చిరు సినిమాకి బ్యాన‌ర్లు క‌ట్టాడ‌ట‌

చిరంజీవి 150వ సినిమా ద‌ర్శకుల లిస్టులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు కూడా చేరిపోయింది. టెంప‌ర్ ఈ రేంజులో ఆడ‌క‌పోతే.. పూరి పేరు డౌటుగా ఉండేదేమో. కానీ… హిట్టు ప‌డింది కదా. దాంతో ఆయ‌న‌కూ ఆ…

చిరంజీవి 150వ సినిమా ద‌ర్శకుల లిస్టులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు కూడా చేరిపోయింది. టెంప‌ర్ ఈ రేంజులో ఆడ‌క‌పోతే.. పూరి పేరు డౌటుగా ఉండేదేమో. కానీ… హిట్టు ప‌డింది కదా. దాంతో ఆయ‌న‌కూ ఆ ఛాన్స్‌ద‌క్కే అవ‌కాశాలు పుష్కలంగా ఉన్నాయి. దానికి తోడు రాంగోపాల్ వర్మలాంటి మేధావి సైతం చిరు 150వ సినిమాకి పూరిని మించిన డైరెక్టర్ దొర‌క‌డు అంటూ ఓ భారీ స్టేట్‌మెంట్ ఇచ్చారు. 

ఇదంతా సరే.. అస‌లు పూరి మ‌న‌సులో ఏముంది?  చిరు నిజంగా పిలిస్తే ఆయ‌న ఎలాంటి క‌థ చెప్తారు..??  ఈ విష‌యాల‌పై పూరి స్పందించాడు. ''నాకు చిన్నప్పటి నుంచీ చిరంజీవి సినిమాలంటే చాలా ఇష్టం. ఆయ‌న సినిమాల‌కు బ్యాన‌ర్లు క‌ట్టేవాడ్ని. ఆయ‌న పిలిస్తే గ‌నుక ఓ మంచి మాస్ మ‌సాలా క‌థ చెప్తా..'' అంటున్నాడు పూరి.​ కావాలంటే, సోషల్ మెసేజ్ వున్న కథ కూడా చెప్పగలడు..టెంపర్ లో చేసింది అదేగా. మ‌రి చివ‌రికి ఏం జ‌రుగుతుందో చూడాలి.