ఆలు లేదు చూలు లేదు అన్నట్లు వుంది నాని-రాహుల్ కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించే సినిమా. దీని కన్నా ముందుగా టక్ జగదీష్ పూర్తి కావాలి. సితార దగ్గర పెండింగ్ లో వున్న సినిమాల సంగతి ముందు చూడాలి. ఆ తరువాతే ఈ నోరు తిరగని ''శ్యామ్ సింగ రాయ్ ' అనే పేరు తో తయారయ్యే సినిమా సంగతి.
అయితే తొందరపడి ముందే కూసే కోయిలలు, ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అని హడావుడి చేసాయి. కానీ ఏమయింది. అదికాదు అని తేలిపోయింది. ఇక ఆ తరువాత పేరు అనిరుధ్. ఎందుకంటే గతంలో జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలకు చేసాడు కనుక. నిజానికి జెర్సీ సినిమాకు చేయడం వెనుక వేరే రీజన్ వుంది. పాత బాకీలు చెల్లు కొట్టుకోవడం లాంటి వ్యవహారం వుంది.
కానీ సితార ఎంటర్ టైన్ మెంట్స్ జనాలు మాత్రం ఇంకా ఏదీ డిసైడ్ కాలేదు. అనిరుధ్ మీద అంత ఆసక్తి అయితే లేదు. థమన్ ఈ మధ్య మంచి ఫామ్ లో వున్నాడు. అందువల్ల థమన్ అయితేనే బెటర్ అనే ఆలోచనలో వున్నారు. పైగా సితార-హారిక హాసిని వెనుక బలమైన సలహాదారుగా వున్న త్రివిక్రమ్ మద్దతు కూడా థమన్ కే వుంది.
అందువల్ల థమన్ కే ఎక్కువ చాన్స్ వుండొచ్చు. మరీ హీరో నాని పట్టుపడితే తప్ప అనిరుధ్ మరోసారి సీన్లోకి రాకపోవచ్చు అన్నది సితార వర్గాల బోగట్టా.