ఓ ప్రముఖ హీరోయిన్ నటిస్తోన్న థ్రిల్లర్ సినిమా ఆడియో ఇటీవలే విడుదలైంది. ఆ సినిమాలో ప్రధాన పాత్రధారిగా నటిస్తున్నాడు ఓ కమెడియన్. బుల్లి తెర నుంచి వెండితెరకు ఎదిగిన ఆయనగారు, ‘ఈ సినిమా మమ్మల్ని సం.. నాకించేసింది..’ అంటూ నోరు జారేశాడు. పెద్ద పాత్ర కావడంతో వేరే సినిమాల్లో చిన్న పాత్రలు చేయడం వేస్ట్.. అని ఆలోచించుకున్నాడో ఏమో.. ఆయన ఉద్దేశ్యం ఏదైనాగానీ, ఆడియో ఫంక్షన్‌లో అలాంటి మాటలు అతని స్థాయిని తగ్గించేసింది.
సినిమాల్లో కమెడియన్లు నోటికి ఎలాంటి మాటలొస్తే అలా మాట్లాడేయడం కొన్నిసార్లు సెన్సార్ వాటికి కత్తెరవేయడం సహజమే. మరీ ఆడియో ఫంక్షన్లలో ఈ తరహా మాటలు ఏమంత సభ్యత అన్పించుకోవన్న విషయం నటీనటులు గుర్తెరిగితే మంచిది. బోల్డంత ఫ్యూచర్ వుంది.. కాస్త నోటిని అదుపులో పెట్టుకుంటే మంచిది.. అని ఆయనగారికి ఆడియో ఫంక్షన్ తర్వాత కొందరు సినీ పెద్దలు సూచించారట.
ఇంతకీ అతనెవరంటారా.? చాలా సినిమాల్లో కమెడియన్‌గా రాణించాడు. స్పీడ్ స్పీడ్‌గా డైలాగ్స్ చెప్పడంలో తనకు తానే సాటి. డిగ్నిటీ మెయిన్‌టెయిన్ చేస్తే.. సినీ పరిశ్రమలో మరింత ఎదిగే అవకాశం వున్న ఆ యువ నటుడు, ఆ దిశగా అడుగులేస్తాడనే ఆశిద్దాం.