డిజె తరువాత వక్కంతం వంశీ డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకుని వున్నాడు బన్నీ. ఆ తరువాత సినిమా కోసం వెయిటింగ్ లో వున్నాడు లింగుస్వామి. అయితే ప్రస్తుతం అఖిల్ తో సినిమా చేస్తున్న విక్రమ్ కుమార్ తో కూడా సినిమా చేసే ఐడియాతో వున్నాడు బన్నీ. లింగుస్వామి సినిమా సంగతి ఎలా వున్నా, విక్రమ్ కుమార్ తో చేయబోయే సినిమా కాస్త భారీగా వుండాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
విక్రమ్ కుమార్ కు ఇటు తమిళ,తెలుగు భాషలతో పాటు ఓవర్ సీస్ లో కూడా మాంచి ఫాలోయింగ్ వుంది. అలాగే హిందీ జనాలకు కూడా విక్రమ్ కుమార్ పేరు పరిచయమే. ఇక బన్నీకి మళయాలంలో వున్న మార్కెట్ తెలిసిందే. అందువల్ల విక్రమ్ కుమార్ తో కనుక మాంచి అన్ని లాంగ్వేజ్ లకు అప్పీల్ వున్న సబ్జెక్ట్ సెట్ అయితే నూరు నుంచి నూట పాతిక కోట్ల బిజినెస్ గ్యారంటీగా వుంటుంది. అయితే అదే కనుక మరీ హెవీ సబ్జెక్ట్ కుదిరితే ఇంకా పెరుగుతుంది. అందుకే అలాంటి సబ్జెక్ట్ సెట్ చేయమని విక్రమ్ కుమార్ కు సూచనలు వెళ్లినట్లు తెలుస్తోంది.