చరణ్‌కి కథ నచ్చలేదట

దశరధ్  దర్శకత్వంలో రామ్‌చరణ్‌ ఓ సినిమా చేయబోతున్నాడా…?  గత కొన్ని రోజులులుగా ఫిల్మ్‌నగర్‌ లోచక్కర్లు కొడుతున్న వార్త ఇది. చరణ్‌తో సినిమా చేయాలని దశరధ్ ఓ కథ రాసుకొన్న విషయం. దాన్ని చరణ్‌ చెప్పిన…

దశరధ్  దర్శకత్వంలో రామ్‌చరణ్‌ ఓ సినిమా చేయబోతున్నాడా…?  గత కొన్ని రోజులులుగా ఫిల్మ్‌నగర్‌ లోచక్కర్లు కొడుతున్న వార్త ఇది. చరణ్‌తో సినిమా చేయాలని దశరధ్ ఓ కథ రాసుకొన్న విషయం. దాన్ని చరణ్‌ చెప్పిన విషయమూ.. కరెక్టే. 

అయితే దశరధ్ చెప్పిన కథ చరణ్‌కి నచ్చలేదని సమాచారమ్‌. ఫస్టాఫ్‌ బాగున్నా.. సెకండాప్‌ తేలిపోయిందట. దశరధ్ కి తన సినిమాల్లో సెంటిమెంట్‌ దట్టంగా గుప్పించడం అలవాటు. అది ఎక్కువైనట్టు అనిపించే.. చరణ్‌ కొన్ని మార్పులు సూచించడాట. ఇప్పుడు ఆ స్క్రిప్టుకి రిపేర్లు చేసుకొనే పనిలో పడ్డాడు దశరధ్‌.

అయినా చరణ్‌ని హ్యాండిల్‌ చేసే దమ్ము దశరధ్కి ఉందా?  అనేది మెగా ఫ్యాన్స్‌ భయం. అదీ నిజమే. గ్రీకువీరుడుతో దశరధ్ పనితనం మరోసారి తెలిసింది. మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ హిట్టే.. కానీ ఆ సినిమాకి దిల్‌ రాజు అండ్‌ కో… ఎన్ని అతుకులు వేశారో.. ఆ చిత్రబృందానికి తెలుసు. మరి ఇప్పుడైనా దశరధ్ పంథా మారుస్తాడా..?  పకడ్బందీ స్క్రిప్టుతో చరణ్‌ ఒప్పిస్తాడా..?  చూడాలి మరి.