‘గోవిందుడు అందరివాడేలే’ తర్వాత బ్రేక్ తీసుకున్న చరణ్ మళ్లీ జనవరి నెలాఖరు నుంచి పనిలో పడబోతున్నాడు. తన తదుపరి చిత్రానికి శ్రీను వైట్లనే దర్శకుడిగా ఖరారు చేసాడు. శ్రీను వైట్ల రెగ్యులర్ స్టయిల్‌లో కాకుండా ఒక కొత్త పద్ధతిలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేయమని చరణ్ కోరాడు. అతను చెప్పిన లైన్‌కి చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రాజెక్ట్ ముందుకు కదిలింది.
శ్రీను వైట్ల చిత్రాన్ని గ్యాప్ లేకుండా ఫాస్ట్‌గా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏడు నెలల్లో పూర్తి చేసి దసరాకి రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ‘గోవిందుడు అందరివాడేలే’ దసరాకి రిలీజ్ అయి… హాలిడే సీజన్‌ని క్యాష్ చేసుకున్న సంగతి తెలిసిందే. చరణ్ మరోసారి ఫెస్టివ్ పీరియడ్‌నే టార్గెట్‌గా పెట్టుకున్నాడు.
సంక్రాంతి, సమ్మర్ లేదా దసరాకి తన సినిమాలు విడుదలయ్యేట్టు చరణ్ ప్లాన్ చేసుకుంటున్నాడు. అతని సినిమాలు కన్సిస్టెంట్‌గా నలభై కోట్ల పైచిలుకు వసూళ్లు సాధించడానికి ఈ ప్లానింగ్ కూడా ఒక కారణమే అనుకోవాలి. అతని అదృష్టం కొద్దీ పోటీగా వచ్చిన సినిమాలు పల్టీ కొట్టి చరణ్ పని మరింత సులువు చేస్తున్నాయి.