Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బాలయ్యతో ఫైట్‌: బాబు 'ఆయాసం' చల్లారిందా?

బాలయ్యతో ఫైట్‌: బాబు 'ఆయాసం' చల్లారిందా?

'కథ కంచికి, మనం ఇంటికి..' అన్నట్టుగానే చివరి వీడియోలో (ఇప్పటికి ఇదే చివరిది అనుకోవాలేమో), నాగబాబు మాట్లాడి, బాలయ్యకు ఓ చిన్న వార్నింగ్‌ కూడా ఇచ్చేశారు. చిన్న వార్నింగ్‌ కాదది, చాలా పెద్ద వార్నింగ్‌. 'మీ నాన్న నీకు గొప్పయితే, మా అన్నయ్య నాకు గొప్ప.. రిక్షావోడు కూడా తన తండ్రిని గొప్పగానే భావిస్తాడు..' అంటూ, బాలయ్యకు చాలా గట్టిగా కౌంటర్‌ ఇచ్చారు నాగబాబు. గత కొద్ది రోజులుగా బాలయ్య మీద సోషల్‌ మీడియా వేదికగా ఫైట్‌ చేస్తోన్న నాగబాబు, 'ఇకపై ఆపేస్తున్నాను..' అంటూ చివరి వీడియోలో చెప్పాలనుకున్నదంతా చెప్పేశారు.

అయితే, ఇక్కడితో ఆపేస్తున్నానంటూనే, 'ఒకవేళ నువ్వు మళ్ళీ కెలికితే, దానికి సమాధానం ఖచ్చితంగా వస్తుంది..' అంటూ ముక్తాయింపు కూడా ఇచ్చారండోయ్‌ నాగబాబు. అంటే, కథ ఇక్కడితో ఆగిపోలేదన్నమాట. ఈ యుద్ధానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టాల్సింది బాలయ్యేనంటూ నాగబాబు క్లారిటీ ఇచ్చారన్నమాట. ఆవేశపడ్డారు.. ఆవేశపడ్డారు.. చివరికి ఏం మిగిలింది, ఆయాసం తప్ప.!

'సినీ పరిశ్రమలో అందరం కలిసేవుంటాం, వుండాలనుకుంటాం. అభిమానులెవరూ ఆవేశకావేశాలకు లోనుకావొద్దు. అందరూ అందరి సినిమాలూ చూడాలి.. మీ తల్లిదండ్రులు మీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. మీ లక్ష్యాలు మీకు వుండాలి.. అవి ముఖ్యం..' అని అభిమానులకీ నాగబాబు 'పెద్దరికంతో' కూడిన క్లాస్‌ తీసుకోవడం గమనార్హమిక్కడ.

ఓ సెలబ్రిటీ సోషల్‌ మీడియాలో ఆవేశపెడితే, ఆ ప్రభావం ఎలా వుంటుందో నాగబాబుకి తెలియకుండా ఎలా వుంటుంది.? నాగబాబు, బాలయ్యకు ఇచ్చిన కౌంటర్స్‌తో.. మెగా అభిమానులు రెచ్చిపోయారు, బాలయ్య అభిమానులు అంతకు డబుల్‌ రెచ్చిపోయారు. వెరసి, బూతులు తిట్టుకున్నారు ఇరువురు అభిమానులు.

ఇప్పుడేమో, అలా కొట్టుకోవద్దంటూ నాగబాబు, అభిమానులకు ఉచిత సలహా ఇవ్వడం కామెడీ కాకపోతే మరేమిటి.? 'ఇంట్లో దొంగతనం చేసిన వ్యక్తి, తప్పించుకుని పారిపోతే.. సంవత్సరం తర్వాత అయినా దొరికితే ఊరుకుంటామా.? అలాగే, మమ్మల్ని తిట్టినోళ్ళని టైమ్‌ చూసుకుని వాయించేస్తాం.. స్పందించడానికి ఇంత టైమ్‌ ఎందుకని ప్రశ్నించేవారికి ఇదే నా సమాధానం..' అంటూ నాగబాబు ఏదో లాజిక్‌ చెప్పబోయారుగానీ, అది ఎవరికీ అర్థం కాకుండా పోయింది.

పవన్‌నీ, చిరంజీవినీ 'బ్రీడ్‌ అండ్‌ బ్లడ్‌ - జాతి' అంటూ తిట్టిన బాలయ్య ఎక్కడికీ పారిపోలేదు, నాగబాబు దొరకపుచ్చుకుని ఇప్పుడు తిట్టడానికి. ఏదిఏమైనా, నాగబాబు 'ఆయాసం' తీర్చుకున్నారు. ఇక్కడితో ఈ కథకి తాత్కాలిక ముగింపు అయితే పడిందని అనుకోవచ్చు. ఏమో, మళ్ళీ నాగబాబుకి ఆవేశం.. అదేనండీ ఆయాసం వస్తే, మళ్ళీ యుద్ధం మొదలవుతుందన్నమాట.

అనుభవంలేని క్రిష్‌, సాయిమాధవ్‌... ప్రకాష్‌రాజ్‌, మురళిశర్మలతో పోటీపడ్డారా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?