మెగా సినిమాలో మ‌ధుబాల‌??

అంతకు ముందు ఆ త‌ర‌వాత సినిమాతో అమ్మ పాత్రల వైపు ట‌ర్న్ ఇచ్చుకొంది.. రోజా మ‌ధుబాల‌. నిఖిల్ సినిమా సూర్య వ‌ర్సెస్ సూర్యలోనూ త‌ల్లి పాత్ర పోషిస్తోంది మ‌దుబాల‌. ఇప్పుడు ఓ మెగా ఆఫ‌ర్…

అంతకు ముందు ఆ త‌ర‌వాత సినిమాతో అమ్మ పాత్రల వైపు ట‌ర్న్ ఇచ్చుకొంది.. రోజా మ‌ధుబాల‌. నిఖిల్ సినిమా సూర్య వ‌ర్సెస్ సూర్యలోనూ త‌ల్లి పాత్ర పోషిస్తోంది మ‌దుబాల‌. ఇప్పుడు ఓ మెగా ఆఫ‌ర్ ద‌క్కిన‌ట్టు స‌మాచార‌మ్‌. 

రామ్‌చ‌ర‌ణ్ – శ్రీ‌నువైట్ల క‌ల‌యిక‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ర‌కుల్ ప్రీత్‌సింగ్‌ని క‌థానాయిక‌గా ఎంచుకొన్నారు. ఈ చిత్రానికి మై నేమ్ ఈజ్ రాజు అనే పేరు ప‌రిశీలిస్తున్నారు. ఈ చిత్రంలో చ‌ర‌ణ్ త‌ల్లి పాత్రకూ ప్రాధాన్యం ఉంది. ఆ పాత్ర కోస న‌దియా, ర‌మ్యకృష్ణ పేర్లు ప‌రిశీలించారు. ఇప్పుడు మ‌ధుబాల అయితే బాగుంటుంద‌ని అనుకొంటున్నార‌ట‌. 

ఒక ద‌శ‌లో జీవిత రాజ‌శేఖ‌ర్  పేరూ.. చ‌ర్చకు వ‌చ్చింద‌ని, అయితే చివ‌ర‌కు మ‌ధుబాల వైపే చిత్రబృందం మొగ్గు చూపింద‌ని స‌మాచార‌మ్‌. త్వర‌లోనే ఈ విష‌య‌మై ఓ అధికారిక ప్రక‌ట‌న విడుద‌ల కావ‌చ్చు.