పూరీ కేరాఫ్ కొత్త ఆఫీసు

జీవితాన్ని వైవిధ్యంగా, సంపూర్ణంగా అనుభవించే సినిమా జనాల జాబితాలో పూరి జగన్నాధ్ ముందుంటాడు. రేపు సంగతి సరే, ఈ రోజు ఏమిటన్నది అతగాడి ఆలోచనగా కనిపిస్తుంది,. గతంలొ మాంచి ఆపీసును అతగాడు ఏర్పాటు చేసుకున్నాడు.…

జీవితాన్ని వైవిధ్యంగా, సంపూర్ణంగా అనుభవించే సినిమా జనాల జాబితాలో పూరి జగన్నాధ్ ముందుంటాడు. రేపు సంగతి సరే, ఈ రోజు ఏమిటన్నది అతగాడి ఆలోచనగా కనిపిస్తుంది,. గతంలొ మాంచి ఆపీసును అతగాడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఆర్థికంగా దెబ్బతిని అన్నీ పోగొట్టుకున్నానని ఆయనే చెప్పాడు. 

సరే అదంతా గతం. ఇప్పుడు మళ్లీ పూరి ఎ క్లాస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడట. అద్భుతంగా తయారైన ఆ కార్యాలయాన్ని  తన సన్నహితుల సమక్షంలో ప్రారంభించుకున్నాడట కూడా. చాలా విలువైన ఇంటీరియర్, తన కోసం ఓ ప్రత్యేకమైన కేబిన్ ఈ ఆపీసులో వున్నాయట. ఎంతయినా పూరి టేస్ట్ సూపర్.