అమ‌ర‌శిల్పి… శేఖ‌ర్‌క‌మ్ముల‌

సినిమాని శిల్పంలా చెక్కడంలో శేఖ‌ర్ క‌మ్ముల సిద్దహ‌స్తుడు. ఆయ‌న‌కు మూడొస్తే సెట్ కి వెళ్తాడ‌ట‌. లేదంటే పేక‌ప్ చెప్పేస్తాడ‌ట‌. అనామిక సినిమా అలానే దీర్ఘకాలంగా చిత్రీక‌ర‌ణ సాగుతూనే ఉంది. ఇంకా రెండ్రోజుల షూటింగ్ మిగిలి…

సినిమాని శిల్పంలా చెక్కడంలో శేఖ‌ర్ క‌మ్ముల సిద్దహ‌స్తుడు. ఆయ‌న‌కు మూడొస్తే సెట్ కి వెళ్తాడ‌ట‌. లేదంటే పేక‌ప్ చెప్పేస్తాడ‌ట‌. అనామిక సినిమా అలానే దీర్ఘకాలంగా చిత్రీక‌ర‌ణ సాగుతూనే ఉంది. ఇంకా రెండ్రోజుల షూటింగ్ మిగిలి ఉంద‌ట‌. 

అదెప్పుడు పూర్తిచేస్తాడో మ‌రి. ముందు ద‌స‌రాకి వ‌స్తుంద‌నుకొన్నారు. దీపావ‌ళి కూడా వెళ్లిపోయింది. సంక్రాంతికి ఈ సినిమా బ‌య‌ట‌కు రావ‌డం క‌ష్టమే. మార్చి నెల‌లో విడుద‌ల చేస్తే చేసిన‌ట్టు! ఈలోగా అనామిక సినిమా ఒక‌టి తీస్తున్నార‌నే విష‌యం జ‌నం కూడా మ‌ర్చిపోతారు. 

సినిమాని సృజ‌నాత్మకంగా తీసే ఈ ద‌ర్శకుడు మార్కెట్ టెక్నిక్‌ని ఎప్పుడు వంట‌బ‌ట్టించుకొంటాడో..??  టీజ‌ర్‌, ఫ‌స్ట్ లుక్ అంటూ ఏదోలా హ‌డావుడి చేయ‌క‌పోతే చెల్లదిక్కడ‌. ఈ నిజం ఈ అమర‌శిల్పికి అర్థమైతే బాగుండును..!