రెండు సినిమాలతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చేసాడు వెంకటేష్. దృశ్యం,గోపాల గోపాల సినిమాల విజయం వెంకీకి సరైన దారిని చూపించాయి. అందుకే డిఫరెంట్ మూవీ ల వైపు చూస్తున్నాడు. అందులో భాగంగా ఓ తమిళ డైరక్టర్ తో సినిమా చేయబోతున్నట్లు వినికిడి.
తమిళ నాట ఇటు హీరోగా, అటు డైరక్టర్ గా వున్న విజయ్ ఆంథోనీ చెప్పిన లైన్ కు ఓకె అన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు టైటిల్ కూడా రిజిస్టర్ చేసి వుంచినట్లు తెలుస్తోంది. సల్మాన్ అనే టైటిల్ సరిగ్గా ఆ లైన్ కు సూట్ అవుతుదని డిసైడ్ అయినట్లు వినవస్తోంది.
సురేష్ సంస్థ నిర్మించే ఈ సినిమాను విజయ్ ఆంథోని కేవలం డైరక్ట్ చేస్తాడా? లేక తమిళంలో తాను, తెలుగులో వెంకీ అంటూ రెండు భాషల్లో రూపొందిస్తాడా? అన్నది ఇంకా తెలియాల్సి వుంది.