మలయాళంలో ఘన విజయం సాధించిన బెంగళూర్ డేస్‌ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ముందు సిద్దార్థ్ – సమంత పేర్లు అనుకొన్నారు. ఆ తరవాత వాళ్లిద్దరూ డ్రాప్ అవ్వడంతో కథానాయికగా శ్రీదివ్యని తీసుకొన్నారు. ఈ సినిమాకి ఇద్దరు హీరోలు కావాలి. అందులో ఓ పాత్ర కోసం వరుణ్‌తేజ్‌ని ఎంపిక చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని ఒకేసారి రీమేక్ చేస్తారు. తమిళ వెర్షన్లో రానా, ఆర్యలు నటిస్తారని సమాచారమ్. వరుణ్ తేజ్ ఎంపిక ఖాయమైనా.. ఈ కథకు మరో హీరో కావాలి. అంటే.. దాదాపుగా ఈ సినిమా మల్టీస్టారర్ అన్నమాట. మరి.. రెండో హీరోగా ఎవరు కనిపిస్తారన్నది త్వరలో తేలనుంది.