‘వన్‌’కీ లీకుల గొడవ

అత్తారింటికి దారేది లీకుల గోల ఇంకా మర్చిపోలేదు. అది ఇప్పుడు మహేష్‌ బాబు సినిమా '1' కీ  చుట్టుకొంది. ఈ సినిమా వీడియో లీకవ్వలేదు గానీ.. స్టిల్స్‌ బయటకు వచ్చేశాయ్‌. వన్‌ సినిమాలోని స్టిల్స్‌…

అత్తారింటికి దారేది లీకుల గోల ఇంకా మర్చిపోలేదు. అది ఇప్పుడు మహేష్‌ బాబు సినిమా '1' కీ  చుట్టుకొంది. ఈ సినిమా వీడియో లీకవ్వలేదు గానీ.. స్టిల్స్‌ బయటకు వచ్చేశాయ్‌. వన్‌ సినిమాలోని స్టిల్స్‌ మంగళవారం నెట్లో సందడి చేశాయి. ప్రింట్‌ మీడియాకీ ఎక్కేసింది. ఇవి చూసి చిత్ర బృందం షాక్‌ తింది. 

ఎందుకంటే ఈ స్టిల్స్‌ అధికారికంగా విడుదల చేయలేదట. అసలు బయటకు ఎవరు ఇచ్చారో వాళ్లకే అర్థం కావడం లేదు. నాలుగు స్టిల్సే కదా.. అని చిత్రబృందం లైట్‌గా తీసుకోలేదు. వెంటనే సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈరోజు నాలుగు స్టిల్సే కావచ్చు, రేపు వీడియో బయటకు వస్తే పరిస్థితి ఏమిటి??  అనేది వాళ్ల భయం. 

వన్‌ విషయంలో మరింత కట్టు దిట్టంగా వ్యవహరించాలని 14 రీల్స్‌ సంస్థ గట్టి నిర్ణయం తీసుకొంది. మరి ఈ ఫొటోల్ని లీక్‌ చేసింది ఎవరబ్బా..?  ఎవరైతేనేం..??  మహేష్‌ ఫ్యాన్స్‌కి వన్‌ గెటప్‌ ఏమిటో తెలిసిపోయింది.