ఇంకో పవన్‌కళ్యాణ్‌ అవుతాడా?

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్న క్షణం దగ్గరైంది. ‘ముకుంద’తో నాగబాబు కొడుకు వరుణ్‌ తేజ్‌ పరిచయం అవుతున్నాడు. వరుణ్‌తేజ్‌ ఎలా ఉంటాడనే విషయంలో ఎలాంటి దాగుడు మూతలు లేకుండా ముందే అతడిని…

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్న క్షణం దగ్గరైంది. ‘ముకుంద’తో నాగబాబు కొడుకు వరుణ్‌ తేజ్‌ పరిచయం అవుతున్నాడు. వరుణ్‌తేజ్‌ ఎలా ఉంటాడనే విషయంలో ఎలాంటి దాగుడు మూతలు లేకుండా ముందే అతడిని ఫాన్స్‌కి చూపించేసారు. మామూలుగా కొత్త హీరోని పరిచయం చేసే విషయంలో టీజింగ్‌ ఎక్కువ ఉంటుంది. ముకుందకి అలా ఏమీ లేకుండా డైరెక్టుగా వరుణ్‌తేజ్‌ వీడియోలు చూపిస్తున్నారు.

అతడి నుంచి ఏమి ఎక్స్‌పెక్ట్‌ చేయాలనేది ఫాన్స్‌కి ఒక ఐడియా ఇచ్చేసారు. వరుణ్‌ తేజ్‌ మిగిలిన మెగా హీరోల మాదిరిగా పెద్ద డాన్సర్‌ కాదనే విషయం అయితే స్పష్టమైంది. సో ఈ విషయంలో ఫాన్స్‌ హోప్స్‌ పెట్టుకోనక్కర్లేదు. అలా అని వరుణ్‌ వర్రీ కూడా అవ్వాల్సిన పని లేదు. డాన్సులు రాకుండానే పవన్‌కళ్యాణ్‌ పవర్‌స్టార్‌ అయ్యాడుగా మరి. 

వరుణ్‌ సినిమాల ఎంపిక కూడా పవన్‌కళ్యాణ్‌నే పోలి ఉంది. కమర్షియల్‌ సినిమాతో కాకుండా ఫ్యామిలీ సినిమాతో పరిచయం అవుతున్నాడు. బోయ్‌ నెక్స్‌ట్‌ డోర్‌ తరహా పాత్రతోనే వస్తున్నాడు. పవన్‌ కూడా కెరీర్‌ బిగినింగ్‌లో ఇదే చేసాడు. చిరంజీవి ఇమేజ్‌కి సంబంధం లేకుండా ప్యారలల్‌గా తన ఫాన్‌ బేస్‌ పెంచుకున్నాడు. వరుణ్‌ కూడా బాబాయ్‌ని ఫాలో అవుతూ మాస్‌ సినిమాలకి దూరంగా ఉంటాడా లేక అటో రాయి, ఇటో రాయి వేసుకుంటూ ఏది బెస్ట్‌ అనేది తేల్చుకుంటాడా?