గోపాల గోపాల సినిమా వచ్చింది..నలభై కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. వెంకీకి, పవన్ కు ఇద్దరికీ సంతృప్తిని మిగిల్చింది..నిర్మాతలు సురేష్, శరద్ మురార్ ఇద్దరికీ లాభాలు తెచ్చిపెట్టింది. అయితే మల్టీస్టారర్ లు అంటే చాలు భారీ ఖర్చులు కనిపిస్తాయి. ఈ సినిమా కూడా ఇంకెవరు తీసినా కనీసం ముఫై కోట్ల ఖర్చు కనిపించేది.
వెంకీకి అయిదు కోట్లు, పవన్ కు పది పన్నెండుకోట్లు, భారీ నిర్మాణం అంతా కలసి కనీసం ముఫై కోట్లకు డేకేసేది ఖర్చు. అయితే తెలివైన నిర్మాత సురేష్ ఈ సినిమాను పదికోట్ల లోపు ఖర్చుతోనే తీసేసారని వినికిడి. పవన్, వెంకీ ఇద్దరికీ నిర్మాణంలో భాగస్వామ్యం కల్పించి, మేజర్ ఖర్చును పక్కన పెట్టారు.
తొంభై అయిదు శాతం సినిమాను స్టూడియోలో సెట్ లు వేసి కానిచ్చేసారు. దాంతో సినిమాఖర్చు పది కోట్ల లోపులోనే ముగిసిందట. లాభాలు వచ్చాయి కాబట్టి, ఖర్చులు పోను నలుగురూ పంచుకున్నా, మంచి బేరమే అయింది అందరికీ. ప్లానింగ్ వుంటే ఇలానే జరుగుతుంది.