ఆంద్రవాలా సినిమా వచ్చి చాలా కాలమైంది. జూనియర్ ఎన్ టి ఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా ఇద్దరికీ నిరాశే మిగిల్చింది. ఇందులో జూనియర్ తొలి సారిగా తండ్రి కొడుకులుగా నటించారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు జూనియర్ , పూరి కలసి సినిమా చెయ్యలేదు. చాలా సార్లు ఈ ఇద్దరు సినిమా చెయ్యాలని పలువురు నిర్మతాలు ప్రయత్నం కూడా చేశారట. కాని పూరియే సినిమా చెయ్యడానికి కాస్త వెనకడుగు వేశారని ఫిలిం నగర్ టాక్.
ఇంతకీ జూనియర్ కు పూరి మద్య ఏమైనా విభేదాలు ఉన్నాయా అంటే అదీ కారణం కాదని అంటున్నాయి సినిమా వర్గాలు. మరి వీరిద్దరూ ఇంతకాలం ఎందుకు సినిమా చెయ్యలేదు అంటే ….ఒక కారణం ఉంది. పూరి దగ్గర చాలా కాలం పని చేసి వెళ్ళిపోయినా కృష్ణ జూనియర్ దగ్గర చేరాడు. పూరి కి జూనియర్ తో సినిమా చెయ్యాలని మనసులో ఉన్న ప్రతిరోజు కృష్ణ ను చూడాల్సి వస్తుందని పూరి సినిమా చెయ్యడానికి ముందుకు రాలేదని సమాచారం.
జూనియర్ దగ్గర కృష్ణ ఉన్నన్ని రోజులు పూరి జూనియర్ తో సినిమా చెయ్యాలనే ఆలోచన కూడా చెయ్యలేదని పూరి సన్నిహితులు అంటున్నారు. ఇటీవలే కృష్ణ జూనియర్ దగ్గరి నుంచి బయట పడ్డాడు కాబట్టి ఇప్పుడు జూనియర్ అండ్ పూరి కలసి సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వీరి కాంబినేషన్ సెట్ చెయ్యడానికి పలువురు నిర్మాతలు కూడా ట్రై చేస్తున్నారని సమాచారం. మరి ఆంధ్రావాలా -2 తీస్తారో, లేక వేరే ఏదైనా సినిమా తీస్తారో, అసలు వీరిద్దరూ కలసి సినిమా చేస్తారో లేదో కాలమే నిర్ణయించాలి.