.. స్వంతంగా ఓ మ్యూజిక్ బిట్ చేయించడం మానేసి, తమ సరదా కోసం ఓ హాలీవుడ్ మ్యూజిక్ బిట్ ను…

కుర్రాళ్లకు అనుభవం తక్కువ. సరదాగానే కానీ ఆలోచన ఉండదు. 40కోట్లు ఖర్చు పెట్టే సినిమాకు.. స్వంతంగా ఓ మ్యూజిక్ బిట్ చేయించడం మానేసి, తమ సరదా కోసం ఓ హాలీవుడ్ మ్యూజిక్ బిట్ ను వాడుకోవడం హలో సినిమా కోసం అన్నపూర్ణ బ్యానర్ చేసిన తప్పు అని తెలుస్తోంది.

అన్నపూర్ణ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తున్న సినిమా హలో. టాప్ డైరెక్టర్ ల్లో ఒకరైన విక్రమ్ కుమార్ దీనికి దర్శకుడు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలయింది. సినిమాకు మాంచి బజ్ వచ్చింది. కానీ ఉన్నట్లుండి ఓ బ్యాడ్ ఇన్సిడెంట్. యూ ట్యూబ్ ఆ టీజర్ వీడియోను డిసేబుల్ చేసింది. కాపీ రైట్ సమస్య రావడంతో.

40కోట్ల సినిమాకు ఓ మ్యూజిక్ బిట్ కాపీ కొట్టడమా అనుకున్నారు అంతా. కానీ అసలు విషయం వేరు అని తెలిసింది. ఈ టీజర్ ను ముంబయ్ లో ఓ కంపెనీతో చేయించారు. అప్పుడే వాళ్లకి అఖిల్ ఓ సూచన చేశాడట. తనకు ఇష్టమైన ఆ మ్యూజిక్ బిట్ ను వాడమని ఆడిగాడాని తెలుస్తోంది. దాంతో ఆ కంపెనీ ఆ మ్యూజిక్ బిట్ రైట్స్ తీసుకుని, దాన్ని వాడింది. కథ ఆక్కడితో ముగియలేదు.

రైట్స్ తీసుకున్న సంగతి తెలియక ఎవరో యు ట్యూబ్ కి ఫిర్యాదు చేశారు. వాళ్ళు వీడియో డిలీట్ చేశారు. తరువాత రైట్స్ తీసుకున్న విషయం తెలిసి ఒకే చేశారు. కానీ ఈ లోగానే ఇంత డామేజ్. అఖిల్ మాటను నాగ్ ఎప్పుడు కాదనలేరు. అది అఖిల్ సినిమా అప్ప్పుడైనా.. ఇప్పుడైనా.