నమ్మకాలు, విశ్వాసాలు చాలా మందికి వుంటాయి. అలాంటి వారిలో హీరో బాలయ్య కూడా ఒకరు. ఆయన గంటల తరబడి పూజలు చేస్తారు. జాతకాలు, ముహుర్తాలు, నమ్మకాలు ఇలా చాలా వున్నాయి.
ఇలాంటి వ్యవహారం ఒకటి ఈ మధ్య జరిగిందని తెలుస్తోంది. ఆ మధ్య మైత్రీ నవీన్, దర్శకుడు గోపీచంద్ మలినేని కలిసి బాలయ్య దగ్గరకు వెళ్లాలనుకున్నారు. ఈ విషయమై బాలయ్యకు ఫోన్ చేసారట.
'ఫలానా గంటలకు, ఫలానా నిమిషాలకు మీ ఇంట్లోంచి బయలు దేరండి' అని చెప్పారట బాలయ్య. ఆయనతో వ్యవహారం అలాగే వుంటుంది. ఏదైనా సరే, పక్కాగా ముహుర్తం వుండాల్సిందే.
గమ్మత్తేమిటంటే ఇప్పుడు ఈ తరహా నమ్మకం దర్శకుడు బోయపాటికి కూడా ఎక్కువైందని తెలుస్తోంది. నిత్యం ఆయన ఇంటి నుంచి బయటకు రావడానికి మాంచి టైమ్ చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ ఆ శుభసమయం మరీ ఉదయాన్నే వుంటే ఆ టైమ్ కే బయటకు వచ్చి, అటు ఇటు కార్లో తిరిగి, ఆ తరువాత తన పని టైమ్ కు తాను అటెండ్ అవుతున్నారని కూడా తెలుస్తోంది.
మొత్తం మీద టాలీవుడ్ లో ప్రతి క్షణం ముహుర్తాలు, శుభ సమయాలు చూసుకునే వారి సంఖ్య పెరుగుతోందన్నమాట.