ఈసారి వెంకీకి..రవితేజ జోడీ

సోలో సినిమా సో బెటర్ అనడం మానేసాడు వెంకీ. సరైన సినిమా దొరికితే అలా..లేకుంటే ఇలా అని రెండు పడవల మీద జోరుగా వెళ్లిపోతున్నాడు. ఇప్పుడు మళ్లీ మరో మల్టీస్టారర్ చేయడానికి మాంచి సబ్జెక్ట్…

సోలో సినిమా సో బెటర్ అనడం మానేసాడు వెంకీ. సరైన సినిమా దొరికితే అలా..లేకుంటే ఇలా అని రెండు పడవల మీద జోరుగా వెళ్లిపోతున్నాడు. ఇప్పుడు మళ్లీ మరో మల్టీస్టారర్ చేయడానికి మాంచి సబ్జెక్ట్ దొరికింట. 

తమిళనాట హిట్ అయిన జిల్లా హక్కులు సురేష్ మూవీస్ తీసుకుంది. ఈ సినిమాను తమిళనాట ఆర్ బి చౌదరి నిర్మించారు. ఆయనకు సురేష్ మూవీస్ తో మంచి సంబంధాలున్నాయి. మోహన్ లాల్, విజయ్ నటించిన ఈ సినిమా గత ఏడాది జనవరిలో విడుదలై మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. 

ఈ సినిమాను ఇప్పుడు కాస్త లోకల్ ఫ్లేవర్ జోడించి, రవితేజతో కలిసి చేయాలని వెంకీ ఆలోచిస్తున్నాడట. రవితేజ ఓకె అంటే మళ్లీ మరో మల్టీస్టారర్ అన్నమాట.