Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బాలయ్యకు ఓ మాట చెప్పాలి

బాలయ్యకు ఓ మాట చెప్పాలి

ప్రస్తుతం బోయపాటి నోట వినిపిస్తున్న మాట ఇది. బోయపాటితో సినిమా చేయాలని ఓ పెద్ద నిర్మాత ప్రయత్నిస్తున్నారు. మాంచి పాపులర్ హీరోతో కాంబినేషన్. కానీ బోయపాటి మాత్రం ఇంకా ఊ అనడం లేదు. కారణం ఒక్కటే, బాలయ్య బంధం నుంచి స్మూత్ గా ఎలా బయటకు రావాలన్నది. బాలకృష్ణతో సినిమా చేయాలని బోయపాటికి బలంగా వుంది. చిన్న చిన్న అపోహలు, అడ్డంకులు వున్నా, అవన్నీ వుండవని నమ్మకమూ వుంది.

కానీ బాలయ్య వేరే సినిమా ఓకె చేసేసారు. అది ఇంకా మొదలుకావాల్సి వుంది. బాలయ్య చూస్తే గుళ్లూ గోపురాలు తెగ తిరిగేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు రావాలి. ఆ వ్యవహారాలన్నీ సద్దుమణగాలి అప్పుడు కానీ ఆ సినిమా మొదలుకావాలి. ఈలోగా బోయపాటికి ఓ సినిమా బయట చేసుకుని రావాలని వుంది. ఎందుకంటే ఎంతకాదన్నా పదికోట్ల రూపాయలు. చిన్న, చితకమొత్తం కాదు పారితోషికం.

కానీ బాలయ్యకు కాస్త స్మూత్ గా విషయం విన్నవించి రావాలి. పైగా బాలయ్య బావ చంద్రబాబుతో బోయపాటి మంచి సంబంధాలు వున్నాయి. ఇక్కడ, అక్కడ అన్నీ అలా వుండాలి. ఏవీ తెగిపోకూడదు. అందుకే బాలయ్య ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు వెళ్లి, విన్నవించుకుని, అప్పుడు బయట సినిమాకు రావాలన్నది ప్లాన్. అంతవరకు ఆ నిర్మాత వెయిటింగ్. బోయపాటి కూడా.

సెక్స్ కు మనిషిని దూరం చేస్తున్న ఇంటర్నెట్!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?