హవ్వ.. ఓటీటీ డీల్ కోసం మేకోవర్!

సినిమా కోసం సదరు హీరో మేకోవర్ అవ్వలేదు. ఓటీటీ డీల్ కోసం మేకోవర్ అయ్యాడన్నమాట.

టాలీవుడ్ మెల్లమెల్లగా ఓటీటీ చేతుల్లోకి వెళ్లిపోతోందనేది బహిరంగ రహస్యం. ఓటీటీ జనాలు చెప్పిన తేదీలకు అనుగుణంగా రిలీజ్ డేట్స్ ప్రకటించే పరిస్థితికి దిగజారారు నిర్మాతలు. అదేంటని అడిగితే, ఎక్కువ డబ్బులు అట్నుంచి వస్తున్నప్పుడు, వాళ్ల మాట వినాలి కదా అంటున్నారు. ఇప్పుడీ పరిస్థితి ఎంతవరకు వెళ్లిందంటే, ఓ సినిమా ఓటీటీ డీల్ కోసం హీరోతో మేకోవర్ చేయించారు నిర్మాతలు.

పెద్ద కుటుంబం నుంచి వచ్చాడు. కానీ చెప్పుకోడానికి ఒక్క సక్సెస్ లేదు. అతడి గత చిత్రమైతే డిజాస్టర్ కా బాప్ అనిపించుకుంది. థియేటర్ల నుంచి జనం బయటకు పరుగులుపెట్టారు.

ఇలాంటి హీరోతో ఓ భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేసింది ఓ పెద్ద బ్యానర్. అసలు ఈ మేటర్ బయటకొచ్చినప్పుడు అంతా అవాక్కయ్యారు. వీళ్లకేమైనా పిచ్చి పట్టిందా అంటూ కథనాలు కూడా ఇచ్చారు. అయితే ఆ బ్యానర్ లెక్కలు వాళ్లకున్నాయి. పైగా భారీ ఎదురుదెబ్బలు, అట్టర్ ప్లాపులు ఆ నిర్మాతలకు కొత్త కాదు.

అయితే ఈ ప్రాజెక్టుపై మాత్రం వాళ్లు ఆచితూచి అడుగులేస్తున్నారు. సినిమా సెట్స్ పైకి రాకముందే నాన్-థియేట్రికల్ బిజినెస్ ను కదిపారు. తమకున్న పరిచయాల్ని పూర్తిస్థాయిలో బయటకుతీశారు. ఓటీటీ డీల్ లాక్ అయితే సినిమాను ఇలా ఎనౌన్స్ చేసి, అలా సెట్స్ పైకి వెళ్లిపోవచ్చనేది వీళ్ల ప్లాన్.

దీని కోసం వాళ్లు అదిరిపోయే మాస్టర్ ప్లాన్ వేశారు. సదరు హీరోను ముందుగా మేకోవర్ చేయించారు. అతడిపై ఫొటోషూట్ చేసి, ఆ మేకోవర్ ఫొటోలకు, స్టోరీలైన్ జతచేసి (దీన్ని ఇంగ్లిష్ లో పిచ్ డెక్ అంటారు) ఓటీటీ కంపెనీలకు పంపించారు.

అంటే.. సినిమా కోసం సదరు హీరో మేకోవర్ అవ్వలేదు. ఓటీటీ డీల్ కోసం మేకోవర్ అయ్యాడన్నమాట. డీల్ లాక్ అయి, మేకోవర్ బాగాలేదు మార్చమని ఓటీటీ సంస్థ కోరితే లుక్ మార్చడానికి రెడీ అన్నమాట. ఇలా తయారైంది టాలీవుడ్ పరిస్థితి.

11 Replies to “హవ్వ.. ఓటీటీ డీల్ కోసం మేకోవర్!”

  1. I watched Agent yesterday and honestly enjoyed the film. While it has its flaws, if you watch it with an open mind, you will be amazed . The hall I watched it at was packed, half of the audience were ladies, mothers and grandmother’s along with their husbands and sons!🥰 . There were screams when the action happened. And I am sure the next one will be bigger and better 

