బాలయ్య, నాగ్.. ఇద్దరికీ పునర్జన్మలపై కాన్ఫిడెన్స్!

టాలీవుడ్ లోని ఇద్దరు టాప్ హీరోలు.. ఒక ఆసక్తికరమైన విషయంలో ఏకీభవించారు. ఊహలకు అందని.. సైన్సుకు అంతుబట్టని విషయం గురించి వారు ఏకీభవించారు. వాళ్లిద్దరూ కూడా పునర్జన్మ మీద నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తమ…

టాలీవుడ్ లోని ఇద్దరు టాప్ హీరోలు.. ఒక ఆసక్తికరమైన విషయంలో ఏకీభవించారు. ఊహలకు అందని.. సైన్సుకు అంతుబట్టని విషయం గురించి వారు ఏకీభవించారు. వాళ్లిద్దరూ కూడా పునర్జన్మ మీద నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తమ సినిమాల ప్రచార కార్యక్రమాల్లో వీళ్లు ఈ స్ట్రేంజ్ ఫీలింగ్ ను వ్యక్త పరిచారు. హీరోలుగా ఉన్నత శిఖరాలను చూసి.. సెలబ్రిటీలుగా..స్టార్లుగా వెలుగొందుతున్న వీళ్లు మళ్లీ జన్మ గురించి ఆసక్తికరమైన అభిప్రాయాలను వ్యక్తం చేయడం విశేషం. 

నందమూరి నటసింహం బాలకృష్ణ అయితే.. తనకు మళ్లీ జన్మ ఉందని నమ్ముతున్నానని చెప్పాడు. తను వచ్చే జన్మలో కూడా తెలుగు వాడిగానే పుడతానని కూడా బాలయ్య అభిప్రాయపడటం విశేషం. రోజూ గంటన్నర పాటు తప్పకుండా పూజ చేస్తానని చెప్పిన బాలయ్య.. ఆధ్యాత్మిక విషయాల గురించి స్పందించాడు.

ఇదే సందర్భంలో బాలయ్య పునర్జన్మ మీద విశ్వాసం వ్యక్తం చేశాడు. ఈ జన్మానంతరం తను మళ్లీ జన్మనెత్తుతానని అన్నాడు. ఇక పలు ఆధాత్మిక భక్తిరస మైథాలాజికల్ మూవీస్ లో నటించి తన తాజా సినిమాలో కూడా ఆత్మ పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగ్ స్పందిస్తూ.. తను కూడా భక్తుడినేని అన్నాడు. అలాగే పునర్జన్మ మీద కూడా నమ్మకం ఉందని నాగ్ వ్యాఖ్యానించాడు. 

బాలయ్య లాగా తను ఎప్పుడు జన్మిస్తాను.. ఎలా జన్మిస్తాను.. అనే విషయాల గురించి నాగ్ చెప్పలేదు కానీ.. పునర్జన్మ మీద మాత్రం నమ్మకం ఉందని స్పష్టం చేశాడు. మరి తెలుగులో స్టార్ హీరోలుగా ఉన్న వీళ్లకు చాలా స్ట్రేంజ్ బిలీవే ఉన్నట్టుంది!