మధురిమ అలా ఫిక్సయిపోయింది

వంశీ సినిమాలో అల్లరినరేష్ తో జతకట్టి, హీరోయిన్ గా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంది మధురిమ. కానీ ఫలితం లేకపోయింది. అనుకోకుండా దర్శకుడు మారుతి ఐటమ్ గర్ల్ గా మార్చాడు మధురిమను.  Advertisement కొత్త జంటలో…

వంశీ సినిమాలో అల్లరినరేష్ తో జతకట్టి, హీరోయిన్ గా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంది మధురిమ. కానీ ఫలితం లేకపోయింది. అనుకోకుండా దర్శకుడు మారుతి ఐటమ్ గర్ల్ గా మార్చాడు మధురిమను

కొత్త జంటలో అటు అమలాపురం అంటూ చేసిన పాటకు మాంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తరువాత ఎన్టీఆర్ టెంపర్ లో ఓ పాత్ర వచ్చింది. సరే అని ఓకె అంది. ఇప్పుడు నాగచైతన్య-సుధీర్ వర్మ కాంబినేషన్ లోని సినిమాలో కూడా ఓ అయిటమ్ సాంగ్ కు ఓకె అనేసిందట. 

సినిమా టాకీ అంతా అయిపోయాక, ఐటమ్ సాంగ్ వుంటే బాగుంటుందని యూనిట్ ఫీల్ కావడంతో, మధురిమకు చాన్స్ దొరికేసింది. ఈ పాట కూడా క్లిక్ అయి, టెంపర్ పాత్ర ఓకె అనిపిస్తే, ఇంక మధురిమ ఇలా ఫిక్సయిపోవచ్చు.