  2. Akhil….. పిచ్చి GA, వాళ్ళు PROFESSIONAL గా WORK చేస్తారు అంతే…..personal గా ఏడవకు…

  3. అసలు అర్థం కానీ విషయం ott కోసం makeover అయితే తప్పేంటో..? సినిమా బిజినెస్..వాడికెలా లాభం ఉంటే అలా చేసుకుంటాడు…దానికి జనం నోర్లు నొక్కుకుందేముంది..సినిమా థియేటర్ రిలీజ్ అయితే ఏంటి OTT లో అయితే ఏంటి..? వాడు యాక్టర్..తన టాలెంట్ చూపించుకుంటాడు నచ్చితే జనం చూస్తారు లేదంటే లేదు..ప్రొడ్యూసర్ కి లాభం కావలి OTT కాకపోతే ఇక్కడ రోడ్ మీద తెర వేసి ప్రదర్శిస్తాడు డబ్బులొస్తాయంటే…వాడి ప్రోడక్ట్..వాడి ఇష్టం..మీడియా మారలేదా..? ప్రింట్ నుండి ఎలక్ట్రానిక్ మీడియా ఇప్పుడు వెబ్ మీడియా అండ్ యూట్యూబ్…మీరు మారినప్పుడు సినిమా ఇండస్ట్రీ మారితే ఏంటి ప్రాబ్లెమ్…అరే భాయ్..దాని మీద జనం బతుకుతున్నారు…ప్రొడ్యూసర్ వాళ్ళకి డబ్బులిస్తున్నాడు..వాడికి ఒక రూపాయి వస్తే ఇంకొక సినిమా మీద పెడతాడు…వాడు తింటాడు…ఉప్పు పప్పు అమ్ముకునే వాడు డైరెక్ట్ సెల్లింగ్ పెట్టి హోమ్ డెలివరీ ఇవ్వడం లేదా..అయ్యో సిగ్గు సిగ్గు….కిరాణా షాప్ లో అమ్మటం మానేసి డైరెక్ట్ ఇంటికిచేస్తున్నాడు అని నవ్వేసుకోవడం లేదు కదా జనం..మరి సినిమా OTT కోసం అమ్ముకుంటేనో makeover అయితేనో ఎందుకు నవ్వేసుకుంటున్నారో..? నీకే తెలియాలి..నీకు కొంచం తెలివి ఉంది అని చెప్పుకోవాలి కాబట్టి పిచ్ డెక్ అని రాసావు…మూవీ కి glimpse లు చేసినట్టే కదా ఇది కూడా..రాంగ్ ఏంటో..? స్పైడర్ సినిమా కి మహేష్ బాబు ఒక glimpse రిలీజ్ చేసాడు జనాలకు ఇంట్రస్ట్ క్రియేట్ చెయ్యటానికి..సినిమా కి దానికి సంబంధం లేదు..వాడు అమ్మోకోవడాన్కి ఎదో చేస్తాడు…వీడు ఎదో చేసుకుంటున్నాడు…ఆల్రెడీ బిజినెస్ లేని హీరోకి పది ఏడిచేకంటే జనానికి కాస్త పనికొచ్చే విషయాలు రాయొచ్చేమో కదా GA

  4. అసలు అర్థం కానీ విషయం ott కోసం makeover అయితే తప్పేంటో..? సినిమా బిజినెస్..వాడికెలా లాభం ఉంటే అలా చేసుకుంటాడు…దానికి జనం నోర్లు నొక్కుకుందేముంది..సినిమా థియేటర్ రిలీజ్ అయితే ఏంటి OTT లో అయితే ఏంటి..? వాడు యాక్టర్..తన టాలెంట్ చూపించుకుంటాడు నచ్చితే జనం చూస్తారు లేదంటే లేదు..ప్రొడ్యూసర్ కి లాభం కావలి OTT కాకపోతే ఇక్కడ రోడ్ మీద తెర వేసి ప్రదర్శిస్తాడు డబ్బులొస్తాయంటే…వాడి ప్రోడక్ట్..వాడి ఇష్టం..మీడియా మారలేదా..? ప్రింట్ నుండి ఎలక్ట్రానిక్ మీడియా ఇప్పుడు వెబ్ మీడియా అండ్ యూట్యూబ్…మీరు మారినప్పుడు సినిమా ఇండస్ట్రీ మారితే ఏంటి ప్రాబ్లెమ్…అరే భాయ్..దాని మీద జనం బతుకుతున్నారు…ప్రొడ్యూసర్ వాళ్ళకి డబ్బులిస్తున్నాడు..వాడికి ఒక రూపాయి వస్తే ఇంకొక సినిమా మీద పెడతాడు…వాడు తింటాడు…ఉప్పు పప్పు అమ్ముకునే వాడు డైరెక్ట్ సెల్లింగ్ పెట్టి హోమ్ డెలివరీ ఇవ్వడం లేదా..అయ్యో సిగ్గు సిగ్గు….కిరాణా షాప్ లో అమ్మటం మానేసి డైరెక్ట్ ఇంటికిచేస్తున్నాడు అని నవ్వేసుకోవడం లేదు కదా జనం..మరి సినిమా OTT కోసం అమ్ముకుంటేనో makeover అయితేనో ఎందుకు నవ్వేసుకుంటున్నారో..? నీకే తెలియాలి..నీకు కొంచం తెలివి ఉంది అని చెప్పుకోవాలి కాబట్టి పిచ్ డెక్ అని రాసావు…మూవీ కి glimpse లు చేసినట్టే కదా ఇది కూడా..రాంగ్ ఏంటో..? స్పైడర్ సినిమా కి మహేష్ బాబు ఒక glimpse రిలీజ్ చేసాడు జనాలకు ఇంట్రస్ట్ క్రియేట్ చెయ్యటానికి..సినిమా కి దానికి సంబంధం లేదు..వాడు అమ్మోకోవడాన్కి ఎదో చేస్తాడు…వీడు ఎదో చేసుకుంటున్నాడు…ఆల్రెడీ బిజినెస్ లేని హీరోకి పది ఏడిచేకంటే జనానికి కాస్త పనికొచ్చే విషయాలు రాయొచ్చేమో కదా

Comments are closed.