దానయ్య పట్టేసాడు

మొత్తానికి డివివి దానయ్య తమిళ సూపర్ హిట్..తని ఒరువన్ తెలుగు హక్కులను పట్టేసారు. ఆయన మాంచి ఫ్యాన్సీ రేటుకు ఈ సినిమా హక్కులు సంపాదించారని వినికిడి. ఈ సినిమాను రామ్ చరణ్ తో రీమేక్…

మొత్తానికి డివివి దానయ్య తమిళ సూపర్ హిట్..తని ఒరువన్ తెలుగు హక్కులను పట్టేసారు. ఆయన మాంచి ఫ్యాన్సీ రేటుకు ఈ సినిమా హక్కులు సంపాదించారని వినికిడి. ఈ సినిమాను రామ్ చరణ్ తో రీమేక్ చేస్తారు. రామ్ చరణ్..డివివి కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కుతుందని గ్రేట్ ఆంధ్ర ముందే వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే సినిమాకు దర్శకుడు ఎవరన్నది ఇంకా తెలియలేదు.

ఎడిటర్ మోహన్ కుమారుడు, హీరో జయం రవి సోదరుడు రాజానే తని ఒరువన్ సినిమాకు దర్శకత్వం వహించారు. మరి అతనే తెలుగు వెర్షన్ ను కూడా డీల్ చేసే అవకాశమే ఎక్కువగా వుంది. ఇదిలా వుంటే, తమిళ మాతృకలో విలన్ గా నటించి, మాంచి మార్కులు కొట్టేసిన అరవింద్ స్వామి తెలుగులో కూడా అదే పాత్ర చేస్తారు.

అన్నీ బాగానేవున్నాయి. కానీ ట్విస్ట్ ఏమిటంటే, పాపం, కిక్ 2లాంటి  అట్టర్ డిజాస్టర్ సినిమాను అందించడానికి మూల కారణమైన దర్శకుడు సురేందర్ రెడ్టి కి రామ్ చరణ్ సినిమా వుంటుంది అని ఆశ వుండేది. ఇప్పుడు చెర్రీ ఈ సినిమా ఓకె చేయడంతో ఆ ఆసలు లేదా అన్న అనుమానం. కానీ ఎలాగూ రీమేక్, మాట కూడా ఇచ్చాం కదా అని చెర్రీ ఈ సినిమా అవకాశం సురేందర్ రెడ్డికే ఇవ్వాలనుకుంటున్నాడట. కానీ ఒరిజినల్ డైరక్టర్ రాజా తనకే కావాలని పట్టుదలగా వున్నాడట..